national meetings
-
హ్యాట్రిక్‌పై బీజేపీ గురి...!
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా ఉన్న బీజేపీ ఆ దిశగా సన్నాహాలను వేగవంతం చేస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తాలూకు ఊపును కొనసాగించేలా పార్టీ నేతలను, శ్రేణులను సమాయత్తం చేస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 50 శాతానికి పైగా ఓట్ల సాధనను బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది! ఈ మేరకు రాష్ట్రాలవారీగా ముఖ్య నేతలకు అధినాయకత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. ఇటీవలి బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు నేతలందరికీ ఈ మేరకు స్పష్టం చేయడంతో పాటు ఆ దిశగా బాధ్యతలు కూడా అప్పగించినట్టు సమాచారం. 50 శాతం ఓట్ల లక్ష్యసాధన కోసం 2019తో పోలిస్తే ఈసారి వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ నిర్ణయానికి వచి్చనట్టు చెబుతున్నారు. ఇందుకు ఎన్డీఏ మిత్రపక్షాలను ఒప్పించే ప్రయత్నాలకు పార్టీ ఇప్పటికే శ్రీకారం చుట్టింది. 2019తో పోలిస్తే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సంఖ్య తగ్గడం కూడా తాను ఎక్కువ చోట్ల పోటీ చేసేందుకు వీలు కలి్పస్తుందని బీజేపీ భావిస్తోంది. పంజాబ్‌లో అకాలీదళ్, బిహార్‌లో జేడీ(యూ)తో బీజేపీకి ఇప్పటికే తెగదెంపులవడం తెలిసిందే. తమిళనాడులో అన్నాడీఎంకే, రాజస్థాన్‌లో ఆరెలీ్పలతోనూ అటూ ఇటుగా అదే పరిస్థితి. ఇక మహారాష్ట్రలో శివసేన చీలికలో ఏక్నాథ్ షిండే వర్గానికి బీజేపీ మద్దతుగా నిలిచి ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడింది. కనుక షిండే సేనకు వీలైనన్ని తక్కువ లోక్‌సభ సీట్లిచ్చి అత్యధిక స్థానాల్లో తానే పోటీ చేసేలా కన్పిస్తోంది. నెలాఖరు నుంచి జాబితాలు...! జనవరి నెలాఖరు, లేదా ఫిబ్రవరి తొలి వారం నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితాలు విడుదలయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘తొలి జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వంటి దిగ్గజాల పేర్లుంటాయి. తద్వారా ఎన్నికల వాతావరణానికి దేశవ్యాప్తంగా ఊపు తేవాలన్నది లక్ష్యం’’ అని వివరించాయి. 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడు కూడా మోదీ, షా, రాజ్‌నాథ్ పేర్లు తొలి జాబితాలోనే చోటుచేసుకోవడం తెలిసిందే. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ స్థానాలు నెగ్గేందుకు బీజేపీ పలు చర్యలు చేపడుతోంది... 1. తొలి జాబితాలో వీలైనన్ని ఎక్కువ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. ముఖ్యంగా 2019లో పార్టీ ఇబ్బందులను ఎదుర్కొన్న, తక్కువ మెజారిటీతో నెగ్గిన స్థానాలపై ఈ జాబితాలో బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టనుంది. నిజానికి వీటిని ‘సవాలు స్థానాలు’గా ఎప్పుడో గుర్తించింది. గత ఎన్నికల ఫలితాలు రాగానే వాటిపై గట్టిగా దృష్టి పెట్టింది. ఆయా స్థానాల్లో పరిస్థితిని మెరుగు పరుచుకునేందుకు ప్రయతి్నస్తూ వస్తోంది. 2. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను 2019 ఎన్నికల్లో బీజేపీ 436 చోట్ల పోటీ చేసింది. 303 స్థానాలు నెగ్గి 133 చోట్ల ఓటమి చవిచూసింది. వాటితో పాటు బాగా బలహీనంగా మరో 31 స్థానాలపై బీజేపీ ఈసారి బాగా ఫోకస్ చేస్తోంది. వీటిని తొలి జాబితాలో చేర్చనుంది. 3. ఈ 164 ‘టార్గెటెడ్’ స్థానాల్లో గెలుపు బాధ్యతలను అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలకు అప్పగించనుంది. వీటినిప్పటికే రెండు గ్రూపులుగా బీజేపీ విభజించింది. 45 మంది కేంద్ర మంత్రులు ఒక్కొక్కరు రెండు నుంచి నాలుగు స్థానాల చొప్పున బాధ్యతలను భుజాలకెత్తుకుంటారు. 4. ఢిల్లీ పీఠానికి రాచబాటగా పరిగణించే కీలకమైన ఉత్తరప్రదేశ్‌పై ఈసారి బీజేపీ మరింతగా ఫోకస్ చేస్తోంది. రాష్ట్రంలో 80 లోక్‌సభ సీట్లకు గాను 2019 ఎన్నికల్లో 16 చోట్ల బీజేపీ ఓటమి చవిచూసింది. అనంతరం రాయ్‌బరేలీ, మెయిన్‌పురి స్థానాలను ఉప ఎన్నికల్లో చేజిక్కించుకుంది. మిగతా 14 లోక్‌సభ స్థానాల్లో పార్టీ బాగా బలహీనంగా ఉందన్న అంచనాతో వాటిపై బాగా దృష్టి పెడుతోంది. రాయ్‌బరేలీ, మెయిన్‌పురితో పాటు ఈ 14 స్థానాలకూ అభ్యర్థులను తొలి జాబితాలోనే ప్రకటించే యోచనలో ఉంది. వీటిలో సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలుగా చెప్పే పలు స్థానాలున్నాయి. 5. ఇలాగే బిహార్‌లో కూడా క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉన్నట్టు భావిస్తున్న నవడా, సుపౌల్, కిషన్‌గంజ్, కతీహార్, ముంగేర్, గయ వంటి స్థానాలు కూడా బీజేపీ తొలి జాబితాలోనే ఉంటాయని భావిస్తున్నారు. 6. మధ్యప్రదేశ్‌లో పీసీసీ మాజీ చీఫ్, కాంగ్రెస్ కురువృద్ధుడు కమల్‌నాథ్ కంచుకోటైన ఛింద్వారాతో పాటు ఆ పార్టీకి పట్టున్న పలు స్థానాలపై బీజేపీ గట్టిగా దృష్టి పెట్టింది. ఛింద్వారా బాధ్యతలను కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌కు అప్పగించారు. 7. కేరళలో కూడా త్రిసూర్, తిరువనంతపురం, పథినంతిట్ట వంటి స్థానాల్లో విజయవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు బీజేపీ అంచనా వేస్తోంది. త్రిసూర్ నుంచి సినీ హీరో సురేశ్ గోపిని బరిలో దించుతుందన్న అంచనాలున్నాయి. 8. మహారాష్ట్రలో ఎన్సీపీ చీఫ్ వరద్ పవార్ కంచుకోటైన బారామతితో పాటు బుల్దానా, ఔరంగాబాద్ వంటి లోక్‌సభ స్థానాల్లో ఈసారి ఎలాగైనా పాగా వేసి తీరాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఇక పంజాబ్‌లో అమృత్సర్, ఆనంద్‌పూర్ సాహిబ్, భటిండా, గురుదాస్‌పూర్ తదితర లోక్‌సభ సీట్లపై కూడా పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 9. పంజాబ్, మహారాష్ట్ర, బిహార్లలో స్థానిక పారీ్టలతో బీజేపీ పొత్తు చర్చలు ఇప్పటికే ముమ్మరంగా సాగుతున్నాయి. పరిస్థితులు, అవసరాలను బట్టి ఈ రాష్ట్రాల్లో ఇచి్చపుచ్చుకునే ధోరణితో వెళ్లాలన్న యోచనలో అధినాయకత్వం ఉంది. 10. 70 ఏళ్లు పైబడ్డ నేతలకు ఈసారి టికెట్లు ఇవ్వొద్దన్న యోచన కూడా బీజేపీ అధినాయకత్వం పరిశీలనలో ఉందని విశ్వసనీయ సమాచారం! మూడుసార్లకు మించి నెగ్గిన వారిని కూడా పక్కన పెట్టనుందని చెబుతున్నారు. వారికి బదులు కొత్త ముఖాలకు చాన్సివ్వాలని మోదీ–షా ద్వయం సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారని బీజేపీ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తోంది. ఇది నిజమే అయితే అందరికీ వర్తింపజేస్తారా, మినహాయింపులుంటాయా అన్నది చూడాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విశ్వసనీయ వారధిగా మారండి
న్యూఢిల్లీ: పార్టీకి, సామాన్య ప్రజలకు మధ్య విశ్వసనీయ వారధిగా మారాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశంలో సామాన్య ప్రజల ప్రయోజనాల కోసం బీజేపీ కట్టుబడి ఉందని గుర్తుచేశారు. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ప్రజల విశ్వాసాన్ని కచ్చితంగా చూరగొంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఎన్ఎండీసీ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. సేవా, సంకల్పం, అంకితభావం అనే విలువలపై ఆధారపడి బీజేపీ పని చేస్తోందని చెప్పారు. కేవలం ఒక కుటుంబం చుట్టే తిరగడం లేదంటూ పరోక్షంగా కాంగ్రెస్‌కు చురకలంటించారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదని, ఒక కుటుంబం పెత్తనం కింద కొనసాగడం లేదన్నారు. ప్రజా సంక్షేమం అనే సంస్కృతే బీజేపీకి ఆయువుపట్టు అని వ్యాఖ్యానించారు. ప్రజల బాగు కోసం పని చేస్తోంది కాబట్టే కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉందని వివరించారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో కార్యకర్తలు ప్రజలకు విశేష సేవలందించారని కొనియాడారు. ప్రజలకు సేవ చేయడమే బీజేపీకి పరమావధి అని స్పష్టం చేశారు. అభివృద్ధి ఎజెండాకు ప్రజామోదం తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించిందని మోదీ ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో బద్వేల్ ఉప ఎన్నికలోనూ ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకుందని వివరించారు. బద్వేల్ ఉప ఎన్నికలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలపై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీకి కేవలం 750 ఓట్లు వచ్చాయని, ఈసారి ఏకంగా 21,000కుపైగా ఓట్లు సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ అభివృద్ధి అజెండాకు ప్రజామోదం లభిస్తోందనడానికి ఇవే నిదర్శనాలని పేర్కొన్నారు. పార్టీలోని సీనియర్ నేతలు, కార్యకర్తలతో సంబంధాలు పెంచుకోవాలని, వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చని బీజేపీ శ్రేణులకు సూచించారు. కార్యకర్తలకు నడ్డా దిశానిర్దేశం వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ముఖ్యమంత్రులు, బీజేపీ అధ్యక్షులు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. తమ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిని వివరిస్తూ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం కృషి చేయాలంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 25 నాటికి 10.40 లక్షల పోలింగ్ స్టేషన్ల పరిధిలో బూత్ లెవెల్ కమిటీల ఏర్పాటును పూర్తిచేస్తామన్నారు. రాజకీయ తీర్మానం ప్రధాని మోదీ నాయకత్వ ప్రతిభను కొనియాడుతూ, ప్రతిపక్షాల అవకాశవాద వైఖరిని ఎండగడుతూ బీజేపీ జాతీయ కార్యకర్గ సమావేశంలో యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఒక రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగబోయే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ ఘన విజయం సాధించడం ఖాయమని తీర్మానంలో పేర్కొన్నారు. మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ఇందులో ప్రస్తావించారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం పట్ల మోదీని అభినందించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ దేశంలోనే పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఆదిత్యనాథ్ రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. ప్రతిపక్షాలు పచ్చి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. -
కమలదళం మేధోమథనం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ఆదివారం ఢిల్లీలో జరగనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగంతో ప్రారంభమయ్యే బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంతో ముగియనుంది. పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. కోవిడ్–19 నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశానికి జాతీయ కార్యవర్గ సభ్యులందరినీ ఢిల్లీకి ఆహ్వానించలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. 124 మంది కార్యవర్గ సభ్యులు మాత్రమే ప్రత్యక్షంగా హాజరవుతారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, జాతీయ కార్యవర్గంలోని ఇతర సభ్యులు రాష్ట్ర కార్యాలయాల్లో వర్చువల్‌గా ఈ సమావేశంలో పాల్గొంటారు. తెలంగాణ నుంచి బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, రాజాసింగ్, విజయశాంతి, జితేందర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, ఆంధ్రప్రదేశ్ నుంచి సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొననున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లో వచ్చే ఏడాది ఆఖర్లో ఎన్నికలు ఉన్నాయి. పంజాబ్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఏడు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై జాతీయ కార్యవర్గ సమావేశంలో మేధోమథనం నిర్వహించనున్నారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కొత్త వ్యూహం రూపొందించే అవకాశం ఉంది. -
నేటి నుంచి బీజేపీ జాతీయ మండలి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా నేటి నుంచి రెండ్రోజుల పాటు జాతీయ మండలి సమావేశాలను నిర్వహించనుంది. ఢిల్లీలోని రాంలీల్ మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 7,000 మందికిపైగా పార్టీ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇటీవల రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి పార్టీ కేడర్ కోలుకోవడంపై అధిష్టానం దృష్టి సారించనున్నారు. ఉపాధ్యక్షులుగా ముగ్గురి నియామకం.. లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్‌సింగ్‌లను పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించింది. ఇటీవల జరిగిన ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వీరి నాయకత్వంలో బీజేపీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో ఈ ముగ్గురు నేతలను బీజేపీ జాతీయ రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. -
ఏబీవీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నిక
సాక్షి, అమరావతి బ్యూరో: ఏబీవీపీ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా డా. ఎస్ సుబ్బయ్య (తమిళనాడు), ఆశీష్ చౌహాన్(హిమాచల్‌ప్రదేశ్)లు మళ్లీ ఎన్నికయ్యారు. గురువారం జరిగిన ఎన్నికల్లో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఎలక్షన్ ఆధికారి మమతా యాదవ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 27న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరగనున్న ఏబీవీపీ జాతీయ సమావేశాల్లో వీరిద్దరూ బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గం ఏడాదిపాటు బాధ్యతలు నిర్వహించనుంది. -
లాల్–నీల్ పోరు
సాక్షి, హైదరాబాద్ : ఎర్ర జెండా, సామాజిక జెండా కలవాల్సిన అవసరం ఉందని, జై భీమ్–లాల్ సలామ్ కలిసినప్పుడే దేశంలో మార్పు వస్తుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. లాల్–నీల్ జెండా నీడన ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసి దేశ ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని అందిస్తామని ప్రకటించారు. మతోన్మాద ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఐదురోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం 22వ జాతీయ మహాసభల ముగింపు సందర్భంగా ఆదివారం సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఏచూరి మాట్లాడారు. దేశంలో రోజురోజుకు ఆర్థిక దోపిడీ పెరిగిపోతోందని, ఏదో చేసేస్తానని డాబు కొట్టి ప్రధాని అయిన నరేంద్రమోదీ దేశ ప్రజల జీవితాలను భారం చేశారని విమర్శించారు. దేశంలో ధరలు, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తి ధరకు ఒకటిన్నర రెట్లు మద్దతు ధర ఇప్పిస్తానన్న మోదీ.. ఇంతవరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదన్నారు. రైతు రుణమాఫీ కూడా అమలు చేయలేదన్నారు. ‘‘ఈ దేశంలో రుణమాఫీ జరిగింది. కానీ రైతులకు కాదు. బడా పెట్టుబడిదారులకు మాత్రమే. గత మూడేళ్లలో 3 లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడిదారులకు రుణమాఫీ చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుంది. బ్యాంకుల్లో ప్రజలు డిపాజిట్ చేసిన సొమ్మును రుణంగా తీసుకుని లూటీ చేస్తున్న దుస్థితి దేశంలో నెలకొంది. లలిత్‌మోదీ, నీరవ్‌మోదీ, నరేంద్రమోదీ.. ఇలా అందరు మోదీలు దేశాన్ని లూటీ చేస్తున్నారు. బ్యాంకుల లూటీ జరిగేంతవరకు దేశంలో ఇంతమంది మోదీలున్నారన్న సంగతి ప్రజలకు తెలియదు’’ అని ఏచూరి వ్యాఖ్యానించారు. దేశంలో ఆకలి చావులు పెరిగిపోతున్నాయని, నవ భారత నిర్మాతలైన యువకులకు విద్య, ఉద్యోగం, ఆరోగ్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపి తీరుతామని ప్రజలకు వాగ్దానం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కౌరవ సేనను ఓడిస్తాం దేశంలో మతతత్వ రాజకీయాలు పెరిగిపోతున్నాయని ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మతంపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దుర్వినియోగం చేస్తూ అన్నదమ్ముల్లా ఉన్న హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలను సృష్టించే కుట్రకు పాల్పడుతున్నారు. మతం పేరుతో అత్యాచారాలు చేసి బాధితుల పక్షాన నిలవకుండా దౌర్జన్యకారులకు వత్తాసు పలుకుతున్న దుస్థితి ఎన్నడూ లేదు. రామాయణం కథ చెప్పి రాముడి పేరుతో ఓట్లు దండుకుంటున్న బీజేపీ మహాభారతాన్ని విస్మరించింది. మహాభారతంలో కౌరవుల్లాంటి వారు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు. ఆ 100 మంది కౌరవుల్లో మోదీ, అమిత్‌షాలు దుర్యోధన, దుశ్శాసన లాంటివారు. ఆ కౌరవులకు భీష్ముడిలా, ద్రోణాచార్యుడిలా ఆర్ఎస్ఎస్ వ్యవహరిస్తోంది. ఈ కౌరవసేనను ఓడించే పాండవులుగా మేం పనిచేస్తాం. మతోన్మాద శక్తులను మట్టికరిపించి దేశంలో సామరస్యాన్ని కాపాడతాం’’ అని చెప్పారు. వారిది కౌరవ సైన్యమయితే తమది ప్రజాసైన్యమని అన్నారు. కేసీఆర్ ఫ్రంట్‌తో లాభమేంటి? ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్న ఫెడరల్ ఫ్రంట్‌పై ఏచూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్రంట్‌లో చేరాలని కేసీఆర్ తనతో మాట్లాడారని, అయితే ఫ్రంట్‌లో చేరి ఉపయోగం ఏంటని ఆయన ప్రశ్నించారు. ‘‘వ్యక్తులు, పార్టీలను చూసి ఫ్రంట్‌లో చేరేందుకు సీపీఎం సిద్ధంగా ఉండదు. ఫ్రంట్ విధానాల ఆధారంగానే మేం నిర్ణయం తీసుకుంటాం’’ అని చెప్పారు. ఎన్నికల సమయంలోనే ఎత్తుగడలపై ఆలోచిస్తామన్నారు. తెలంగాణకు చెందిన ప్రముఖ కవి మగ్ధూం మొయినుద్దీన్ చెప్పినట్టు భాగ్యాన్ని తీసుకుని, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని, అందరినీ కలుపుకుని విజయం సాధిస్తామన్నారు. తెలంగాణలో ప్రజా ఉద్యమాలను బలపర్చడం ద్వారా భవిష్యత్‌ను నిర్మించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పూర్వ వైభవం తథ్యం సాయుధ పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తెలంగాణలో ఎర్రజెండాకు పూర్వ వైభవం రావడం తథ్యమని ఏచూరి« ధీమా వ్యక్తం చేశారు. ఈ సభకు హాజరైన లక్షలాది మంది ప్రజలను చూస్తుంటే తనకు ఆ నమ్మకం కలుగుతోందని, ఈ ఊపు కొనసాగించాలని, ఈ గడ్డపై ఎర్రజెండా ఎగురవేయాలని పేర్కొన్నారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో ప్రకాశ్ కారత్, బృందా కారత్, రామచంద్రన్ పిళ్లై, బిమన్‌బోస్, కేరళ సీఎం పినరయ్ విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, తమ్మినేని వీరభద్రం, చెరుపల్లి సీతారాములు, మల్లు స్వరాజ్యం, పి.మధు, ఎస్.వీరయ్య, జి.నాగయ్య, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, జూలకంటి రంగారెడ్డి, నంధ్యాల నర్సింహారెడ్డి, జి.రాములు, పాటూరి రామయ్య, పోతినేని సుదర్శన్, జ్యోతి, డి.జి.నర్సింగరావు, బి.వెంకట్, నున్నా నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎం జాతీయ మహాసభలకు సర్వం సిద్ధం
-
మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటం
సాక్షి, కేయూ క్యాంపస్: మతోన్మాద శక్తులపై, విద్యారంగ సమస్యలపై పోరాడాలని కేరళ మాజీ మంత్రి, ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి భినయ్ విశ్వం పిలుపునిచ్చారు. అఖిలభారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) జాతీయ సమితి సమావేశాలు కాకతీయ యూనివర్సిటీలోని ఫిజిక్స్ విభాగంలోని సెమినార్‌హాల్‌లో శనివారం ప్రారంభమయ్యా యి. ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీ ఉల్లాఖాద్రీ అధ్యక్షత వహించిన ఈ సభలో బినయ్ విశ్వం ముఖ్య అతిథిగా మాట్లాడారు. దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూనివర్సిటీల్లో మతోన్మాద శక్తుల దాడులు పెరిగిపోయాయని తెలిపారు. విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన యూ నివర్సిటీల్లో కుల,మత రాజకీయాలు తగదన్నారు. దేశంలో అక్కడక్కడ బాబాలు, దొంగస్వాములు ఆశ్రమ విద్యాలయాల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నా మోదీ ప్రభుత్వం వారికి వత్తాసు పలుకుతోందని విమర్శించారు. దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించకుండా ఎఫ్‌డీఐ పేరుతో విదేశీ యూనివర్సిటీలను తీసుకొచ్చే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలోని ఐసీహెచ్ఆర్ చైర్మన్‌గా కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన హిస్టరీ రిటైర్డ్ ప్రొఫెసర్ సుదర్శన్‌రావును నియమించుకున్నారని ఆరోపించారు. 1992 డిసెంబర్ 6న హిందుత్వ మతోన్మాదులు బాబ్రీ మసీద్‌ను కూల్చివేశారన్నారు. శాస్త్రీయ విద్యావిధానం అవసరం న్యూ ఇండియా న్యూ ఎడ్యూకేషన్ తో దేశం ముందుకెళ్లాలంటే పాలకవర్గాలు అనుసరిస్తున్న ప్రజా, విద్యా వ్యతిరేక విధానాలను ఏఐఎస్ఎఫ్ జాతీ య సమితి సమావేశాల్లో చర్చించి పక్కా ప్రణా ళికతో మిలిటెంట్ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఏఐ ఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీఉల్లా ఖాద్రీ మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలనుంచి తప్పుకునేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని విమర్శించారు. ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి విశ్వజిత్, ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు, ఢిల్లీకి చెందిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రహీలపర్వీన్ మాట్లాడారు. జాతీయ సమితి సమావేశాల్లో భవిష్యత్ పోరాటాలు చేసేందుకు ఉపక్రమించేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈ సభలో తెలంగాణ రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వేణు, శివరామకృష్ణ, జాతీయ కార్యవర్గసభ్యులు స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సుబ్బారావు, రంగన్న, పంజాబ్ రాష్ట్రకార్యదర్శి విక్కి మహేశ్వర్, రాజస్తాన్ రాష్ట్ర కార్యదర్శి నితిన్, రాష్ట్ర బాధ్యులు రంజిత్, అశోక్‌స్టాలిన్, రాజారాం, భానుప్రసాద్‌తో పాటు జిల్లా అధ్యక్షుడు కె నరేశ్, గడ్డం నాగార్జున తది తరులు పాల్గొన్నారు. కాగా ప్రారంభ సూచికగా శ్వేత అరుణ పతాకాన్ని ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు ఆవిష్కరించారు. ఈ నెల 7న సాయంత్రం ఈ సమావేశాలు ముగియబోతున్నాయి -
29నుంచి కిసాన్‌సంఘ్ జాతీయ మహాసభలు
విజయవాడ (గాంధీనగర్) : భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ మహాసభలు ఈనెల 29, 30, 31 తేదీల్లో గుంటూరు జిల్లా నూతక్కి విజ్ఞాన విహార పాఠశాల ఆవరణలో జరుగుతాయని సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు జలగం కుమారస్వామి తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ మహాసభలు రాష్ట్రంలో నిర్వహించడం ఇదే ప్రథమమన్నారు. ఈ సభలు జాతీయ అధ్యక్షుడు బసవేగౌడ అధ్యక్షత జరుగుతాయని, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి ఉద్యమ కార్యచరణ చేపడతామన్నారు. రైతులకు మేలు జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి తెస్తామన్నారు. పంటల బీమా, పంట నష్ట పరిహారం చెల్లింపు వంటి విషయాలపై చర్చిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర అ«ధ్యక్షుడు ఎస్.రాంబాబు, జిల్లా అధ్యక్షుడు మేడసాని విజయభాస్కర్ పాల్గొన్నారు. -
21 నుంచి ఏఐఎస్ఎఫ్ జాతీయ సమావేశాలు
హైదరాబాద్: అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జాతీయ సమావేశాలు ఈనెల 21 నుంచి తిరుపతిలో జరుగనున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలను ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రీ ప్రారంభించనున్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నేతలు బయ్యన్న, స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ.. 23 రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారని చెప్పారు. సమావేశాల్లో కేంద్రం అనుసరిస్తున్న విద్యార్థి వ్య తిరేక విధానాలపై చర్చించనున్నామన్నారు. అలాగే విద్య కాషాయికరణ, మైనారిటీ విద్యాసంస్థలపై దాడులు, విద్య వ్యాపారీకరణ తదితర అంశాలపై చర్చి స్తామన్నారు. సర్కారీ విద్య నుంచి పేద విద్యార్థులను దూరం చేస్తున్న ప్రభుత్వ విధానాలపై పోరాటానికి సమాయత్తమవుతున్నట్లు వెల్లడించారు.