అనంతపురం జిల్లా ఉరవకొండలో విద్యార్థి సంఘాల ఆందోళ ఘర్షణకు దారితీసింది.
అనంతపురం జిల్లా ఉరవకొండలో విద్యార్థి సంఘాల ఆందోళ ఘర్షణకు దారితీసింది. ఏఐఎస్‌ఎఫ్, ఏబీవీపీ నాయకులు పరస్పరం దాడులకు దిగారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు కన్నయ్య పై కేసుకు నిరసనగా.. ఏఐఎస్‌ఎఫ్ నాయకులు సోమవారం కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న ఏబీవీపీ నాయకులు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో మాట మాట పెరిగి ఇరు వర్గాల వారు కొట్టుకున్నారు. చివరకు అక్కడున్న పాత్రికేయులు జోక్యం చేసుకుని వారిని విడిపించాల్సి వచ్చింది.