కర్నూలు జిల్లాలోని మహానంది పుణ్యక్షేత్రంలో అయ్యప్ప మాలధారులు పెను ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు.
అయ్యప్ప భక్తులకు త్రుటిలో తప్పిన ప్రమాదం
Dec 22 2016 10:50 AM | Updated on Apr 3 2019 7:53 PM
మహానంది: కర్నూలు జిల్లాలోని మహానంది పుణ్యక్షేత్రంలో అయ్యప్ప మాలధారులు పెను ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. గుంటూరు జిల్లాకు చెందిన భక్తులు ఒక బస్సులో గురువారం ఉదయం మహానందికి వచ్చారు. స్థానిక టీటీడీ కల్యాణ మంటపం వద్ద బస్సును ఆపి అందరూ కిందికి దిగారు. ఇద్దరు భక్తులు లగేజిని కిందికి దించేందుకు బస్సుపైకి ఎక్కారు. అయితే, ఆ ప్రదేశంలో విద్యుత్ తీగలు కిందికి వేలాడుతుండటంతో వారికి తీగలు తాకి షాక్‌కు గురయ్యారు. గాయపడిన వారిని తోటివారు వెంటనే నంద్యాల ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement