ఆన్‌లైన్‌లో వివిధ ధ్రువీకరణ పత్రాల మంజూరు ప్రక్రియ(ఆన్‌లైన్)లో జరుగుతున్న జాప్యంపై ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం....
అనంతపురం రూరల్: ఆన్‌లైన్‌లో వివిధ ధ్రువీకరణ పత్రాల మంజూరు ప్రక్రియ(ఆన్‌లైన్)లో జరుగుతున్న జాప్యంపై ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట వి ద్యార్థులు ఆందోళనకు దిగారు. దాదా పు రెండు గంటలపాటు బైఠాయించి నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ తహశీల్దార్ కార్యాలయంలో ఆన్‌లైన్ నమోదు ఆలస్యమవుతోందన్నారు. ఓవైపు స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుచేసుకోడానికి గడువు సమీపిస్తోందన్నారు.
ఇందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు లభించక విద్యార్థులు ఆందోళనకు గురవున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ నేతలు, విద్యార్థులు మొదటగా డెప్యూటీ తహశీల్దార్ కుమారస్వామితో వాగ్వాదానికి దిగారు. తహశీల్దార్‌కు మీ సమస్యలు చెప్పుకోవాలని ఆయన సమాధానం ఇ వ్వడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశా రు. అధికారుల వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. త్రీ టౌన్ సీఐ దేవానంద్, ఎస్‌ఐలు తమీమ్, శంకర్‌రెడ్డి ఆందోళనకారులతో మాట్లాడారు.
అయినా వారు శాంతించలేదు. చివరకు తహశీల్దార్ షేక్ మహబూబ్ బాషా వచ్చి ఏఐఎస్‌ఎఫ్ నాయకులతో మాట్లాడారు. 7 వేల మందికి పైగా అభ్యర్థులకు సంబంధించి ఆన్‌లైన్ చేయాల్సి ఉందన్నారు. మూడు రోజులుగా సర్వర్ డౌన్ కావడం వల్ల జాప్యం అవుతోందన్నారు.
వాస్తవంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీ సేవలో దరఖాస్తు చేసుకున్న 30 రోజుల వరకు సమయం ఉంటుందన్నారు. అలాంటిది రెండు మూడు రోజుల్లో ప్రక్రియను పూర్తి చేస్తున్నామన్నారు. ధ్రువీకరణ పత్రాలు పొందలేనివారు తనను కలిస్తే మాన్యువల్‌గా సంతకం చేసి అందజేస్తామన్నారు.