21 నుంచి ఏఐఎస్‌ఎఫ్ జాతీయ సమావేశాలు | AISF national level meeting in tirupati from 21st may | Sakshi
Sakshi News home page

21 నుంచి ఏఐఎస్‌ఎఫ్ జాతీయ సమావేశాలు

Published Mon, May 11 2015 12:58 AM | Last Updated on Sun, Sep 3 2017 1:48 AM

AISF national level meeting in tirupati from 21st may

హైదరాబాద్: అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) జాతీయ సమావేశాలు ఈనెల 21 నుంచి తిరుపతిలో జరుగనున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలను ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రీ ప్రారంభించనున్నారు.

ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర నేతలు బయ్యన్న, స్టాలిన్  మీడియాతో మాట్లాడుతూ.. 23 రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారని చెప్పారు. సమావేశాల్లో కేంద్రం అనుసరిస్తున్న విద్యార్థి వ్య తిరేక విధానాలపై చర్చించనున్నామన్నారు. అలాగే విద్య కాషాయికరణ, మైనారిటీ విద్యాసంస్థలపై దాడులు, విద్య వ్యాపారీకరణ తదితర అంశాలపై చర్చి స్తామన్నారు. సర్కారీ విద్య నుంచి పేద విద్యార్థులను దూరం చేస్తున్న ప్రభుత్వ  విధానాలపై పోరాటానికి సమాయత్తమవుతున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement