సాక్షి, ముంబై : రెండు వర్గాల మధ్య ఘర్షణతో ఆ ప్రాంతం అతలకుతలమైంది. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో శుక్రవారం రాత్రి(మే 11న) చోటుచేసుకుంది. వివరాలివి.. మాట మాట పెరిగి రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో షాపులు, కొన్ని వాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిస్థితిని చక్కదిదే ప్రయత్నం చేశారు. అంతేకాక రెండు గ్రూపులపై టీయర్ గ్యాస్‌ను వదిలారు. సమస్య మరింత ఉద్రిక్తం కాకుండా ఉండేందుకు పోలీసులు సిటీ మొత్తం 144 సెక్షన్ విధించారు.
ఈ ఘర్షణలో జరిగిన కాల్పులో ఓ మైనర్ బాలుడు చనిపోయినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి రెండు కమ్యూనిటీల మధ్య వివాదం నెలకొంది. దీంతో వందల మంది యువకులు రోడ్డుపైకి వచ్చి రాళ్ళను విసిరి గొడవకు పాల్పడ్డారు. కొంతమంది పోలీసులు కూడా ఈ ఘర్షణలో గాయపడినట్లు తెలుస్తోంది.
ఈ వివాదంపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ గొడవలో కాలిపోయిన షాపుల వారి తరపున కేసు వేయాలని అడ్వకేట్ ఖిజార్ పటేల్‌ను ఒవైసీ కోరారు. ఈ వివాదంలో నష్టపోయిన వారికి ఎంఐఎం ట్రస్ట్ తరఫున సాయం అందిస్తామని తెలిపారు. ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment