నిందితుడిని జైపూర్ కోర్టుకు తీసుకొస్తున్న దృశ్యం
జైపూర్: 2008 నాటి జైపూర్ వరుస బాంబు పేలుళ్ల ఘటనలో దోషులు నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఆ పేలుళ్లలో 71 మంది మరణించగా, 185 మంది గాయపడిన విషయం తెలిసిందే. దీనిపై ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. సెషన్స్ జడ్జి అజయ్ కుమార్ శర్మ శుక్రవారం తుదితీర్పు వెలువరించారు. దోషులకు రూ.50 వేల జరిమానా విధించారు.
‘వేర్వేరు ప్రాంతాల్లో బాంబులు ఏర్పాటు చేసినందుకు ఐపీసీ 302 సెక్షన్ కింద నలుగురు దోషులకు మరణశిక్ష విధించారు’ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీచంద్ తెలిపారు. ఈ తీర్పుపై హైకోర్టుకు వెళతామని దోషుల తరఫు లాయర్ చెప్పారు. రెండు రోజుల క్రితం మహమ్మద్ సైఫ్, మహమ్మద్ సర్వార్ అజ్మీ, మహమ్మద్ సల్మాన్, సైఫురీష్మన్ అనే నలుగురిని దోషులుగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పునివ్వగా మరో నిందితుడు షాబాజ్ హుస్సేన్‌ను బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్దోషిగా విడుదల చేసింది. నిందితులుగా ఉన్న మరో ఇద్దరు అదే ఏడాది ఢిల్లీల్దో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment