సాక్షి, హైదరాబాద్: రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్–జబల్పూర్, జబల్పూర్–తిరునల్వేలిల మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జబల్పూర్–సికింద్రాబాద్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (1704) ఈ నెల 8, 15, 22, 29 నవంబర్ 5, 12 తేదీల్లో రాత్రి 8కి జబల్పూర్‌లో బయల్దేరి మర్నాడు సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. సికింద్రాబాద్–జబల్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (1703) ఈ నెల 9, 16, 23, 30, నవంబర్ 6, 13 (సోమవారాల్లో) తేదీల్లో రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మర్నాడు సాయంత్రం 5.15 గంటలకు జబల్పూర్ చేరుతుంది.
తిరునల్వేలి– జబల్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (02194) ఈ నెల 11, 18, 25, నవంబర్ 1, 8 తేదీ(గురువారాలు)ల్లో ఉదయం 9.30 గంటలకు జబల్పూర్‌లో బయల్దేరి తిరునల్వేలికి శనివారాల్లో ఉదయం 4.45 గంటలకు చేరుతుంది. జబల్పూర్–తిరునల్వేలి వీక్లీ ఎక్స్‌ప్రెస్ (02193) ఈ నెల 13, 20, 27, నవంబర్ 3, 10 తేదీ(శనివారాలు)ల్లో తిరునల్వేలిలో సాయంత్రం 5.45 గంటలకు బయల్దేరి సోమవారాల్లో ఉదయం 11.15 గంటలకు జబల్పూర్ చేరుతుంది.
సికింద్రాబాద్–జబల్పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
Published Tue, Oct 9 2018 1:51 AM | Last Updated on Tue, Oct 9 2018 1:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment