Bomb blasts case
-
ఆర్ఎస్ఎస్ ఆఫీస్‌పై బాంబు దాడి.. లైవ్ వీడియో
కన్నూర్: కేరళ పయ్యనూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యాలయంపై మంగళవారం తెల్లవారుజామున ఇద్దరు దుండగులు బాంబు విసిరారు. దీంతో భవనం ప్రధాన ద్వారం తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. బాంబు దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ధ్వంసమైన తలుపులు, కుర్చీలు, టేబుళ్ల ఫోటోలు, బాంబు దాడి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దాడికి కొద్ది సమయం ముందు ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని పరిశీలించినట్లు సీసీటీవీలో నమోదైంది. #WATCH केरल: कन्नूर जिले के पय्यानुर में RSS कार्यालय पर बम फेंका गया। पय्यान्नूर पुलिस के अनुसार घटना आज सुबह हुई है। घटना में इमारत की खिड़की के शीशे टूटे। pic.twitter.com/Ii2uQRDif1 — ANI_HindiNews (@AHindinews) July 12, 2022 బాంబు దాడి జరిగిన సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యాలయం మూసి ఉండటం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. 'కన్నూర్ జిల్లా, పయ్యనూర్‌లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కిటికి అద్దాలు ధ్వంసమయ్యాయి.' అని పయ్యనూర్ పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. దాడి జరిగిన ఆర్ఎస్ఎస్ ఆఫీసు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే ఉండటం గమనార్హం. దాడి నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రత పెంచారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దుండగులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. దాడి వెనుక సీపీఎం: బీజేపీ బాంబు దాడి వెనుక సీపీఎం పాత్ర ఉందని ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు ఆరోపించారు. దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. 'ఈ దాడిలో సీపీఎం పాత్ర ఉందని మేము అనుమానిస్తున్నాం. బంగారం స్మగ్లింగ్ వ్యవహారం బహిర్గతమైన తర్వాత అధికార పార్టీ పీకల్లోతు కష్టాల్లోకి జారుకుంది. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటివి చేస్తోంది.' అని బీజేపీ కన్నూర్ జిల్లా అధ్యక్షుడు ఎన్ హరిస్‌దాసన్ పేర్కొన్నారు. ఇదీ చూడండి: Reverse Waterfall: ఆకాశంలోకి ఎగిరే జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా? -
జైపూర్ పేలుళ్ల కేసులో నలుగురికి ఉరి
జైపూర్: 2008 నాటి జైపూర్ వరుస బాంబు పేలుళ్ల ఘటనలో దోషులు నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఆ పేలుళ్లలో 71 మంది మరణించగా, 185 మంది గాయపడిన విషయం తెలిసిందే. దీనిపై ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. సెషన్స్ జడ్జి అజయ్ కుమార్ శర్మ శుక్రవారం తుదితీర్పు వెలువరించారు. దోషులకు రూ.50 వేల జరిమానా విధించారు. ‘వేర్వేరు ప్రాంతాల్లో బాంబులు ఏర్పాటు చేసినందుకు ఐపీసీ 302 సెక్షన్ కింద నలుగురు దోషులకు మరణశిక్ష విధించారు’ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీచంద్ తెలిపారు. ఈ తీర్పుపై హైకోర్టుకు వెళతామని దోషుల తరఫు లాయర్ చెప్పారు. రెండు రోజుల క్రితం మహమ్మద్ సైఫ్, మహమ్మద్ సర్వార్ అజ్మీ, మహమ్మద్ సల్మాన్, సైఫురీష్మన్ అనే నలుగురిని దోషులుగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పునివ్వగా మరో నిందితుడు షాబాజ్ హుస్సేన్‌ను బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్దోషిగా విడుదల చేసింది. నిందితులుగా ఉన్న మరో ఇద్దరు అదే ఏడాది ఢిల్లీల్దో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. -
అంతా నిజమే చెప్పారు...
సాక్షి, సిటీబ్యూరో: ఉగ్రవాద సంబందిత, కుట్ర కేసుల విచారణలో ఇతర ఆధారాలతో పాటు సాక్షులకూ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అనేక కేసుల్లో ప్రాసిక్యూషన్‌కు సాక్షులు ఎదురు తిరిగిన (హోస్టైల్ కావడం) కారణంగా ఆ కేసులు వీగిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. గత ఏడాది న్యాయస్థానం కొట్టి వేసిన మక్కా మసీదులో బాంబు పేలుడు కేసే ఇందుకు తాజా ఉదాహరణ. అయితే జంట పేలుళ్ల కేసులో సాక్షులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. సోమవారం తీర్పు వెలువడిన 2007 నాటి జంట పేలుళ్ల కేసుల్లో 286 మంది సాక్షులు ఉండగా, అందులో ఏ ఒక్కరూ ఎదురు తిరగలేదు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తామంతా ఉగ్రవాదానికి వ్యతిరేకమంటూ చాటారు. నాడు చూసింది చూసినట్లు చెప్పడంలో ఏ మాత్రం వెనుకాడలేదు. ఫలితంగానే అరెస్టైన ఐదుగురు నిందితుల్లో ఇద్దరికి ఉరి, మరొకరికి జీవితఖైదు పడింది. నిందితుల్లో ఒకరైన ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖాష్‌ను నిర్ధోషిగా ప్రకటిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాలు చేయాలని ప్రాసిక్యూషన్ నిర్ణయించింది. 2007 ఆగస్టు 25న జరిగిన జంట పేలుళ్లకు సంబంధించి మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. ఈ ఉదంతాలపై ప్రాథమికంగా సైఫాబాద్, సుల్తాన్‌బజార్, మలక్‌పేట ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. ఉగ్రవాద సంబందిత కేసులు కావడంతో వీటిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) బదిలీ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ జంట పేలుళ్ల అనంతరమే రాష్ట్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై పోరుకు ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్) విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ వింగ్‌కు తొలినాళ్లల్లో నిఘా, ఆపరేషన్స్, దర్యాప్తు బాధ్యతలు అప్పగిస్తూ పోలీసుస్టేషన్ హోదా ఇచ్చారు. దీంతో సిట్ నుంచి ఈ మూడూ ఆక్టోపస్‌కు వెళ్లాయి. కేసు దర్యాప్తు పూర్తి చేసిన ఆక్టోపస్ అధికారులు 2009 మే, జూన్ నెలలో మూడు అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఇది జరిగిన ఏడాది కాలానికే ఆక్టోపస్‌ను కేవలం కమాండో ఫోర్స్‌గా మార్చిన ప్రభుత్వం పోలీసు స్టేషన్ హోదాను ఉగ్రవాద వ్యతిరేక విభాగమైన కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) సెల్‌కు కట్టబెట్టింది. దీంతో ఈ కేసులు సీఐ సెల్‌కు బదిలీ అయ్యాయి. కేసు విచారణ మొత్తం వీరి పర్యవేక్షణలోనే సాగింది. గత కొన్ని నెలలుగా చర్లపల్లి కేంద్ర కారాగారంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసులను విచారించారు. అప్పట్లో లుంబినీపార్క్‌లో జరిగిన పేలుడులో మృతులు, క్షతగాత్రుల్లో మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులూ ఉన్నారు. ఈ 11 ఏళ్లల్లో వారు చదువు పూర్తి చేసుకోవడంతో పాటు వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారి వివరాలన్నీ సేకరించిన దర్యాప్తు అధికారులు వాయిదాలకు తీసుకురావడం, వచ్చేలా వారిని ఒప్పించడం, బ్రీఫింగ్ ఇప్పించడం, సాక్ష్యం చెప్పించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. గోకుల్‌చాట్, దిల్‌సుఖ్‌నగర్‌లో దొరికిన పేలని బాంబు కేసుల్లో అత్యధికులు స్థానికులే సాక్షులుగా ఉన్నారు. ఆద్యంతం ఎక్కడా సాక్షుల వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వారికి భరోసాను వారికి కల్పించి కోర్టు వరకు వచ్చేలా చేశారు. ఫలితంగానే ఈ నేరంలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదులకు ఉరి శిక్ష పడింది. సాక్ష్యం చెప్పిన 286 మందిలో ఓ ఉగ్రవాది బంధువు కూడా ఉండటం, ఆయన సైతం తన బంధువుతో పాటు ఇతర టెర్రరిస్టులకూ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం గమనార్హం. మరోపక్క అభియోగాలు వీగిపోయిన ఇద్దరిలో సాదిఖ్‌పై ఇక్కడి కేసుల్లో సరైన సాక్షాలు లేవని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అయితే ఫారూఖ్‌కు సంబంధించి మాత్రం నేరం నిరూపించగలమని, ఈ నేపథ్యంలోనే పై కోర్టులో తీర్పును సవాల్ చేస్తామని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ఈ కేసుల్లో జీవితఖైదు పడిన తారీఖ్ అంజుమ్ హసన్ పాత్ర పరిమితమని ఆ శిక్ష సమంజసమే అని పేర్కొంటున్నారు. ఇదీ కేసుల్లో సాక్షుల సంఖ్య... కేసు సాక్షులు గోకుల్‌చాట్ పేలుడు 147 లుంబినీపార్క్ పేలుడు 93 దిల్షుక్నగర్ పేలని బాంబు 46 -
మూడు బాంబుల టైమర్లుగా 'సమయ్' వాచీలు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని గోకుల్‌చాట్, లుంబినీపార్క్, ఆపై దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చి సెంటర్, 107 బస్టాప్‌లతో పాటు దేశ వ్యాప్తంగా 2005 ఫిబ్రవరి నుంచి 11 విధ్వంసాలకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సంస్థ వినియోగించిన బాంబుల్లో టైమర్లుగా ‘సమయ్’ వాచీలనే వాడారు. వేర్వేరు సమయాల్లో తయారు చేసిన బాంబుల్లోనూ ఒకే తరహా వాచీలనే ఎందుకు వాడారనే మిస్టరీని 2007 నాటి జంట పేలుళ్ల కేసులను దర్యాప్తు చేసిన ఆక్టోపస్ అధికారులు ఛేదించారు. సదరు కంపెనీ తయారు చేసే వాచీల్లో ఉన్న స్పేస్ (ఖాళీ)తో పాటు ప్రత్యేకమైన అలారం కనెక్షన్ కారణంగానే దీనిని ఎంపిక చేసుకున్నట్లు గుర్తించారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు నగరంలో చోటు చేసుకున్న జంట పేలుళ్ల నుంచి ఢిల్లీ పేలుళ్ల వరకు ఒకే తరహా బాంబులను వినియోగించారు. ‘వీ’ ఆకారంలో ఉండే ఈ బాంబులను సాంకేతిక పరిభాషలో ‘షేప్డ్ బాంబ్స్’గా పిలుస్తారు. అమ్మోనియం నైట్రేట్ సమ్మిళిత పేలుడు పదార్థమైన ‘నియోజల్–90’ని వీటిలో వాడారు. బాంబు పేలిన వెంటనే అపరిమిత వేగంతో దూసుకుపోయి ఎదుటి వారి శరీరాలను ఛిద్రం చేసేందుకు సైకిల్ చెర్రాలను స్లి్పంటర్స్గా వినియోగించారు. పేలుడు పదార్థాన్ని ఎలక్ట్రిక్ డిటోనేటర్ సాయంతో పేల్చారు. ఈ డిటోనేటర్‌కు ప్రేరణ అందించేందుకు 9 వోల్టుల బ్యాటరీని టైమర్‌తో కలిపి ఉపయోగించారు. బాంబు ఫలానా సమయానికి పేలాలని సెట్ చేసేందుకు టైమర్ అవసరమవుతుంది. ఐఎం సంస్థ దేశ వ్యాప్తంగా జరిపిన అన్ని వరుస పేలుళ్లలోనూ టైమర్‌గా సమయ్ కంపెనీకి చెందిన వాచ్‌లనే ఏర్పాటు చేసింది. ఈ టైమర్ సర్క్యూట్‌ను ఆజామ్గఢ్కు చెందిన ‘సిమి’ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ ఆరిఫ్ బదర్ అలియాస్ లడ్డాన్ తయారు చేశాడు. పాకిస్తాన్లో ఉగ్రవాద శిక్షణ పొందిన ఆరిఫ్ ఆజామ్గఢ్లో ఓ ఎలక్ట్రానిక్ దుకాణం నిర్వహిస్తూ ఆ ముసుగులోనే టైమర్లను తయారు చేశాడు. అంతకు ముందు అజంతా, చైనా వాచీలతో చేసిన ప్రయోగాలు ఫలించలేదు. డిటోనేటర్లకు అవసరమైన ప్రేరణ అందించడానికి 9 వోల్టుల బ్యాటరీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనిని ఉంచే ఖాళీ అజంతా, చైనా వాచీల్లో లేదు. ఆ ఖాళీతో పాటు అలారం కనెక్షన్లో కట్ సౌకర్యం ఉన్న కారణంగానే సమయ్ వాచీలను ఎంపిక చేసుకుని టైమర్ సర్యూ్కట్స్ రూపొందించాడు. మరోపక్క బాంబు పేలాల్సిన సమయాన్ని అలారం ద్వారా నిర్ణయిస్తారు. ఆ సమయం వచ్చిన వెంటనే అలారం మోగడానికి అనువుగా బ్యాటరీ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ విద్యుత్‌ను 9 వోల్టుల బ్యాటరీకి సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందుకు అనువుగా సమయ్ వాచీల్లో అలారం కనెక్షన్‌కు కట్ ఉంటుంది. అనుకున్న ప్రకారం బాంబు పేలడానికి ఈ కనెక్షన్ ఎంతో కీలకం. ఇన్ని అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే అతను ప్రత్యేకంగా వీటినే ఎంపిక చేసుకున్నాడని ఆక్టోపస్ అధికారులు నిర్ధారించారు. ఈ సర్క్యూట్‌కు పాజిటివ్ కనెక్షన్లు (+)ఇవ్వడానికి ఎరుపు, పసుపు, బూడిద రంగు వైర్లను, నెగెటివ్ కనెక్షన్ (–) ఇచ్చేందుకు తెలుపు, నలుపు వైర్లను వాడారని నిర్ధారించారు. ఈ రెండు కనెక్షన్లనూ బాంబును అసెంబుల్ చేసే వ్యక్తి కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే అన్ని ప్రాంతాల్లో ఇవే రంగులను వినియోగించారు. ఐఎం టైమర్ల గుట్టును పసిగట్టడానికి ఆక్టోపస్ అధికారులు అప్పట్లో భారీ అధ్యయనమే చేయాల్సి వచ్చింది. గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌లతో పాటు దిల్‌సుఖ్‌నగర్‌లోని ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వద్ద పెట్టిన బాంబులను రియాజ్ భత్కల్ తయారు చేశాడు. వీటికి టైమర్లను కనెక్ట్ చేసింది మాత్రం సాదిఖ్ షేక్. అప్పట్లో పుణె క్యాంప్ ఏరియాలో ఉన్న ఇతడి వద్దకు వాచీలను తీసుకువెళ్లిన రియాజ్ కనెక్ట్ చేసే విధానాన్ని తెలుసుకున్నాడు. ఈ విషయంతో పాటు మరికొన్ని అంశాలూ ఆధారాలతో నిరూపితం కాని నేపథ్యంలో సాదిఖ్‌పై అభియోగాలు వీగిపోయాయి. కొంత ఊరట... ప్రభుత్వ వైఫల్యం కారణంగానే గోకుల్‌చాట్ కేసులో మిగతా నిందితులు తప్పించుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత కొందరినైనా శిక్షించడం ఊరట కలిగిస్తోంది. నా సోదరి మృతి చెంది 11 ఏళ్లు గడుస్తున్నా తాను పనిచేస్తున్న ఆర్టీసీ నుంచి ఎలాంటి సహాయం, పరిహారం అందలేదు. ఇప్పటికైనా ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలి. – మన్నె చంద్రకళ (గోకుల్‌చాట్ మృతురాలు సుశీల సోదరి) -
ఐఎం ఉగ్రవాదులకు కలిసొచ్చిన చేపల వేట విధానం
సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటకలోని తీర ప్రాంతాల మత్స్యకారులు చేపల వేటకు అవలంభించే విధానమే ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులకు కలిసొచ్చింది. గోకుల్‌చాట్, లుంబినీపార్క్, పుణె, ముంబై, బెంగళూర్లలో పేలుళ్లకూ బాంబులు తయారు చేయడానికి ముష్కరులు ‘మీన్ తూటా’ ల నుంచే పేలుడు పదార్థం సేకరించారు. ఐఎం మాస్టర్ మైండ్ రియాజ్ భత్కల్ వృత్తిరీత్యా సివిల్ కాంట్రాక్టర్. తనకున్న పరిచయాలతో తొలినాళ్లలో అమ్మోనియం నైట్రేట్‌ను సమీకరించుకునేవాడు. అయితే దేశంలోని కొన్ని చోట్ల విధ్వంసాలు జరగడం, ఆ బాంబుల్లో అమ్మోనియం నైట్రేట్ వాడినట్లు తేలడంతో నిఘా పెరిగింది. దీంతో పేలుడు పదార్థం సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్న రియాజ్ కన్ను మీన్ తూటాలపై పడింది. ఇదీ ‘మీన్ తూటా’... కర్ణాటకలోని ఉడిపి, రత్నగిరి, శిరుల్గుప్ప తీరప్రాంతాల మత్స్యకారులు చేపల వేటకు వలలతో పాటు ‘మీన్ తూటా’లను వినియోగిస్తుంటారు. అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ (పేస్టులా ఉండే పదార్థం) ప్యాకెట్ లో డిటోనేటర్ ఏర్పాటు చేసి దానికి చిన్న ఫ్యూజ్ వైర్ జత చేస్తారు. ఈ వైరును వెలిగించి నీటిలో తడవకుండా చిన్న కుండలో పెట్టి కాస్త బరువుతో పడవకు కాస్త దూరంగా సముద్రంలో పడేస్తారు. స్లర్రీ పేలుడు ధాటికి వెలువడే షాక్ వేవ్స్ ప్రభావంతో ఆ ప్రాంతంలోని చేపలన్నీ చనిపోయి పైకి తేలుతాయి. దీన్నే అక్కడి మత్స్యకారులు ‘మీన్ తూటా’ అంటారు. మీన్ అంటే చేప, తూటా అంటే పేలేది అని అర్థం. ఈ విధానం నిషేధం అయినప్పటికీ ఎవరూ పట్టించుకోవట్లేదు. దేశం దాటే వరకు... ఉత్తర కన్నడ, మంగుళూరుల్లోని కొన్ని ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతుడడంతో నిర్మాణరంగంలో వినియోగించడానికి అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ విక్రయానికి పలువురు లైసెన్సులు పొందారు. ప్రభుత్వ నిఘా, ఆడిట్ పక్కాగా లేకపోవడంతో ఆ వ్యాపారులే అక్రమంగా మత్స్యకారులకు ‘మీన్ తూటా’లు అమ్మేస్తుంటారు. ఈ విధానాలు అధ్యయనం చేసిన రియాజ్ పేలుడు పదార్థం సమీకరణకు ఇదే మార్గాన్ని ఎంచుకున్నాడు. 2008లో దేశం దాటే వరకు తానే సమీకరించాడు. ఆ ఏడాది ఐఎం ఉగ్రవాదుల అరెస్టులు ప్రారంభం కావడంతో దేశం దాటేశాడు. ఆ తర్వాత పేలుడు పదార్థం సమీకరించే మార్గం తెలిసినప్పటికీ.. దాన్ని ఎలా సేకరించాలి? ఎవరితో అవసరమైన వారికి అందించాలి? అంశంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. భత్కల్ ప్రాంతానికి చెందిన అనేక మందికి ఎరవేసిన రియాజ్... అనుచరుడు అఫాఖీని ‘మీన్ తూటా’లు ఖరీదు చేయడానికి వినియోగించుకున్నాడు. పాక్ నుంచి రియాజ్ ఇచ్చే ఆదేశాల ప్రకారం అఫాఖీ పని చేసేవాడు. చేపల వేటకని మీన్తూటాలు తెప్పించేవాడు. వీటిలోని స్లర్రీ ప్యాకెట్లను పేలుళ్లు జరిపే ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదులకు అనుచరుల ద్వారా పంపడం లేదా వారినే మంగుళూరు, బెంగళూరు రప్పించి అప్పగించడం చేసేవాడు. ఈ అమ్మోనియం నైట్రేట్ స్లర్రీని వినియోగించే ఉగ్రవాదులు బాంబులు తయారు చేసి పేల్చారు. అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ దుర్వినియోగం కాకుండా.. ఉత్పత్తి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. తయారు చేసిన నాటి నుంచి గరిష్టంగా ఆరు నెలలు మాత్రమే అది సమర్థంగా పని చేస్తుంది. ఆ తర్వాత అందులోని శక్తి తగ్గిపోయి పెద్దగా ప్రభావం చూపదు. అయితే ఐఎం ఉగ్రవాదులు చిన్నస్వామి స్టేడియం, జంగ్లీ మహరాజ్ రోడ్లలో పేలుళ్లకు వినియోగించిన స్లర్రీ ఎక్స్పైర్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆ రెండు చోట్లా దాంతో తయారు చేసిన బాంబులు పేలడంతో తీవ్రత తక్కువగా ఉండి ప్రాణనష్టం జరగలేదు. ముష్కరుల తరలింపునకు సన్నాహాలు... జంట పేలుళ్లతో పాటు పేలని బాంబు కేసులో దోషులుగా తేలిన ఉగ్రవాదులు అనీఖ్, అక్బర్, తారీఖ్లతో పాటు ఈ కేసుల్లో అభియోగాలు వీగిపోయిన సాదిఖ్, ఫారూఖ్‌లను (వీరిపై ఇతర రాష్ట్రాల్లో కేసులున్నాయి. దీంతో జైలు నుంచి బయటకు రారు) ముంబై క్రైమ్ బ్రాంచ్ సహా ఇతర విభాగాల అధికారులు పట్టుకున్నారు. వీరిపై దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదై ఉన్నాయి. ఈ ఉగ్రవాదుల్ని ఆయా కారాగారాల నుంచి ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చారు. అలాగే మిగిలిన రాష్ట్రాల వారూ తీసుకెళ్లాల్సి ఉంది. ఇప్పుడు ఇక్కడి కేసుల విచారణ, శిక్షల విధింపు సైతం పూర్తి కావడంతో తమ తమ కేసులకు సంబంధించి తీసుకెళ్లడానికి ఇతర రాష్ట్రాల పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం న్యాయస్థానం ఉరిశిక్షలు విధించిన తర్వాత కూడా ముష్కరుల ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదని చర్లపల్లి జైలు అధికారులు చెబుతున్నారు. వీరిలో ఏ కోణంలోనూ పశ్చాత్తాపం కనిపించట్లేదనిపేర్కొంటున్నారు. -
అతడు ఊహాచిత్రాలు గీయడంలో దిట్ట
సాక్షి, సిటీబ్యూరో:నగరంలో జరిగిన జంట పేలుళ్ల కేసు దర్యాప్తు ఊహాచిత్రాలతో మొదలైంది. లుంబినీపార్క్‌లో బాంబు పెట్టిన వ్యక్తి (ఆ తర్వాత ఇతడు అనీఖ్ అని తేలింది) ముఖ కవళికల్ని అక్కడున్న నాసిక్‌కు చెందిన ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు చెప్పారు. వీటి ఆధారంగా స్కెచ్ రూపొందించడానికి ఎవరిని సంప్రదించాలా? అని నగర పోలీసులు ఆలోచిస్తున్న తరుణంలో వీరికి స్ఫురించిన పేరు నరేష్ కోడె. దేశవ్యాప్తంగా ఉగ్రవాద సంబంధ కేసులు దర్యాప్తు చేసే అన్ని విభాగాలు, అధికారులకు ఈ పేరు సుపరిచితమే. ముంబైకి చెందిన నరేష్ 14ఏళ్ల వయసులో ఈ వృత్తిని స్వీకరించి.. ఇప్పటి వరకు 12వేల మంది అనుమానితులకు సంబంధించిన ఊహా చిత్రాలు రూపొందించాడు. వీటిలో అత్యధికం నిందితులను పోలి ఉండగా... సిటీతో సహా మరికొన్ని చోట్ల మాత్రం పోలికలు సరిపోలేదు. 90శాతం సక్సెస్... 2007 ఆగస్టు 25న రాజధానిలో జంట పేలుళ్లు చోటుచేసుకున్న తర్వాత ప్రాథమికంగా దర్యాప్తు చేసిన నగర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) కోడెను సంప్రదించింది. హుటాహుటిన ముంబై నుంచి మరుసటి రోజే నగరానికి వచ్చిన నరేష్ లుంబినీపార్క్‌లో క్షతగాత్రులైన బాధితులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ఆధారంగా ఊహా చిత్రాన్ని రూపొందించి అందించాడు. దీని ఆధారంగానే నగర పోలీసులు నిందితులను పట్టించిన వారికి అప్పట్లో రివార్డు ప్రకటించారు. 2009లో ముంబైలోని కుర్లా ప్రాంతంలో చోటుచేసుకున్న తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి ఊహాచిత్రం రూపొందించి నిందితుడిని పట్టుకోవడానికి మహారాష్ట్ర పోలీసులకు ఎంతో సహకరించాడు. ముంబైలో జరిగిన 7/11 బ్లాస్ట్, పుణెలోని జర్మన్ బేకరీ పేలుడు, ఘట్కోపర్ బ్లాస్ట్, అయోధ్య, వారణాసి పేలుళ్లతో సహా అనేక కీలక ఉగ్రవాద సంబంధ కేసుల్లో ఊహాచిత్రాలు గీసి అందించాడు. 90 శాతం కేసుల్లో ఈయన గీసిన చిత్రాలు నిందితులను పోలి ఉంటాయి. అయితే లుంబినీపార్క్ విషయంలో మాత్రం అలా కాలేదు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అనీఖ్ షఫీద్ సయ్యద్‌కు... కోడె గీసిన ఊహా చిత్రానికీ పొంతనే లేదని అతడు అరెస్టు అయిన తర్వాత వెలుగులోకి వచ్చింది. -
జంట పేలుళ్ల కేసులో నేడే తుది తీర్పు
-
పశ్చిమబెంగాల్ బీజేపీలో అసీమానంద!
కోల్‌కతా: హైదరాబాద్‌లో 2007 మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో ఇటీవల నిర్దోషిగా విడుదలైన హిందుత్వ బోధకుడు స్వామి అసీమానంద(66)పై పశ్చిమబెంగాల్ బీజేపీ దృష్టి సారించింది. పశ్చిమబెంగాల్లో బీజేపీని పటిష్టం చేసేందుకు అసీమానంద సేవల్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు మీడియాకు తెలిపారు. కాగా, ఈ విషయమై బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ స్పందిస్తూ.. ‘స్వామి అసీమానంద వ్యక్తిగతంగా నాకు చాలాకాలంగా తెలుసు. బెంగాల్‌కు వచ్చి పార్టీ కోసం పనిచేసే విషయమై ఆయనతో మాట్లాడతాను. అసీమానంద రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాల్లో గతంలో చాలాకాలం పనిచేశారు. ఆయన పార్టీకి చాలారకాలుగా ఉపయోగపడతారు’ అని వ్యాఖ్యానించారు. -
రాజీనామా కాదు.. వీఆర్ఎస్ తీసుకుంటా
సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇటీవల తీర్పునిచ్చి, అనంతరం తన పోస్టు కు రాజీనామా చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం జడ్జి కె.రవీందర్‌రెడ్డి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. రాజీనా మా విషయంలో పునరాలోచనలో పడ్డ ఆయన, సన్నిహితులతో చర్చించి.. తాను ఇచ్చిన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. రాజీనామా లేఖ స్థానంలో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం తాజాగా హైకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తు నిబంధనల మేర లేకపోవడంతో హైకోర్టు దానిని వెనక్కి ఇచ్చేసింది. నిర్దిష్ట ఫార్మాట్ ప్రకారం దర ఖాస్తు చేసుకోవాలని రవీందర్‌రెడ్డికి స్పష్టం చేసింది. వీఆర్ఎస్ నిర్ణయం దృష్ట్యా ఆయన గురువారం విధులకు హాజరయ్యారు. మక్కా మసీదు కేసులో ఉదయం తీర్పు వెలువరించిన రవీందర్‌రెడ్డి, సాయంత్రం కల్లా రాజీనామా చేయడం సంచలనం సృష్టించిం ది. అసలు ఆయన ఎందుకు రాజీనామా చేశారో ఇప్పటికీ బహిర్గతం కాలేదు. అవినీతి ఆరోపణల వల్లే రాజీనామా చేశారని జాతీయ మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. 2 రోజుల పాటు తర్జనభర్జన అనంతరం, రాజీనామా చేస్తే, ఇన్నేళ్ల సర్వీసు వృథా అవుతుందని, రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలేవీ దక్కవని సన్నిహితులు చెప్పడం తో ఆయన పునరాలోచనలో పడ్డారు. అనంతరం రాజీనామాను ఉపసంహరించుకుంటున్నానని, దాని స్థానంలో వీఆర్ఎస్కు అనుమతించాలని హైకోర్టును కోరారు. నిబంధనల ప్రకారం వీఆర్ఎస్కు 3 నెలల నోటీసు తప్పనిసరి. దీంతో ఆయన స్వయంగా హైకోర్టుకు వెళ్లి వీఆర్ఎస్ దర ఖాస్తును సమర్పించారు. పదవీవిరమణ (58 ఏళ్లు)కు సమీపంలో ఉన్న తనకు మరో రెండేళ్ల పొడిగింపు వచ్చే అవకాశం లేదన్న నిర్ణయానికి వచ్చిన తర్వాతే రవీందర్‌రెడ్డి వీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారని నాంపల్లి కోర్టు వర్గాలు చెబుతున్నాయి. 58 నుంచి 60 ఏళ్లకు పొడిగింపునిచ్చే విషయంలో హైకోర్టు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. పొడిగింపును ఇవ్వదలచిన న్యాయాధికారి పనితీరు, నీతి నిజాయితీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటుంది. -
ఎల్బీనగర్లో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు
సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్ల కేసు విచారణకు ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టు భవనంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేకకోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణ ప్రస్తుతం నాంపల్లి క్రిమినల్ కోర్టు భవనంలోని ఎన్ఐఏ కోర్టులో సాగుతోంది. ఇక్కడికి నిందితులను తరలించడం, తిరిగి జైలుకు తీసుకెళ్లడం పోలీసులకు తలకుమించిన భారంగా మారింది. భద్రతాకారణాల దృష్ట్యా రంగారెడ్డి కోర్టు భవనంలోకి ఎన్ఐఏ కోర్టును మార్చాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో తదుపరి ఈ కేసు విచారణ ఎల్బీనగర్లో జరుగనుంది. ఈ కేసులో అరెస్టు అయిన ఉగ్రవాదులు యాసిన్ భత్కల్, తెహసీన్, హడ్డీ, వఖాస్‌లు చర్లపల్లి జైల్లో.. ఎజాజ్ షేక్ ఢిల్లీ, అఫాఖీ, సద్దాం బెంగుళూరు జైలులో ఉన్నారు. వహీద్ అనే మరో అనుమానితుడు దుబాయ్‌లో ఉగ్ర కేసులో పట్టుబడి అక్కడి జైలులో ఉంటున్నాడు. ఈ కేసు విచారణను వేగవంతం చేసేందుకు ఎన్ ఐఏ అధికారులు ఇతర రాష్ట్రాల జైళ్లలో ఉన్న ఉగ్రవాదులను ఇక్కడికి తరలించేందుకు సిద్ధమవుతున్నారు.