కదిలించిన ‘సాక్షి’ కథనం
కామారెడ్డి: ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దిన కామారెడ్డి ప్రభుత్వ కళాశాల దీనస్థితికి చేరుకున్న వైనంపై గత డిసెం బర్ 13న ‘సాక్షి’లో ‘కూలుతున్న విద్యా వృక్షం’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనం విద్యార్థులను కదిలించింది. ఉద్యమబాట పట్టించి విజయబాటలో పయనించేలా చేసింది. పలువురు ‘సాక్షి’ కథనం క్లిప్పింగులను సామాజిక ప్రసార మాద్యమాలలో ఉంచి షేరింగ్ చేయడంతో, దేశ,విదేశాలలో ఉన్న ఈ ప్రాంతవాసులు సైతం కాలేజీని కాపాడాలంటూ కామెంట్లు పెట్టారు.
మొదట ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మొదలు కాగా, తరువాత మిగతా సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడి దీక్షలలో కూర్చున్నాయి. నెల రోజులుగా దీక్ష లతోపాటు రాస్తారో కోలు, ధర్నాలు నిర్వహించారు. ఆందోళనకు జేఏసీ, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. డిగ్రీ కాలేజీ దీనస్థితిపై ఎప్పటికప్పుడు ‘సాక్షి’లో కథనాలు వెలువడడం, విద్యార్థుల ఆందోళనలతో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ స్పందించి కలెక్టర్ రొనాల్డ్ రాస్‌తో మాట్లాడారు.
దీంతో ఆయన డీసీఓ శ్రీహరిని విచారణకు పం పించారు. శుక్రవారం విప్ జేఏసీ, విద్యార్థి సంఘాల నేతలను తీసుకుని సీఎంను కలిసి కాలేజీ గురించి చర్చించారు. కాలేజీ యాజమాన్యం ఆస్తులను అప్పగిస్తే వారిని సన్మానిద్దామని, అప్పగించకుంటే ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుందామని సీఎం తెలిపారు. కాగా, కాలేజీ యాజమాన్య కమిటీ సభ్యులు ఇప్పటికే ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించడానికి ముందుకు వచ్చారు. ఈ నెల 22న కామారెడ్డిలో సీఎం పర్యటన సందర్భంలో పూర్తి రికార్డులను ప్రభుత్వానికి అప్పగించనున్నారు.
విద్యార్థుల్లో హర్షం
కాలేజీని స్వాధీనం చేసుకోవడడానికి సీఎం హామీ ఇవ్వడంతో విద్యార్థులలో హర్షం వ్యక్తమవుతోంది. దీంతోపాటు విద్యాభివృద్దికి చర్యలు తీసుకుంటామని సీఎం ప్ర కటిం చిన దరిమిలా విద్యార్థి సంఘాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కాలేజీని పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకునేంతవరకు దీక్షలు కొనసాగుతాయని విద్యార్థి జేఏసీ నేతలు పేర్కొన్నారు.