శబరిమలకు ప్రత్యేక రైళ్లు | Good news Ayyappa devotees Sabarimala special trains | Sakshi
Sakshi News home page

శబరిమలకు ప్రత్యేక రైళ్లు

Published Fri, Nov 22 2013 2:38 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

Good news Ayyappa devotees  Sabarimala special trains

సాక్షి, గుంటూరు :అయ్యప్ప భక్తులకు శుభవార్త. నెల రోజుల నుంచి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న శబరిమల ప్రత్యేక రైళ్ల ప్రకటన వచ్చేసింది. డిసెంబరు ఒకటో తేదీ నుంచి మొత్తం నాలుగు రైళ్లు జిల్లావాసులకు అందుబాటులోకి రానున్నాయి. శబరిమల వెళ్లే భక్తులకు ఇవి ఎంతో సౌలభ్యంగా మార నున్నాయి. ప్రత్యేక రైళ్ల వివరాలను గుంటూరు డివిజన్ రైల్వే సీనియర్ కమర్షియల్ మేనేజర్ రామకృష్ణ గురువారం సాయంత్రం వెల్లడించారు. ఈ రైళ్లలో ప్రయాణించేవారు ఈ నెల 25 నుంచి మొదలయ్యే అడ్వాన్సు బుకింగ్ ద్వారా బెర్తులు రిజర్వ్ చేసుకోవచ్చని వివరించారు. ఆయా రైళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 
 
 = హైదరాబాద్ నుంచి నల్గొండ, నడికుడి, గుంటూరు, గూడూరు, రేణిగుంట, మేల్పాక్కం మీదుగా కొల్లాం వరకు 07115 నంబరు ట్రైన్‌ను ఏర్పాటు చేశారు. ఈ రైలు డిసెంబరు 13, 19, 30 తేదీల్లో హైదరాబాద్, గుంటూరుల నుంచి బయలుదేరుతుంది. హైదరాబాద్‌లో సాయంత్రం 3.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11,30 గంటలకు కొల్లాం చేరుతుంది. హైదరాబాద్‌లో బయల్దేరే ఈ రైలు గుంటూరుకు రాత్రి 9.15 గంటలకు చేరుతుంది.
 
 = కొల్లాం నుంచి హైదరాబాద్ వెళ్లే 07116 నంబరు ఎక్స్‌ప్రెస్ కొల్లాంలో డిసెంబరు 15, 21 తేదీల్లో బయలుదేరుతుంది. కొల్లాంలో ఉదయం 1.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. ఈ రైలు గుంటూరు చేరేసరికి మరుసటి రోజు 6.30 గంటలవుతుంది. ఈ రెండు రైళ్లలోనూ ఒక ఫస్ట్‌క్లాస్ ఏసీ, ఒక ఏసీ చైర్‌కార్, ఒక టూ టైర్ ఏసీ, రెండు త్రీ టైర్, 8 స్లీపర్, 4 జనరల్ కోచ్‌లుంటాయి. 
 
 = విజయవాడ నుంచి గుంటూరు, కాట్పాడి మీదుగా కొల్లాం వరకూ నడిచే ఎక్స్‌ప్రెస్ ( ట్రైన్ నంబర్ 07213) డిసెంబరు 7, 11, 18 తేదీల్లో విజయవాడ నుంచి బయలుదేరుతుంది. రాత్రి 11.45 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరే రైలు 12.45 గంటలకు గుంటూరు చేరుకుని 1.20 గంటలకు తిరిగి కొల్లాం బయలుదేరుతుంది. 
 
 = కొల్లాం నుంచి విజయవాడ వరకూ నడిచే 07214 నంబరు రైలు డిసెంబరు  9,13, 20 తేదీల్లో కొల్లాం నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు గుంటూరు చేరేసరికి మరుసటి రోజు ఉదయం 3.45 గంటలకు విజయవాడ చేరుతుంది. 
 
 = మచిలీపట్నం నుంచి కొల్లాం వెళ్లే 07215 ఎక్స్‌ప్రెస్ డిసెంబరు 14,21, 28 తేదీల్లో బయల్దేరుతుంది. రాత్రి 10 గంటలకు మచిలీపట్నం నుంచి బయల్దేరే ఈ బండి మరుసటి రోజు ఉదయం 3.45 గంటలకు కొల్లాం చేరుతుంది.
 
 = అదేవిధంగా తిరుగు ప్రయాణంలో కొల్లాం నుంచి మచిలీపట్నం వెళ్లే రైలు (నం. 07216) డిసెంబరు 16,23, 30 తేదీల్లో కొల్లాం నుంచి బయలుదేరుతుంది. ఈ బండి కొల్లాంలో ఉదయం 5.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.10 గంటలకు మచిలీపట్నం చేరుతుంది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement