తణుకు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకై అధికార తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యమాలకు సన్నద్ధం కావాలని, హోదా బాధ్యత ఆ పార్టీదేనని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) జిల్లా అ««దl్యక్ష, కార్యదర్శులు కె.సుధీర్‌బాబు, టి.అప్పలస్వామి సూచించారు. ఆదివారం ఏఐఎస్‌ఎఫ్ సమావేశం దువ్వలో నరాల పెద్దిరాజు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా అప్పలస్వామి మాట్లాడుతూ ఆం్ర««దlప్రదేశ్ పునర్వవ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలన్నింటికీ కేంద్ర ప్రభుత్వం గండి కొట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కేటాయింపు, రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రణాళిక లోటు భర్తీకు తగిన నిధులు తదితర ప్రధాన హామీలన్నింటినీ నీటిమీద రాతలుగా మార్చేందుకు కేంద్రం సిద్ధమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వం హోదా ఉద్యమాలకై కలిసి రాకపోతే 13 జిల్లాల్లోనివిద్యార్థులు, నిరుద్యోగులు క్షమించరని సుధీర్‌బాబు అన్నారు. రాష్ట్రంలోని లక్షల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే ప్రత్యేక హోదానే మార్గమన్నారు. ఏఐఎస్‌ఎఫ్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మారిశెట్టి నాగరాజును ఎన్నుకున్నారు. వానపల్లి బుజ్జిబాబు, మద్దూరి బాలాజీ, వి.రాజు, మారం రామాంజనేమయులు పాల్గొన్నారు