
సాక్షి, హైదరాబాద్ : శబరిమల ఆలయం వద్ద భక్తుల అరెస్ట్‌లను నిరసిస్తూ .. రాష్ట్రానికి చెందిన అయ్యప్ప భక్తులు ధర్నాకు దిగారు. అయ్యప్ప ఐక్య వేదిక నేతృత్వంలో మంగళవారం ఇందిరా పార్క్‌లో అయ్యప్ప భక్తులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా స్వాములు శబరిమల దర్శనానికి అనుమతి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. ఇక్కడి ప్రభుత్వాలు కలగజేసుకుని కేరళ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని కోరారు. చివరకు అయ్యప్ప స్వాములు కూడా ధర్నాలు చేయాల్సి రావడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ధర్నాలో పాల్గొని అయ్యప్ప భక్తులకు మద్దతు తెలిపారు.