ముస్లింలకు అండగా ఉంటా: మోదీ | PM Modi meets Muslim leaders, promises full support to community | Sakshi
Sakshi News home page

ముస్లింలకు అండగా ఉంటా: మోదీ

Published Tue, Apr 7 2015 1:22 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ముస్లింలకు అండగా ఉంటా: మోదీ - Sakshi

ముస్లింలకు అండగా ఉంటా: మోదీ

న్యూఢిల్లీ: ముస్లింలకు అండగా ఉంటానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ముస్లింలలోని అన్ని వర్గాల సామాజిక పరిస్థితులను మెరుగుపరుస్తామని, విద్యారంగంలో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన అన్నారు. ఈ మేరకు సోమవారం తనను కలసిన ముస్లింమత నాయకుల ప్రతినిధి బృందానికి ప్రధాని హామీ ఇచ్చారు. జాతి నిర్మాణంలో ముస్లిం యువత పాలు పంచుకోవాలని, వారికి తగిన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రధాని పేర్కొన్నారు.

అలాగే మదర్సాలు, మసీదులు, దర్గాలకు సంబంధించిన ఆస్తుల సమస్యలు పరిష్కరిస్తామని మోదీ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా ప్రతినిధితోపాటు, మహారాష్ట్ర, తమిళనాడు, యూపీ, మధ్యప్రదేశ్‌లోని వివిధ దర్గాలకు చెందిన ప్రతినిధులు ప్రధానిని కలసినవారిలో ఉన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement