'ఎక్కడికి వెళుతున్నామో అర్థం కావడం లేదు'
ముంబయి: ప్రస్తుత రోజుల్లో విద్య వ్యాపారంగా మారడం దురదృష్టకరమని ప్రముఖ బాలీవుడ్ నటి జూహీ చావ్లా పేర్కొంది. తాను ఇలాంటి రోజులు చూస్తాననుకోలేదని చెప్పింది. ఆమె నటించిన చాక్ అండ్ డస్టర్ అనే చిత్ర విశేషాలు చెప్తున్న సందర్భంగా ఆమె ఈ మాటలు అన్నారు.
'గతంలో నేనొకచోట చదివాను.. రానున్న రోజుల్లో ఆస్పత్రులు, విద్య మంచి వ్యాపార రంగంగా మారనున్నాయని. అప్పుడు నేను చాలా తికమకపడ్డాను. అది ఎలా సాధ్యం అని? కానీ, ఇప్పుడు ఆ ఆర్టికల్ నిజమేనని నమ్ముతున్నాను. విద్య వ్యాపారంగా మారడం నిజంగా ఓ దురదృష్టమే. ఈ పరిస్థితి మారాలని నేను కోరుకుంటాను. విద్యను అందించడమనేది ఆదర్శవంతంగా ఉండాలని నేను భావిస్తాను. వేదాల్లో కూడా ఉపాధ్యాయులకు సముచిత స్థానం, మంచి గౌరవం ఉంది. అలాంటి గౌరవం ఎక్కడ పోగుట్టుకున్నామో, మనం ఎక్కడి వెళుతున్నామో నాకు తెలియడం లేదు' అంటూ జూహీ తన మనసులో మాట చెప్పింది.