- కలెక్టరేట్ ఎదుట ఏఐఎస్‌ఎఫ్ ధర్నా
విద్యార్థులను విస్మరిస్తున్న సీఎం
Published Mon, Aug 29 2016 11:12 PM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM
ముకరంపుర : స్వరాష్ట్రంలో విద్యార్థులకు సమస్యల్లేకుండా చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ విస్మరించారని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, బోనగిరి మహేందర్ అన్నారు. ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో ఎస్సీ బాలబాలికల కళాశాల నూతన హాస్టల్‌ను ప్రారంభించాలని కోరారు. హాస్టల్ విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ విద్యాసంవత్సరానికి 800లకు పైగా విద్యార్థులు హాస్టల్ కోసం దరఖాస్తు చేసుకున్నా పాలకులు స్పందించడం లేదన్నారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జేరిపోతుల జనార్దన్, బాలసాని లెనిన్, మచ్చ రమేశ్, సంగెం మధు, పులి రాకేశ్, అంబ్రిష్, అజయ్, బోయిని నరేశ్, కొంకటి ప్రశాంత్, వంశీ, శ్రావణ్, ఈశ్వర్, భాస్కర్, జ్యోతి, స్వప్న, సరిత, శారద తదితరులు పాల్గొన్నారు.
Advertisement