సాక్షి, హైదరాబాద్ : నగరంలోని రాణి గంజ్‌లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అగ్నిమాపక సిబ్బంది దాదాపు 15 గంటలపైనే కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అంతేకాక ఎగసిపడుతున్న మంటలు పక్క భవనాలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. ప్రజలను ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు దూర ప్రాంతాలకు తరలించారు.
ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించడం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ప్రమాదంలో బిల్డింగ్ పూర్తి దగ్ధమయి కూప్పకూలిపోయింది. బిల్డింగ్‌లోని గౌడన్‌లో భారీ స్థాయిలో పెయింట్ డబ్బాలను నిల్వ ఉంచారు. పక్కనే ఉన్న నాలుగు అంతస్తుల కేబుల్ గౌడన్‌లోకి కూడా మంటలు వ్యాపించాయి. ఈ విధమైన సంఘటనలు పురావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అగ్ని ప్రమాదంపై మంత్రులు, ఇదర ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించారు. రాణిగంజ్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన పెయింట్, కేబుల్స్, ఇతర కెమికల్ గోడన్‌లపై అధికారులు ఆరా తీస్తున్నారు. అక్రమ నిల్వలపై జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోని డైరెక్టర్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. బిల్డింగ్‌కు ట్రేడ్ లైసెన్స్, ఫైర్ నామ్స్, పార్కింగ్ అనుమతులు ఉన్నాయా.. లేదా అనే దానిపై అధికారులు ఆరా చేస్తున్నారు. ఈ ప్రమాదంలో పెయింట్ డబ్బాలు బుగ్గి అవ్వడమేకాక.. ఆ ప్రాంతంలోనే భవనాలు దెబ్బ తిన్నాయి. ఈ ప్రమాదంతో దాదాపు కోట్లలో నష్టం జరిగినట్లు అధికారుల అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment