ఏపీలోని తెనాలిలో ఘటన
ఒంగోలు క్రైం: రైల్వే బెర్తుల విషయంలో తలెత్తిన వివాదం చివరకు ఘర్షణకు దారితీసింది. శబరి ఎక్స్‌ప్రెస్‌లో ఏపీలోని ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడుకి చెందిన ప్రయూణికులను తెనా లి రైల్వే స్టేషన్‌లో వంద మందికి పైగా స్థానికులు తీవ్రంగా కొట్టారు. ఒకరిని అపహరించుకు వెళ్లా రు. తెనాలి జీఆర్‌పీ పోలీసులు పట్టించుకోకపోవడంతో ఒంగోలు చేరుకోగానే బాధితులు ఇక్కడి జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదుచేశారు. కరేడుకి చెం దిన మాధవి, సురేష్, సంధ్య, భరత్, చల్లా కోటేశ్వ రి, మర్రి ఆదిరెడ్డి, మర్రి వెంకటలక్ష్మి, చల్లా విష్ణుప్రియ, కృష్ణలు ఈ నెల 8న షిర్డీ వెళ్లారు. తిరుగు ప్రయూణంలో శుక్రవారం శబరి రైలులోని ఎస్-6 బోగీలోకి ఎక్కారు.
బెర్తుల విషయంలో తెనాలికి చెందిన 20 మందికి, వీళ్లకు మధ్య ఘర్షణ జరి గింది. ఈ గొడవను మర్చిపోని తెనాలి ప్రయూణికులు రైలు తెనాలి చేరుకునేలోపే వాళ్ల బంధువులు, స్నేహితులకు ఫోన్లు చేశారు. రైలు తెనాలికి వచ్చి ఆగాక దాదాపు 100 మంది వీరిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారని బాధితులు వాపోతున్నారు. కరేడుకి చెందిన 9 మందిని తీవ్రంగా కొట్టి అందులో సురేష్ అనే వ్యక్తిని తీసుకెళ్లిపోయారు. ఘర్షణలో సంధ్య అనే ప్రయాణికురాలి కుడిచేయి విరిగింది. బాధితులను రిమ్స్‌కు తరలించారు.
శబరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులపై దాడి
Published Sat, Oct 15 2016 2:55 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
Advertisement