సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాకినాడ–సికింద్రాబాద్, సంత్రగాచి–చెన్నై సెంట్రల్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమశంకర్‌కుమార్ బుధవారం తెలిపారు. కాకినాడ– సికింద్రాబాద్ (82715/ 82716) ప్రత్యేక రైలు ఈ నెల 21న సాయంత్రం 6 గంటలకు కాకినాడలో బయలుదేరి మర్నాడు ఉదయం 4.40కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి ఈ నెల 22న ఉదయం 5.50కు సికింద్రాబాద్‌లో బయలుదేరి అదే రోజు సాయంత్రం 6కు కాకినాడ చేరుకుంటుంది.
సంత్రగాచి– చెన్నై సెంట్రల్ (02841/02842) ప్రత్యేక రైలు ఈ నెల 12, 19, 26, నవంబర్ 2 తేదీల్లో ఉదయం 12.40 గంటలకు సంత్రగాచిలో బయలుదేరి మర్నాడు సాయంత్రం 4.40 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుతుంది. తిరిగి ఈ నెల 13, 20, 27, నవంబర్ 3వ తేదీల్లో సాయంత్రం 6.20 కు చెన్నై సెంట్రల్‌లో బయలుదేరి మర్నాడు రాత్రి 11.30 గంటలకు సంత్రగాచి చేరుకుంటుంది.
రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు
Published Thu, Oct 11 2018 1:24 AM | Last Updated on Thu, Oct 11 2018 1:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment