ఎనర్జీ కన్సర్వేషన్ వాక్‌ను ప్రారంభించిన మంత్రి | conservation walk in hyderabad | Sakshi
Sakshi News home page

ఎనర్జీ కన్సర్వేషన్ వాక్‌ను ప్రారంభించిన మంత్రి

Published Sun, Dec 17 2017 10:16 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

conservation walk in hyderabad

సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నగరంలోని పీపుల్స్ ప్లాజాలో  ఎనర్జీ కన్సర్వేషన్ వాక్‌ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ఆదివారం ఉదయం  ప్రారంభించారు. ఇన్‌స్టిట్టూట్ ఆఫ్ ఇంజినీర్స్, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జనవరి నుంచి వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందివ్వనున్నట్లు తెలిపారు. అలాగే సాధ్యమైనంత వరకు విద్యుత్‌ను ఆదా చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డిలతోపాటు పలువురు పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఖైరతాబాద్ వరకు ఎనర్జీ కన్సర్వేషన్ వాక్‌ నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement