‘వ్యాపారమయంగా విద్యారంగం’
Published Sun, Aug 7 2016 12:40 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : సీఎం కేసీఆర్ పాలనలో విద్యారంగం పూర్తిగా వ్యాపారీకరణగా మారిందని, ఎంట్రెన్స్ పరీక్షలన్నీ లీకేజీలతో కొ ట్టుమిట్టాడుతున్నాయని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట ప్రధా న కార్యదర్శి రావి శివరామకృష్ణ అన్నారు. ఏఐ ఎస్‌ఎఫ్ 81వ వార్షికోత్సం సందర్భంగా శనివా రం జిల్లా కేంద్రంలో ‘కేసీఆర్ పాలనలో విద్యారంగం ఎదుర్కొంటున్న స వాళ్లు’ అనే అంశంపై జిల్లా అధ్యక్షుడు కేతూరి ధర్మతేజ అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శివరామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంసెట్–2 లీకేజీ వ్యవహారంలో దోషులను పక్కన బెట్టి విద్యార్థులను, బ్రోకర్లను బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని అన్నారు. వి ద్య, ఆరోగ్యశాఖ మంత్రులను మంత్రివర్గం నుం చి తొలగించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పెట్టాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జి ల్లా ప్రధాన కార్యదర్శి డి.రాము, కార్యదర్శి సురే‹ Ù, జిల్లా ఆఫీసు బేరర్స్ గిరిగౌడ్, అంజి, కృష్ణ, ప్రత్యూష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement