తెలుగు అయ్యప్ప భక్తులపై పోలీసులు దాడి | Police attacked on Ayyappa devotees in Sabari express | Sakshi
Sakshi News home page

తెలుగు అయ్యప్ప భక్తులపై పోలీసులు దాడి

Published Tue, Jan 6 2015 1:20 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

తెలుగు అయ్యప్ప భక్తులపై పోలీసులు దాడి - Sakshi

తెలుగు అయ్యప్ప భక్తులపై పోలీసులు దాడి

కేరళ : కేరళ షోరనూరు రైల్వే స్టేషన్లో శబరి ఎక్స్ప్రెస్లోని తెలుగు అయ్యప్ప భక్తులపై పోలీసులు దాడి చేశారు. దాంతో అయ్యప్ప భక్తులు ఆగ్రహించారు. దీంతో భక్తులంతా షోరనూరు రైల్వే స్టేషన్లో ఆందోళనకు దిగారు. రైల్వే స్టేషన్లో ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ నుంచి శబరిమలై బయలుదేరిన అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బోగిలోకి షోరనూరు ముందు స్టేషన్లో పోలీసులు మఫ్టీలో ఎక్కారు.

రిజర్వేషన్ లేకుండా బోగీలోకి ఎలా ఎక్కుతారంటూ అయ్యప్ప భక్తులు ప్రశ్నించారు. ఆగ్రహించిన మఫ్టీలోని పోలీసులు భక్తులపై దాడి చేశారు. ఆయ్యప్ప భక్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రైల్వే స్టేషన్లో రైలు నిలిపివేసి స్టేషన్లో బైఠాయించి ఆందోళన చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement