మంత్రులను అరెస్ట్‌ చేయాలి | arrest the ministers | Sakshi

మంత్రులను అరెస్ట్‌ చేయాలి

Jul 31 2016 10:11 PM | Updated on Aug 20 2018 4:27 PM

ఎంసెట్‌ లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిని అరెస్ట్‌ చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కేతూరి ధర్మతేజ డిమాండ్‌ చేశారు.

కొల్లాపూర్‌ : ఎంసెట్‌ లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిని అరెస్ట్‌ చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కేతూరి ధర్మతేజ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ఎంసెట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో మంత్రుల పాత్ర కూడా ఉందని ఆరోపించారు. లీకేజీ వ్యవహారం బయటకు వచ్చాక ప్రభుత్వం దోషుల పట్ల మెతక వైఖరి అవలంబిస్తుందన్నారు. ఎంసెట్‌ను రద్దు చేయడం సరైన ప్రక్రియ కాదన్నారు. ఎంసెట్‌ లీకేజీ వ్యవహారంలో దోషులుగా తేలిన విద్యార్థుల ర్యాంకులు రద్దు చేస్తే సరిపోతుందన్నారు. కొంతమంది కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులను రోడ్డున పడేయడం సరికాదన్నారు. సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు నరేష్, మల్లేష్, అమర్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement