శబరిమలకు 132 ప్రత్యేక రైళ్లు | 132 special trains to Sabarimala | Sakshi
Sakshi News home page

శబరిమలకు 132 ప్రత్యేక రైళ్లు

Published Sat, Nov 21 2015 3:31 AM | Last Updated on Sun, Sep 3 2017 12:46 PM

శబరిమలకు 132 ప్రత్యేక రైళ్లు

శబరిమలకు 132 ప్రత్యేక రైళ్లు

సాక్షి, హైదరాబాద్: శబరిమలైకు వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే వివిధ ప్రాంతాల నుంచి 132 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు చర్యలు చేపట్టింది. ఈ  ప్రత్యేక ైరె ళ్లలో ఈ నెల 22వ తేదీ నుంచి భక్తులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు.

 హైదరాబాద్-కొల్లామ్ (07109 / 07110) స్పెషల్ ట్రైన్స్ డిసెంబర్ 11,15,16,19,23,24,31, జనవరి 3,4,5,6,7,8,10,11,12,13,14,15 తేదీల్లో మధ్యాహ్నం 3.55కు నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.30కు కొల్లామ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 13,17,18,21,25,26 తేదీలలో జనవరి 2,5,6,7,8,9,10,12,13,14,14,16,17 తేదీలలో తెల్లవారు జామున 2.15 కు బయలుదేరి రెండవ రోజు ఉదయం 10.30 కు హైదరాబాద్ చేరుకుంటుంది.

 మరో ట్రైన్ హైదరాబాద్-కొల్లామ్ (07133/ 07134) డిసెంబర్ 12,20,30 తేదీల్లో, జనవరి 2,16 తేదీల్లో మధ్యాహ్నం 3.30కు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.30కు కొల్లామ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 9,16,23 జనవరి 4,18 తేదీల్లో తెల్లవారుజామున 2.15కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30కు హైదరాబాద్ చేరుకుంటుంది.

 నిజామాబాద్-కొల్లామ్ (07613/07614) స్పెషల్ ట్రైన్ డిసెంబర్ 7,14,21 తేదీల్లో మధ్యాహ్నం 12.10కి నిజామాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.30కు కొల్లామ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 14,21, జనవరి 1వ తేదీల్లో తెల్లవారుజామున 2.15కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.05కు నిజామాబాద్ చేరుకుంటుంది.

 మచిలీపట్నం-కొల్లామ్ (07275 / 07276) డిసెంబర్ 13వ తేదీ రాత్రి 7.40కి మచిలీపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.30కి కొల్లామ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 15వ తేదీన తెల్లవారుజామున 2.05కు కొల్లామ్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45కు మచిలీపట్నం చేరుకుంటుంది.

 కాకినాడ-కొల్లామ్ (07211/07212) స్పెషల్ ట్రైన్  డిసెంబర్ 15,16,18,19,21,24,25 జనవరి 1,2,4,5,7,8,10,11,13,14 తేదీల్లో రాత్రి 10.10 కి కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 12.50కి కొల్లామ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 17,18,21,23,24,26,27, జనవరి 3,4,5,6,7,9,10,12, 13,15,16 తేదీల్లో తెల్లవారు జామున 3 గంటలకు కొల్లామ్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.15కు కాకినాడ చేరుకుంటుంది.
 
 వివిధ మార్గాల్లో. ..
అయ్యప్ప భక్తుల డిమాండ్, రద్దీకి అనుగుణంగా నర్సాపూర్-కొల్లామ్, విజయవాడ-కొల్లామ్, ఔరంగాబాద్-కొల్లామ్, అకోల-కొల్లామ్, ఆదిలాబాద్-కొల్లామ్, సిర్పూర్‌కాగజ్‌నగర్-కొల్లామ్ మధ్య ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. అలాగే కరీంనగర్, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి కూడా డిసెంబర్ మొదటి వారం నుంచి జనవరి 2వ వారం వరకు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement