సీఎం రాజీనామా చేయలంటూ ర్యాలీ | AISF rally for CM resignation | Sakshi
Sakshi News home page

సీఎం రాజీనామా చేయలంటూ ర్యాలీ

Published Thu, Jul 28 2016 11:16 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

సీఎం రాజీనామా చేయలంటూ ర్యాలీ

సీఎం రాజీనామా చేయలంటూ ర్యాలీ

యాదగిరిగుట్ట : ఎంసెట్‌–2 లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిలు రాజీనామా చేయాలని కోరుతూ గురువారం ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో పట్టణంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వైకుంఠ ద్వారం నుంచి అమరవీరుల స్థూపం వరకు ప్రదర్శన నిర్వహించారు. లీకేజీతో ర్యాంకులు పొందిన వారిని అనర్హులుగా ప్రకటించి, మిగతా విద్యార్థుల భవిష్యత్‌ కాపాడాలని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రీ, తెలంగాణ యూనివర్సిటీల కన్వీనర్‌ శంకర్‌లు కోరారు. ఈ ర్యాలీలో తెలంగాణలోని పది జిల్లాలకు చెందిన 350 ఏఐఎస్‌ఎఫ్‌ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement