శబరిమలకు 44 ప్రత్యేక రైళ్లు | 44 Special Trains For Sabarimala From Andhra Pradesh, Check Trains Timings And Routes Details | Sakshi
Sakshi News home page

Sabarimala Special Trains: శబరిమలకు 44 ప్రత్యేక రైళ్లు

Published Tue, Nov 26 2024 5:50 AM | Last Updated on Tue, Nov 26 2024 7:53 AM

44 Special Trains for Sabarimala: Andhra Pradesh

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తుల సౌకర్యం కోసం విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్‌ నుంచి విజయవాడ మీదుగా కొల్లం వరకు 44  వారాంతపు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం–కొల్లాం (08539) ప్రత్యేక రైళ్లు డిసెంబర్‌ 4 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రతి బుధవారం నడపనున్నారు.

ఈ రైలు ప్రతి బుధవారం విశాఖపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు కొల్లాం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08540) డిసెంబర్‌ 5 నుంచి ఫిబ్రవరి 27 వరకు ప్రతి గురువారం రాత్రి  బయలు దేరుతుంది. శ్రీకాకుళం రోడ్‌–కొల్లాం (08553) ప్రత్యేక రైలు డిసెంబర్‌ 1 నుంచి జనవరి 26 వరకు ప్రతి ఆదివారం నడుపుతారు. శ్రీకాకుళం రోడ్డులో బయలుదేరి, మరుసటి రోజు కొల్లాం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08554) డి­సెంబర్‌ 2 నుంచి జనవరి 27 వరకు ప్రతి సో­మ­­వారం సాయంత్రం 4.30 గంటలకు కొ­ల్లాంలో బయలు దేరుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement