శబరిమలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు | More Special Trains To Sabarimala From Andhra Pradesh, Check Trains Details Inside | Sakshi
Sakshi News home page

శబరిమలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు

Published Wed, Dec 11 2024 5:54 AM | Last Updated on Wed, Dec 11 2024 10:00 AM

more special trains to Sabarimala: Andhra Pradesh

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తుల సౌకర్యం కోసం ఇప్పటికే నడుస్తున్న కొన్ని ప్రత్యేక రైళ్లతో పాటు అదనంగా మరికొన్ని రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కాకినాడ పోర్టు–కొల్లం (07173) ఈనెల 11, 18, 25 తేదీల్లో బుధవారం రాత్రి 11.50 గంటలకు కాకినాడ పోర్టులో బయలుదేరుతుంది. 

తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07174) ఈనెల 13, 20, 27 తేదీల్లో శుక్రవారం ఉదయం 8.40 గంటలకు కొల్లంలో బయలుదేరుతుంది. సికింద్రాబాద్‌–కొల్లం (07175) ఈనెల 19, 26 తేదీల్లో గురువారం రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07176) ఈనెల 21, 28 తేదీల్లో శనివారం ఉదయం 5 గంటలకు కొల్లంలో బయలుదేరుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement