మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్రం
మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్రం
Published Tue, Jul 26 2016 11:10 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
యాదగిరిగుట్ట: ప్రస్తుతం విద్యా విధానంపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తోందని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రీ ఆరోపించారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో జరుగుతున్న ఏఐఎస్‌ఎఫ్ తెలంగాణ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల్లో ప్రచురించిన పాఠ్యపుస్తకాల్లో ఒక వర్గానికి చెందిన మతాలకే అధిక ప్రాధాన్యమిచ్చి, మరో మతం మనోభావాలను దెబ్బతీసేలా యత్నించిందన్నారు. విద్యాహక్కు చట్టాలను తుంగలో తొక్కి బలహీన వర్గాలకు విద్యను అందని ద్రాక్షలా మారుస్తోందని విమర్శించారు. కులం, మతం పేరుతో విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వేణు, తెలంగాణ యూనివర్సిటీల కన్వీనర్ ఆర్.ఎన్.శంకర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొండల్, వెంకటేష్, బబ్బూరి శ్రీధర్‌గౌడ్ ఉన్నారు.
Advertisement