
ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా రాష్ట్ర విద్యార్థి
ఏఐఎస్‌ఎఫ్ ఆల్ ఇండియా అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలీ ఉల్లా ఖాద్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రం నుంచి నలుగురికి జాతీయ కార్యవర్గంలో చోటు లభించింది.
మరో నలుగురు జాతీయ కార్యవర్గంలోకి
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఏఐఎస్‌ఎఫ్ ఆల్ ఇండియా అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలీ ఉల్లా ఖాద్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రం నుంచి నలుగురికి జాతీయ కార్యవర్గంలో చోటు లభించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మూడు రోజులుగా జరుగుతున్న ఏఐఎస్‌ఎఫ్ 28వ జాతీయ మహాసభలు శనివారం ముగిశాయి. అనంతరం జాతీయ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ప్రస్తుతం ఏఐఎస్‌ఎఫ్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్న వలీ ఉల్లాఖాద్రీని ఆల్ ఇండియా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన ఖాద్రీ కాకతీయ వర్సిటీ కామర్స్ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. రాష్ట్రం నుంచి జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బయ్యన్న (అనంతపురం), స్టాలిన్ (మహబూబ్‌నగర్), అయ్యన్న స్వామి(విశాఖపట్టణం), శివరామకృష్ణ (ఖమ్మం) నియమితులయ్యారు.