Sabari Express
-
షాకింగ్ వీడియో: ట్రైయిన్‌లో టీ ఇలానా వేడి చేసేది! బాబోయ్...
ట్రైయిన్‌లో మనకు రకరకాల పదార్థాలు అమ్ముతుంటారు. ఒక్కోసారి తప్పని పరిస్థితుల్లో లాంగ్ జర్నీ ఐతే అక్కడ ఏం అమ్ముతుంటే అవి కొనుక్కుని తినక తప్పదు. జనాలు ఎక్కువగా తాగేది టీ లేదా కాఫీ. ఎందుకంటే కాసేపు రిలాక్స్ అవ్వడానికి చిన్న కప్పు టీ పడితే చాలు అని చాలా మంది భావిస్తారు. కానీ ఇప్పుడూ ఈ సంగతి గనుక వింటే ట్రైయిన్‌లో టీ తాగడానికి కచ్చితంగా జంకుతారు. వివరాల్లోకెళ్తే....ఒక ట్రైయిన్‌లో టీ అమ్మే వ్యక్తి ఎలా టీని వేడి చేస్తున్నాడో ఇద్దరు ప్రయాణకులు చూసి వీడియో తీశారు. ఆ వీడియోలో వ్యక్తి టీని వేడి చేయడం కోసం శుభ్రంగా లేని ఒక హీటర్ని ఉపయోగించి వేడి చేశాడు. అక్కడ అతను చేసే విధానం చూస్తే వాంతు వచ్చేలా ఉంది. ఈ ఘటన సబరి ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది. పలువురు ప్రయాణికులు సబరి ఎక్స్‌ప్రెస్‌లో విక్రయించే ఆహరపానీయాలు చాలా ఘోరంగా ఉంటాయని చెబుతున్నారు.ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో. దీంతో నెటిజన్లు ఇలాంటి కాంట్రాక్టును రద్దు చేసి సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. View this post on Instagram A post shared by ꧁VISHAL༆ (@cruise_x_vk) (చదవండి: రోడ్డుపై చిరుత కలకలం... భయపెట్టించేలా పరుగు తీసింది) -
శబరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులపై దాడి
ఏపీలోని తెనాలిలో ఘటన ఒంగోలు క్రైం: రైల్వే బెర్తుల విషయంలో తలెత్తిన వివాదం చివరకు ఘర్షణకు దారితీసింది. శబరి ఎక్స్‌ప్రెస్‌లో ఏపీలోని ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడుకి చెందిన ప్రయూణికులను తెనా లి రైల్వే స్టేషన్లో వంద మందికి పైగా స్థానికులు తీవ్రంగా కొట్టారు. ఒకరిని అపహరించుకు వెళ్లా రు. తెనాలి జీఆర్పీ పోలీసులు పట్టించుకోకపోవడంతో ఒంగోలు చేరుకోగానే బాధితులు ఇక్కడి జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదుచేశారు. కరేడుకి చెం దిన మాధవి, సురేష్, సంధ్య, భరత్, చల్లా కోటేశ్వ రి, మర్రి ఆదిరెడ్డి, మర్రి వెంకటలక్ష్మి, చల్లా విష్ణుప్రియ, కృష్ణలు ఈ నెల 8న షిర్డీ వెళ్లారు. తిరుగు ప్రయూణంలో శుక్రవారం శబరి రైలులోని ఎస్-6 బోగీలోకి ఎక్కారు. బెర్తుల విషయంలో తెనాలికి చెందిన 20 మందికి, వీళ్లకు మధ్య ఘర్షణ జరి గింది. ఈ గొడవను మర్చిపోని తెనాలి ప్రయూణికులు రైలు తెనాలి చేరుకునేలోపే వాళ్ల బంధువులు, స్నేహితులకు ఫోన్లు చేశారు. రైలు తెనాలికి వచ్చి ఆగాక దాదాపు 100 మంది వీరిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారని బాధితులు వాపోతున్నారు. కరేడుకి చెందిన 9 మందిని తీవ్రంగా కొట్టి అందులో సురేష్ అనే వ్యక్తిని తీసుకెళ్లిపోయారు. ఘర్షణలో సంధ్య అనే ప్రయాణికురాలి కుడిచేయి విరిగింది. బాధితులను రిమ్స్‌కు తరలించారు. -
శబరి ఎక్స్‌ప్రెస్‌కు అదనపు బోగీలు
హైదరాబాద్: అయ్యప్ప భక్తుల రద్దీని దష్టిలో ఉంచుకొని హైదరాబాద్-త్రివేండ్రమ్ శబరి ఎక్స్‌ప్రెస్ (17229/17230) రైలుకు అదనపు బోగీని ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు వచ్చే డిసెంబర్ 3వ తేదీ నుంచి 2016 ఫిబ్రవరి 1వ తేదీ వరకు అదనంగా ఒక స్లీపర్‌క్లాస్ బోగీని తాత్కాలికంగా ఏర్పాటు చేస్తారు. -
సికింద్రాబాద్ బాలుడు ఒంగోలులో ప్రత్యక్షం
ఒంగోలు క్రైం : సికింద్రాబాద్‌లోని పద్మశాలినగర్‌లో నివాసం ఉంటున్న దండి నిశ్చయత్ ప్రసాద్ (12) సోమవారం ఒంగోలులో ప్రత్యక్షమయ్యాడు. శబరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ మంచినీటి కోసం ఒంగోలు రైల్వేస్టేషన్లో దిగి తాగుతుండగా రైలు బయల్దేరి వెళ్లిపోయింది. రెండో ప్లాట్‌ఫాంపై ఏడుస్తూ కూర్చున్న ఆ బాలుడిని రైల్వేస్టేషన్ మేనేజర్ షేక్ మహ్మద్‌ఆలీబాషా గమనించి ఒంగోలు రైల్వే జీఆర్పీ ఎస్సై పి.భావనారాయణకు సమాచారం అందించారు. ఎస్సై వచ్చి ఆ బాలుడిని చేరదీసి చైల్డ్‌లైన్ ప్రతినిధి బీవీ సాగర్‌కు సమాచారం అందించారు. సాగర్ జీఆర్పీ పోలీసుస్టేషన్‌కు వెళ్లి బాలుడికి సంబంధించిన వివరాలు సేకరించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో ఏడో తరగతి చదువుతున్న నిశ్చయత్ ప్రసాద్‌కు తండ్రి రాజేష్ ఏడాది క్రితం చనిపోయాడు. తల్లి సరిత బాలుడిని తరుచూ కొట్టడం, వేధించటం వంటివి చేస్తుండటంతో శ్రీకాళహస్తిలోని తన పెద్దనాన్న వద్దకు వెళ్లాలని శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. శ్రీకాళహస్తి సమీపంలోని దైనేడులో ఉంటున్న బాలుడి పెదనాన్నతో సాగర్ ఫోన్లో మాట్లాడారు. తన తమ్ముడికి తనకు కొన్నేళ్ల క్రితం గొడవలు వచ్చాయని, మనస్పర్థల కారణంగా తమ కుటుంబాల మధ్య సంబంధాలు లేవని, ఆ బాలుడితో తనకెలాంటి సంబంధం లేదని తెగేసి చెప్పాడు. చేసేది లేక బాలుడిని బాలల సంక్షేమ మండలి సభ్యుల ముందు హాజరు పరిచారు. వారి ఆదేశాల మేరకు ఆ బాలుడిని హౌసింగ్ బోర్డులోని హోంకు తరలించారు. -
తెలుగు అయ్యప్ప భక్తులపై పోలీసులు దాడి
కేరళ : కేరళ షోరనూరు రైల్వే స్టేషన్లో శబరి ఎక్స్‌ప్రెస్‌లోని తెలుగు అయ్యప్ప భక్తులపై పోలీసులు దాడి చేశారు. దాంతో అయ్యప్ప భక్తులు ఆగ్రహించారు. దీంతో భక్తులంతా షోరనూరు రైల్వే స్టేషన్లో ఆందోళనకు దిగారు. రైల్వే స్టేషన్లో ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ నుంచి శబరిమలై బయలుదేరిన అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బోగిలోకి షోరనూరు ముందు స్టేషన్లో పోలీసులు మఫ్టీలో ఎక్కారు. రిజర్వేషన్ లేకుండా బోగీలోకి ఎలా ఎక్కుతారంటూ అయ్యప్ప భక్తులు ప్రశ్నించారు. ఆగ్రహించిన మఫ్టీలోని పోలీసులు భక్తులపై దాడి చేశారు. ఆయ్యప్ప భక్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రైల్వే స్టేషన్లో రైలు నిలిపివేసి స్టేషన్లో బైఠాయించి ఆందోళన చేపట్టారు. -
శబరిలో దళారులు
రిజర్వేషన్ కేంద్రాల్లో తిష్ట అయ్యప్ప భక్తులకు దొరకని రైలు టికెట్లు బ్లాక్‌లో రెట్టింపు ధరలకు విక్రయం అక్రమార్కులకు అధికారులు, సిబ్బంది సహకారం సిటీబ్యూరో: శబరి ఎక్స్‌ప్రెస్‌లో దళారులు పడ్డారు. శబరిమలైకి వెళ్లే అయ్యప్ప భక్తులను దోచేస్తున్నారు. బుకింగ్ కేంద్రాల్లో తిష్టవేసి టికెట్లను ఎగరేసుకుపోతున్నారు. ఉదయం బుకింగ్ ప్రారంభమైన రెండు నిమిషాల్లో అడ్వాన్స్ రిజర్వేషన్లు బుక్ అయిపోతున్నాయి. ముందుగా కొనుగోలుచేసిన టికెట్లను భక్తులకు రెట్టింపు ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి వెళ్లే సుమారు రెండు లక్షల మంది భక్తులకు శబరి ఎక్స్‌ప్రెస్ ఒక్కటే అందుబాటులో ఉండడం దళారులకు వరమైంది. రైల్వే అధికారులు, బుకింగ్ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది సహకారంతో యథేచ్ఛగా దందా కొనసాగుతోంది. బుకింగ్ కేంద్రాల వద్ద అక్రమాలను అరికట్టాల్సిన నిఘా నీడలోనే ఈ వ్యవహారం సాగుతుండడం గమనార్హం. నవంబర్ 16 నుంచి జనవరి 16 వరకు అయ్యప్ప ఆలయం తెరిచి ఉంటుంది. సీజన్ కావడంతో పెద్ద ఎత్తున భక్తులు నగరం నుంచి శబరిమలైకి వెళ్తుంటారు. ఇక్కడి నుంచి శబరి ఎక్స్‌ప్రెస్ మాత్రమే కొట్టాయం వెళుతుంది. ఈ రైలుకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ రైలు టికెట్ల కోసం సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన రైల్వేస్టేషన్లతో పాటు, ఎంఎంటీఎస్ స్టేషన్లు, ఇతర రిజర్వేషన్ కేంద్రాల వద్ద దళారులు తిష్ట వేస్తున్నారు. ఉదయం 8 గంటలకు టికెట్ బుకింగ్ ప్రారంభమవుతుంది. రెండు నిమిషాల వ్యవధిలోనే అడ్వాన్స్ టికెట్లను కొనుగోలు చేస్తున్నారు. క్షణాల్లో వెయిటింగ్ లిస్ట్ 150 నుంచి 180కి చేరుతుండడంతో భక్తులు నివ్వెరపోతున్నారు. గంటల తరబడి పడిగాపులు కాసినా టికెట్ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైల్వే అధికారులు, ఉద్యోగుల సాయంతో ఈ అక్రమ వ్యవహారం సాగుతున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రిజర్వేషన్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు పదే పదే చెబుతుండగా... ఆ నిఘా నీడలోనే ఏజెంట్లు, వారి అనుచరులు, దళారులు యథేచ్ఛగా టికెట్లు ఎగరేసుకుపోవడం గమనార్హం. వీటిని భక్తులకురెట్టింపు చార్జీలకు విక్రయిస్తున్నారు. హైదరాబాద్ నుంచి కొట్టాయంకు స్లీపర్ క్లాస్ చార్జీ రూ.575. దళారులు బహిరంగంగా రూ.1200కు విక్రయిస్తున్నారు. డిసెంబర్ వరకు శబరి ఎక్స్‌ప్రెస్ రిజర్వేషన్ వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరిపోయింది. జాడలేని ప్రత్యేక రైళ్లు అయ్యప్ప సీజన్ ప్రారంభమైనా దక్షిణ మధ్య రైల్వే ఇంతవరకూ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయలేదు. చివరి క్షణాల్లో హడావిడిగా ప్రత్యేక రైళ్లను వేసి, తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం కంటే... రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందే వీటిని ప్రకటించాలని భక్తులు కోరుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఏటా 2 లక్షల మందికిపైగా భక్తులు శబరికి వెళ్తారు. ఈ ఏడాది ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా. -
అయ్యప్పలకు దారేది
సాక్షి, గుంటూరు : జిల్లా నుంచి ఏటా కార్తీక మాసంలో లక్ష మందికి పైగా భక్తులు శబరిమల యాత్రకు వెళుతుంటారు. కార్తీక మాసం ప్రవేశించక ముందు నుంచే మండల దీక్ష చేపట్టే భక్తులు నవంబరు రెండో వారం నుంచి ప్రయాణమవుతుంటారు. జనవరి 16 వరకు అయ్య ప్పల రాకపోకలు సాగుతూనే ఉంటాయి. జిల్లా నుంచి శబరిమల వెళ్లే భక్తులు కేరళలోని కొట్టాయం, చెంగనూరు, ఎర్నాకుళం రైల్వేస్టేషన్లలో దిగుతారు. జిల్లా భక్తులంతా ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు శబరి ఎక్స్‌ప్రెస్ ఒక్కటే దిక్కుగా మారింది. మాచర్ల, నడికుడి, పిడుగురాళ్ల, నరసరావుపేట, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, పొన్నూరు, రేపల్లె, మంగళగిరి ప్రాంతాలకు చెందిన ఎక్కువ మంది భక్తులు ఈ రైల్లోనే ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతారు. దీంతో శబరి ఎక్స్‌ప్రెస్ (17230) కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. నవంబరు, డిసెంబరు నెలల్లో ఈ రైల్లోని ఏ తరగతిలోనూ టికెట్లు లేవు. రిజర్వేషన్లు పూర్తయ్యాయి. జనవరి ఐదో తేదీ వరకు నో రూమ్ అనే సమాధానమే ఎదురవుతోంది. సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, ఒంగోలు, నెల్లూరు స్టేషన్ల నుంచి టికెట్ రిజర్వ్ చేసుకునే భక్తులకు వెయిటింగ్ లిస్టు రోజురోజుకు పెరుగుతోంది. విజయవాడ మీదుగా వెళ్లే రైళ్లలోనూ ప్రయత్నాలు ప్రారంభించారు. అక్క డి నుంచి కొచ్చిన్, త్రివేండ్రం వెళ్లే రైళ్లకు టికెట్లు రిజర్వ్ చేసుకుంటున్నారు. ఇదిలావుండగా, శబరిమల వెళ్లే భక్తుల కోసం సరైన సమయంలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. శబరి, కొచ్చిన్ ఎక్స్ప్రెస్ల్లో టికెట్లు పూర్తయి న నేపథ్యంలో ఎంతో మంది భక్తులు ఆర్టీసీ, ఫోర్‌వీలర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. బస్సుల్లో వెళ్లలేం... ఇంతకు ముందు ఎక్కువ మందితో కలిసి బృం దంగా బస్సులో శబరి మల వెళ్లాం. ఇప్పుడు వెళ్లే పరిస్థితి లేదు. రైలు ప్రయాణమే మంచిదని నిర్ణయించుకున్నాం. అయితే శబరి ఎక్స్‌ప్రెస్‌కు టికెట్లు లేవు. తత్కాల్ టికెట్లు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. అవి కూడా దొరుకుతాయో,లేదో. - అయ్యప్ప, గుంటూరు. ఏటా ఇదే పరిస్థితి... రిజర్వేషన్ ఓపెన్ అయిన అరగంటలోనే టికెట్లన్నీ అయిపోతున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే శబరిమలలోని అన్ని తరగతు ల్లోని టికెట్లు నిండుకున్నాయి. ఏం చేయాలో తెలియడం లేదు. విజయవాడ వెళ్లి అక్కడి నుంచి వెళ్లే రైళ్లకు టికెట్లు తీసుకోవాలనుకుంటున్నాం. రైల్వే అధికారులు త్వరగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలి. - మైలా సాయి కిరణ్, గుంటూరు.