డిగ్రీలో సెమిస్టర్ విధానం వద్దు: ఏఐఎస్‌ఎఫ్ | no need of semister pattern in degree exams, says AISF | Sakshi
Sakshi News home page

డిగ్రీలో సెమిస్టర్ విధానం వద్దు: ఏఐఎస్‌ఎఫ్

Published Mon, Jul 27 2015 11:09 AM | Last Updated on Sun, Sep 3 2017 6:16 AM

డిగ్రీలో సెమిస్టర్ విధానం వద్దు: ఏఐఎస్‌ఎఫ్

డిగ్రీలో సెమిస్టర్ విధానం వద్దు: ఏఐఎస్‌ఎఫ్

అనంతపురం అర్బన్ : డిగ్రీలో సెమిస్టర్ పరీక్షల విధానం అమలు ఆలోచనను విరమించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పలువురు విద్యార్థులు ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ... డిగ్రీలో సెమిస్టర్ పరీక్షల విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందన్నారు.

ఈ విధానంతో గ్రామీణ విద్యార్థులు నష్టపోయే అవకాశమున్నందున, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు కోరారు. అలాగే ప్రభుత్వ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement