degree exams
-
ముగిసిన వైవీయూ డిగ్రీ పరీక్షలు
వైవీయూ: యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రథమ, తృతీయ సెమిస్టర్ పరీక్షలు శనివారం సాయంత్రంతో ముగిశాయి. జిల్లావ్యాప్తంగా 60 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 10 రోజుల పాటు నిర్వహించిన పరీక్షల్లో మొత్తం మీద 90 మంది విద్యార్థులు డీబార్ అయ్యారు. కాగా రాయచోటిలోని హెచ్ఎం డిగ్రీ కళాశాలలో జరిగిన ఘటన మినహా మిగతా అన్ని చోట్ల పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. ఈ పరీక్షలకు 25,301 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా చివరిరోజు పరీక్షల్లో పలు కేంద్రాలను పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎన్. ఈశ్వరరెడ్డి తనిఖీ చేశారు. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, ఒంటిమిట్ట డిగ్రీ పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. శనివారం పరీక్షల్లో నలుగురు డీబార్ అయినట్లు ఆయన తెలిపారు. వీసీ ఆచార్య మునగాల సూర్యకళావతి, రిజిస్ట్రార్ ఆచార్య డి. విజయరాఘవప్రసాద్ మార్గదర్శనంలో పరీక్షలను సజావుగా, కట్టుదిట్టంగా నిర్వహించామన్నారు. -
తెలంగాణ విద్య, ఉద్యోగ సమాచారం
ఓయూ దూరవిద్య డిగ్రీ పరీక్షలు 18 నుంచి ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ దూరవిద్య బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల పరీక్షలు ఈ నెల 18 నుంచి వచ్చే నెల 17 వరకు జరగనున్నట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల టైంటేబుల్ వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో చూడవచ్చన్నారు. గూప్స్పై రేపు 21వ సెంచరీ అవగాహన సదస్సు సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఆదివారం ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణప్రదీప్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8న ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని తమ అకాడమీలో ఈ కార్యక్రమం ఉంటుందని, సిలబస్, ప్రిపరేషన్, వ్యూహాలు, నోట్స్ తయారీ, సమయపాలన వంటి అంశాలపై నిష్ణాతులైన అధ్యాపకులు అవగాహన కల్పిస్తారని వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు 9133237733 లో సంప్రదించవచ్చని సూచించారు. పీజీ సెమిస్టర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 10నుంచి ప్రారంభంకానున్న వివిధ రెగ్యులర్ పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు అడిషనల్ కంట్రోలర్ ప్రొ.అంజయ్య శుక్రవారం పేర్కొన్నారు. ఎం.ఎ, ఎం.కాం, ఎమ్మెస్సీ, ఇతర పీజీ కోర్సులు చదివే ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు నేటి నుంచి ఆయా కాలేజీల్లో హాల్ టిక్కెట్లను పొందవచ్చన్నారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో చూడవచ్చని తెలిపారు. జూలై 23న డీసెట్ సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి జూలై 23న ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు డీసెట్ కన్వీనర్ శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ ద్వారా ఈ నెల 9 నుంచి జూన్ 30 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు డీసెట్ వెబ్‌సైట్‌కు లాగిన్ కావాలని సూచించారు. ‘మనూ’లో యూజీ కోర్సుల దరఖాస్తు 22 వరకు గచ్చిబౌలి: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)లో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సులకు దరఖాస్తు చేసుకునే గడువు తేదీని పెంచారు. శుక్రవారంతో ముగియనున్న గడువు తేదీని మే 22 వరకు పెంచారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) ద్వారా అన్ని సెంట్రల్ యూనివర్సిటీలకు కలిపి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకారం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు దారులు సీయూఈటీ వెబ్‌సైట్‌ను పరిశీలించి దరఖాస్తులు పంపించాలి. దరఖాస్తులు ఉర్దూ యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటాయి. కాగా, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ఆన్లైన్ అడ్మిషన్స్ రెగ్యులర్ మోడ్ కింద ఎంట్రన్స్ ఆధారంగా సీట్లు కేటాయించే కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 1 చివరి తేదీగా ప్రకటించారు. అలాగే మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించే వాటికి దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 30 చివరి తేదీగా పేర్కొన్నారు. దరఖాస్తులు యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయన్నారు. సింగరేణిలో గిరిజన బ్యాక్లాగ్ పోస్టుల ఫలితాలు సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో 665 గిరిజన బ్యాక్లాగ్ పోస్టుల పరీక్షాఫలితాలను యాజమాన్యం విడుదల చేసింది. 2017 జూలైలో నోటిఫికేషన్ జారీ చేసిన ఈ పోస్టులకు 60 వేల మందికి పైగా దర ఖాస్తు చేసుకున్నారు. 2018 జూన్ 10న నిర్వహించిన పరీక్షలో 27,279 మంది అభ్యర్థులు హాజర య్యారు. అన్ని విధాలుగా అర్హులైన 665 మందికి నెలరోజుల్లోగా నియామక ఉత్తర్వులు అందజేస్తామని సింగరేణి డైరెక్టర్ ఎన్.బలరామ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని యాజమాన్యం భావించినప్పటికీ కోర్టు కేసుల కారణంగా జాప్యం జరిగిందన్నారు. గిరిజనులకు ఉద్యోగాలు కల్పించాలన్న సంకల్పంతో కేసుల పరిష్కారానికి యాజమాన్యం కృషి చేయడం హర్షణీయమని పలువురు పేర్కొన్నారు. మే 7న బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల వెబ్ కౌన్సెలింగ్‌కు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దంత కళాశాలల్లో బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్ పూర్తయిందని తెలిపింది. కన్వీనర్ కోటాలో ఇంకా మిగిలిపోయిన ఖాళీలను ఈ అడిషనల్ మాప్ అప్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నామని వెల్లడించింది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అదే రోజు రాత్రి 8 గంటల వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చునని సూచించింది. గత విడత కౌన్సెలింగ్‌లో సీట్ పొంది చేరకపోయినా, చేరి మధ్యలో మానేసినా, అల్ ఇండియా కోటాలో ఇప్పటికే సీటు పొందిన అభ్యర్థులూ ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులని స్పష్టం చేసింది. -
ఓయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ ఇదే
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 26 నుంచి వివిధ డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని సోమవారం కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీనగేష్ తెలిపారు. ఈ నెల 26న డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరాల రెగ్యులర్ కోర్సుల 3, 5 సెమిస్టర్ పరీక్షలు, 28న డిగ్రీ మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. (క్లిక్: త్వరలోనే విద్యుత్ సంస్థల్లో ఏఈ పోస్టుల భర్తీ) కోవిడ్ కారణంగా గతంలో 2 గంటల వరకు కుదించిన సమయాన్ని ఇక నుంచి డిగ్రీతో పాటు ఇతర కోర్సులకు సైతం పాత సమయాన్ని 3 గంటల వరకు పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. ఓయూలో పరీక్షల వాయిదా పడ్డాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని విద్యార్థులకు సూచించారు. త్వరలో డిగ్రీ పరీక్షల టైం టేబుల్‌ను ఉస్మానియా వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన చెప్పారు. (క్లిక్: 25 నుంచి నుమాయిష్ పునఃప్రారంభం) -
ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం.. దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ 81వ స్నాతకోత్సవంలో భాగంగా ఈ నెల 27వ తేదీన జరిగే కార్యక్రమంలో డిగ్రీ పట్టాలను అందుకోవాలనుకునే పీహెచ్డీ అభ్యర్థులు ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ శుక్రవారం తెలిపారు. బంగారు పతకాలు అందుకునే అభ్యర్థుల జాబితాను ఉస్మానియా వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. పూర్తి వివరాలకు వెబ్సైట్లో చూడాలన్నారు. 18 వరకు డిగ్రీ సప్లిమెంటరీ, ఇన్స్టంట్ పరీక్షల ఫీజు చెల్లింపు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ కోర్సుల 1, 3, 5 బ్యాక్‌లాగ్‌లతో పాటు కోవిడ్ కారణంగా ప్రత్యేకంగా నిర్వహిస్తున్న డిగ్రీ ఇన్స్టంట్ 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 18 వరకు చెల్లించవచ్చునని ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ శుక్రవారం తెలిపారు. రూ.200 అపరాధ రుసుముతో 23 వరకు, రూ.500 రుసుముతో 26, 27 వరకు, రూ.1000 రుసుముతో 28, 29 వరకు, రూ.2000 రుసుముతో నవంబరు 1, 2 వరకు, రూ.5000 అపరాధ రుసుముతో నవంబరు 3 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చునన్నారు. వివరాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయ వెబ్సైట్ చూడాలన్నారు. 26 నుంచి ఎంబీఏ పరీక్షలు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 6 వరకు ఎంబీఏ రెగ్యులర్ 2వ సెమిస్టర్, బ్యాక్లాగ్ 1వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కంట్రోలర్ తెలిపారు. పరీక్షల టైంటేబుల్‌ను ఉస్మానియా వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. ఓయూ దూరవిద్యలో సెమిస్టర్ విధానం ఉస్మానియా విశ్వవిద్యాలయ దూరవిద్య కేంద్రంలో వివిధ కోర్సులలో సెమిస్టర్ పరీక్షా విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. ప్రస్తుతం ఎంబీఏ కోర్సుకు మాత్రమే ఉన్న సెమిస్టర్ పరీక్ష విధానాన్ని ఇతర పీజీ కోర్సులకు కూడా అమలు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం (2021–22) ఎంసీఏ కోర్సును మూడు నుంచి రెండు సంవత్సరాలకు కుదించి సెమిస్టర్ పరీక్షను అమలుపర్చనున్నారు. రానున్న విద్యా సంవత్సరం (2022–23) నుంచి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, పీజీడీసీఏ కోర్సులకు సెమిస్టర్ పరీక్ష విధానాన్ని అమలు చేస్తామని అధికారులు వివరించారు. అందుకు అనుగుణంగా పీజీ పుస్తకాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. పీజీ తర్వాత డిగ్రీ కోర్సులకు కూడ సెమిస్టర్ పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టేయోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ విద్యా సంవత్సరానికి (2021–22) వివిధ కోర్సులలో జోరుగా అడ్మిషన్లు సాగుతున్నాయన్నారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశ గడువు పొడిగింపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ, బీకాం,బీఎస్సీ), పీజీ (బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ) పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో చేరడానికి ఆలస్య రుసుము రూ. 200 తో చివరి తేదీ అక్టోబర్ 13 వరకు పొడిగించినట్లు వర్సిటీ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను https://www.braouonline.in/లో పొందుపర్చినట్లు వెల్లడించారు. వివరాలకు 7382929570/580 లేదా విశ్వవిద్యాలయ 040–23680290/291/294/295 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. -
తెలంగాణ :డిగ్రీ పరీక్షలు ఆన్ లైన్ లో నిర్వహించాలంటూ వేసిన పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
-
డిగ్రీ, పీజీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: పాపిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. బుధవారం పాపిరెడ్డి ఓ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ గతంలో ఒక రూమ్ లో 40 మందిని కూర్చోబెట్టి పరీక్ష నిర్వహించే వాళ్ళమని, ఇప్పుడు 20 మంది మాత్రమే కూర్చొని పరీక్ష రాస్తారని అన్నారు. ప్రతి విద్యార్థికి మద్యలో ఒక బెంచ్ ఖాళీగా వుంటుందని, అయితే ఇన్విజిలేటర్లు మాత్రం బయటి నుంచి వస్తారని, సాధ్యమైనంత త్వరగా ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. మరోవైపు పరీక్ష రాయలేని వాళ్లకు అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహిస్తామని, సర్టిఫికేట్లో మాత్రం రెగ్యులర్ అనే వస్తుందని పేర్కొన్నారు. కాగా ప్రతి విద్యార్థి మాస్క్ ధరించి పరీక్షకు హాజరవ్వాలని ఇప్పుడు మాత్రం చివరి సంవత్సర విద్యార్థులకే పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన 6 యూనివర్సిటీలలో రెండు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని, ఒక వేళ బ్యాక్ లాగ్స్ వుంటే మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మరోవైపు ఎంసెట్ రాయలేని వారి గురించి ప్రభుత్వ పరంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని పాపిరెడ్డి స్ఫష్టం చేశారు. -
అక్టోబర్ 5 నుంచి అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: డా. బీ. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ పరీక్షల తేదీలను బుధవారం ప్రకటించింది. డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 7 నుంచి 13 వరకు, ఐదో సెమిస్టర్ పరీక్షలను అక్టోబర్ 11 నుంచి 16 వరకు, ఆరో సెమిస్టర్ పరీక్షలను అక్టోబర్ 5 నుంచి 10 తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా డిగ్రీ (ఓల్డ్ బ్యాచ్) మూడో సంవత్సరం పరీక్షలను అక్టోబర్ 18 నుంచి 23 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు, మొదటి సంవత్సరం పరీక్షలు నవంబర్ 4 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. డిగ్రీ పరీక్షలను మధ్యాహ్నం 2.00 నుంచి 5.00 వరకు నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరు అయ్యే విద్యార్థులు, పరీక్ష తేదీకి రెండు రోజుల ముందే విశ్వవిద్యాలయ వెబ్ పోర్టల్ www.braouonline.in లో హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు వారి సంబంధిత ఆధ్యయన కేంద్రం లేదా విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.braou.ac.in ను సందర్శించ వచ్చని, మరింత సమచారం కోసం విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ 7382929570/580/590/600 ఫోన్ నెంబర్లకు సంప్రదించ వచ్చని సూచించారు. -
డిగ్రీ, పీజీ పరీక్షలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బుధవారం నుంచి నిర్వహించనున్న ఈ పరీక్షలు రాయలేక పోయిన విద్యార్థులకు త్వరలోనే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని, వాటిలో ఉత్తీర్ణత సాధించినా రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణిస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు లను ధర్మాసనం రికార్డు చేసింది. గతంలో ఇదే షరతుతో పదో తరగతి పరీక్షలు, పీజీ మెడికల్ విద్యార్థుల పరీక్షలకు అనుమతి నిచ్చిన విష యాన్ని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో పరీక్ష లను ఆపడానికి సహేతుక మైన కారణాలేవీ లేవని తేల్చిచెప్పింది. అయితే కోవిడ్ నిబంధన లను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసు కోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అటానమస్ కళాశాలలు, వర్సిటీల్లో వారి సిలబస్‌కు అనుగుణంగా వారికి నచ్చిన ఆన్లైన్/ఆఫ్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించుకోవచ్చంది. ఇటు యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో మాత్రం పరీక్షలను భౌతికంగానే నిర్వహించాలని పేర్కొంది. అలాగే ఇప్పుడు పరీక్షలు రాయలేని వారి కోసం విద్యా సంవత్సరం నష్టపోకుండా.. వీలైనంత త్వరగా, ఇప్పుడు నిర్వహిస్తున్న పరీక్షల ఫలితాలు ప్రకటించిన వెంటనే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆన్లైన్లోనే పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు బీవీ నరసింగరావు, గరీబ్ గైడ్ స్వచ్ఛంద సంస్థ వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను ఎప్పుడు పెడతారో స్పష్టం చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనను కోర్టు తోసిపుచ్చింది. అది విధానపరమైన నిర్ణయం.. ‘పరీక్షలు ఆన్లైన్ విధానంలోనా లేక భౌతిక పద్ధతిలోనా ఏవిధంగా నిర్వహించాలన్నది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. విధానపమైన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు. ఆన్లైన్ విధానంలోనే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేం. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలన్నది కూడా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమే. ఫలానా సమయంలోనే పరీక్షలు నిర్వహించాలని ఆదేశించలేం.. అయితే విద్యా సంవత్సరం నష్టపోకుండా ఇప్పుడు నిర్వహిస్తున్న పరీక్షల ఫలితాలు ప్రకటించిన వెంటనే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేలా చూడాలని ప్రభుత్వానికి సూచన మాత్రమే చేయగలం. జేఎన్టీయూ మాత్రం రెండు నెలల్లో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. కాబట్టి వారికి ఎటువంటి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు’అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లోని పీజీ కోర్సుల ఫైనలియర్ విద్యార్థులతో పాటు డిగ్రీ కోర్సుల ఫైనలియర్ విద్యార్థులూ బుధవారం నుంచి పరీక్షలు భౌతికంగానే రాయాల్సి ఉంటుంది. -
పరీక్షలు ఆన్‌లైనా? భౌతికమా?
సాక్షి, హైదరాబాద్: ‘‘అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) విద్యార్థులకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదని, భౌతికంగానే నిర్వహించాలని కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ అన్ని కళాశాలలకూ ఈ నెల 11న ఉత్తర్వులు జారీచేశారు. అదే కమిషనర్....అటానమస్ కళాశాలలు తమకు ఇష్టమైన రీతిలో పరీక్షలు నిర్వహించుకునే స్వేచ్ఛ ఇస్తూ 12న మరో ఉత్తర్వు ఇచ్చారు. ఇలా పరస్పర విరుద్ధంగా, పొంతన లేకుండా ఆదేశాలు జారీచేస్తే ఎలా?’’అని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆన్లైన్లోనే పరీక్షలు నిర్వహించేలా ఆదేశించాలంటూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బీవీ నర్సింగ్‌రావు, గరీబ్‌గైడ్ స్వచ్ఛంద సంస్థ వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం మరోసారి విచారించింది. పరీక్షలు భౌతికంగా మాత్రమే నిర్వహించాలని, ఆన్లైన్లో జరపడానికి వీల్లేదని కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ అన్ని కళాశాలలు, యూనివర్సిటీలకూ ఉత్తర్వులు జారీచేశారని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. అయితే అటానమస్ కళాశాలలు, వర్సిటీలు ఎలాగైనా పరీక్షలు నిర్వహించుకునేందుకు స్వేచ్ఛనిస్తూ మరో ఉత్తర్వు జారీచేశారని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘ఎలాగైనా అంటే?...ఆన్లైన్లో కూడా పరీక్షలు నిర్వహించుకోవచ్చనా? పరీక్షల షెడ్యూల్‌ను ఎప్పుడైనా ప్రకటించుకోవచ్చనా?’అని సందేహం వ్యక్తం చేసింది. ఆన్‌లైన్‌లోనూ నిర్వహించుకోవచ్చని, అటానమస్ కళాశాలల్లో 600 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని, అందువల్ల వారికి ఈ విధానంలో పరీక్షలు నిర్వహించడం సులభమని అడ్వకేట్ జనరల్ అన్నారు. అయితే వర్సిటీలు, వర్సిటీల గుర్తింపు ఉన్న కళాశాలల్లో 2,40,356 మంది యూజీ, 30,922 మంది పీజీ విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉందని చెప్పారు. వీరు తప్పనిసరిగా పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని, ఇప్పుడు రాయలేని వారికి తర్వాత స్పెషల్ సప్లిమెంటరీ నిర్వహిస్తామన్నారు. అందులో ఉత్తీర్ణత సాధించినా రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణిస్తామని తెలిపారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ కూడా భౌతికంగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిందని వర్సిటీ తరఫు న్యాయవాది ధర్మేష్ జైశ్వాల్ నివేదించారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేదని, వారి నివాస ప్రాంతానికి సమీపంలోని కళాశాలల్లోనే రాయ చ్చొని తెలిపారు. అయితే, భౌతికంగానే పరీక్షలు నిర్వహించాలనేదానికి సహేతుక కారణాలను చూపించలేదని, గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు హైదరాబాద్‌కు రావడం ప్రయాసతో కూడుకున్నదని, ఈ నేపథ్యంలో ఆన్లైన్లోనే పరీక్షలు నిర్వహించేలా ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. పరీక్షలు ఏ విధానంలో నిర్వహించాలనేది ప్రభుత్వ విధానపర నిర్ణయమని, అందులో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కొందరు విద్యార్థులకు ఆన్లైన్లో, మరికొందరికి భౌతికంగా పరీక్షలు నిర్వహించడం వివక్ష చూపించడమేనని విద్యార్థుల తరఫున న్యాయవాది వై.శ్రీనివాసమూర్తి వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం...పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీచేయాలని, వాటిని తమకు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
ఆన్లైన్లో డిగ్రీ పరీక్షలు నిర్వహించలేరా..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. కరోనా వైరస్ కారణంగా హాస్టల్స్ మూసి ఉన్నందున పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఇబ్బంది పడతారని, చివరి సెమిస్టర్ పరీక్షలన్నీ ఆన్లైన్లో నిర్వహించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. పిటిషనర్ వాదనపై స్పందించిన న్యాయస్థానం.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించగలరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సాంకేతికతను ఉపయోగించుకుని ఇంజనీరింగ్ కోర్సులకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. అలాగే సప్లమెంటరీలో ఉత్తీర్ణులైన వారిని కూడా రెగ్యులర్‌గా పరిగణిస్తారా అని హైకోర్టు అడిగింది. న్యాయస్థానం ప్రశ్నలకు స్పందించిన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. ప్రభుత్వాన్ని అడిగి చెప్తానని అన్నారు. దీంతో విచారణ ఈనెల 15కు వాయిదా వేసింది. (కరోనా విచారణ.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు) మరోవైపు లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన వివిధ డిగ్రీ కోర్సుల చివరి సంవత్సరం పరీక్షల నిర్వహణకు ఉస్మానియా యూనివర్సిటీ సిద్ధమైంది. ఈనెల 22 నుంచి బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పరీక్షలు మొదలవుతాయి. అదేవిధంగా ఈనెల 15 నుంచి ఇంజనీరింగ్, బీసీఏ, బీఈడీ, బీఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించేందుకు స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. -
డిగ్రీ,పీజీ పరీక్షలపై హైకోర్టు విచారణ
-
డిగ్రీ,పీజీ పరీక్షలపై హైకోర్టు విచారణ
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు చేయాలంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున ఏజీ తన వాదనలు వినిపించారు. పరీక్షలు రద్దు చేయడం కుదరదని, యూజీసీ మార్గదర్శకాల ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. పరీక్షల తేదీలను రెండు,మూడు వారాల తర్వాత ఖరారు చేస్తామని తెలిపారు. పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్నల్ మార్కుల ద్వారా గ్రేడింగ్ ఇవ్వాలని పిటిషనర్ తరపున న్యాయవాది దామోదర్‌రెడ్డి వాదనలు వినిపించారు. యూజీసీ మార్గదర్శకాలు కేవలం సూచనలు మాత్రమేనని, 8 రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేశారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిమ్జ్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా.. నిమ్జ్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. మామిడి గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలిపై రేపు జరగాల్సిన బహిరంగ విచారణ వాయిదా వేయాలని ధర్మాసనం తెలిపింది. కరోనా పరిస్థితుల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించవద్దని హైకోర్టు ఆదేశించింది. -
ఓయూ పరిధిలో 19 నుంచి డిగ్రీ పరీక్షలు
ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా వర్సిటీ పరిధిలో ఈనెల 19 నుంచి డిగ్రీ (రెగ్యులర్ కోర్సులు) విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ మంగళవారం వెల్లడించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం 1, 3, 5 సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ముగిసినట్లు చెప్పారు. వాయిదా పడిన పరీక్షలు వచ్చే నెలలో.. ఆర్టీసీ కార్మికుల సమ్మె, బంద్ కారణంగా అక్టోబర్ 17, 18, 19 తేదీల్లో జరగాల్సిన వివిధ డిగ్రీ కోర్సుల బ్యాక్లాగ్ పరీక్షలు (పాత బ్యాచ్) వచ్చే నెల నిర్వహించనున్నట్లు కంట్రోలర్ తెలిపారు. సెలవు దినాలైన డిసెంబర్ రెండో శనివారం, ఆదివారం ఈ పరీక్షలు ఉంటాయని సూచనప్రాయంగా చెప్పారు. పూర్తి వివరాలకు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్ చూడాలన్నారు. -
డిగ్రీ ప్రశ్నపత్రం లీకేజీ కలకలం!
ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం రెండు గంటలకు ఐదవ సెమిస్టర్ సబ్జెక్టు అయిన ఇంగ్లిష్ ప్రశ్నపత్రం లీక్ అయినట్లు కలకలకం రేగింది. నిర్దేశించిన పరీక్ష సమయం కంటే అర గంట ముందు ఆన్లైన్లో ప్రశ్నపత్రాన్ని పంపుతారు. ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ద్వారా ఆయా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లు అరగంట ముందు ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని విద్యార్థులకు అందజేస్తారు. అయితే బుధవారం మధ్యాహ్నం 1:45 ప్రశ్నపత్రం వాట్సప్‌లో హల్చల్ చేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గోరంట్ల, ఓడీ చెరువులోని డిగ్రీ పరీక్షల కేంద్రం నుంచి ప్రశ్నపత్రం లీకైనట్లు ప్రచారం జరుగుతోంది. వాట్సప్‌లో ప్రశ్నపత్రం వచ్చిన సమయాన్ని బట్టి బుధవారం మధ్యాహ్నం ప్రశ్నపత్రం లీకైనట్లు రూఢీ అవుతోంది. పేపర్ లీక్ కాలేదట! నిర్దేశించిన సమయం కంటే అరగంట ముందు ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ద్వారా ప్రశ్నపత్రాలను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష మధ్యాహ్నం రెండు గంటలకైతే 1:30 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి చేరుకుంటారు. ఈ క్రమంలో ప్రశ్నపత్రం 1:45 నిమిషాలకు బయటకు వచ్చినట్లయితే ప్రశ్నపత్రం లీక్ అయినట్లు కాదని ఎస్కేయూ ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు పేర్కొన్నారు. గోరంట్ల, ఓడీచెరువులోని డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాలను గురువారం సందర్శించి విచారణ చేపడతామన్నారు. ప్రశ్నపత్రం లీకైనట్లయితే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. చర్యలు తీసుకోవాలని వినతి ప్రశ్నపత్రం లీక్‌కు కారణమైన డిగ్రీ కళాశాల యాజమాన్యాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరారు. ఈ మేరకు ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీవీ రాఘవులుకు బుధవారం వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు డాక్టర్ శ్రీధర్ గౌడ్, కుళ్లాయి స్వామి, వేమన, నరసింహ, రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఓయూ డిగ్రీ పరీక్షల్లో గందరగోళం!
సాక్షి, హైదరాబాద్: ఓయూలో జరుగుతున్న డిగ్రీ పరీక్షల హాల్ టికెట్ల ప్రక్రియ ప్రహసనంగా మారింది. మంగళవారం నుంచి ఓయూ డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. అయితే సోమవారం వరకు హాల్‌టికెట్ల రాకపోవడంతో విద్యార్థులు కంగారు పడుతున్నారు. మరికొన్ని కాలేజీలు అసలు కాలేజీకి హాల్‌టికెట్లు వచ్చాయో లేదోనన్న విషయాన్ని ఇంతవరకూ విద్యార్థులకు తెలపకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఓయూ పరిధిలో ముఖ్యంగా హైదరాబాద్‌లో పలు కాలేజీల వద్ద విద్యార్థులు హాల్‌టికెట్ల కోసం పడిగాపులు కాయడం కనిపించింది. అసలేం జరిగింది? ముందస్తు ఎన్నికల నేపథ్యంలో షెడ్యూలు ప్రకారం జరగాల్సిన ఓయూ సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. జరుగుతాయని ఒకసారి, జరగవని మరోసారి, రకరకాలుగా ప్రచారం జరిగింది. 23 వరకు వర్సిటీ నుంచి ఎలాంటి సందేశం రాకపోవడంతో కళాశాల యాజమాన్యాలు సైతం ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోయాయి. అకస్మాత్తుగా ఈనెల 24న వర్సిటీ నుంచి విద్యార్థుల హాల్‌టికెట్లు వచ్చాయి. ఆదివారం సెలవు కావడంతో విద్యార్థులకు కళాశాలలు హాల్‌టికెట్లు ఇవ్వలేకపోయాయి. కొన్ని కాలేజీలు మాత్రం హాల్‌టికెట్లు వచ్చిన విషయాన్ని ఎస్సెమ్మెస్ ద్వారా పంపించాయి. మరికొన్ని కాలేజీలు ఈ విషయాన్ని కనీసం తెలపలేదు. దీంతో సోమవారం కళాశాలకు రాని విద్యార్థులకు అసలు హాల్‌టికెట్లు వచ్చిన విషయమే తెలియలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు సెంటర్ల మార్పు.. డిగ్రీ కాలేజీల సెంటర్లు పెద్దగా మారవు. కానీ ఎన్ని కల కారణంగా కొన్ని కాలేజీలను ఎన్నికల స్ట్రాంగ్‌రూంలుగా వాడుతున్నారు. దీంతో కొన్ని కాలేజీల సెంటర్లు మారిపోయాయి. ఈ విషయంలో యూనివర్సిటీ నుంచి హాల్‌టికెట్లు వచ్చేదాకా తమకు తెలియదని, తాము మాత్రం ఏం చేయగలమని కాలేజీ యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. బ్లాక్ పెన్‌తోనే రాయాలి.. ఈసారి నిర్వహించబోయే పరీక్షల్లో స్వల్ప మార్పులు జరిగాయి. అక్టోబర్ నుంచి ఓయూ పరిధిలో ఆన్లైన్ మూల్యాంకనం ప్రవేశపెట్టారు. మార్కుల్లో అవకతవకలు, మూల్యాంకనంలో పారదర్శకత పెంచేందుకు ఈ విధానం ప్రవేశపెట్టారు. ఆన్లైన్ మూల్యాంకనంలో ఆన్సర్షీట్ స్పష్టంగా కనిపించాలంటే విద్యార్థులంతా బ్లాక్‌పెన్‌తోనే పరీక్ష రాయాలి. ఇప్పుడు హాల్‌టికెట్లు అందకపోవడంతో చాలామంది విద్యార్థులకు ఈ విషయం తెలియకుండా పోయిందని పలు కాలేజీల లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 24న హాల్‌టికెట్లు వచ్చాయి. ఆదివారం సెలవు కావడంతో సోమవారం హడావుడిగా విద్యార్థులకు ఇచ్చారు. మంగళవారం ఉదయం త్వరగా వస్తే తీసుకోని వారందరికీ హాల్‌టికెట్లు ఇస్తామని కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి. -
విద్యార్థికి పరీక్ష !
సాధారణంగా ఏ విద్యార్థి అయినా తాను చదువుతున్న కోర్సు పూర్తికాగానే ఎలాంటికోర్సులు చేయాలో నిర్ణయించుకునే ఉంటారు. ఉన్నత విద్య చదవాలనుకొనే వారు తాముచదువుతున్న కోర్సు చివరి సంవత్సరంలో అడుగుపెట్టినప్పటి నుంచే అందుకు తగిన విధంగా ప్రణాళిక రూపొందించుకొని సిద్ధ్దమవుతారు. అయితే ఎస్వీయూ అధికారుల నిర్లక్ష్యం,రాష్ట్ర ఉన్నత విద్యామండలి అత్యుత్సాహం ఫలితంగా విద్యార్థుల ప్రణాళిక చెదిరింది.గుండె దడ మొదలైంది. భవిష్యత్‌పై భయం పట్టుకుంది. కెరీరా? ఉన్నత విద్య..చుదవుతున్న కోర్సు పూర్తి చేయడమా అన్న సందేహంతో డోలాయానంలో ఉన్నారు. యూనివర్సిటీక్యాంపస్: డిగ్రీ విద్యార్థులకు తమ కెరీర్‌పై సందిగ్ధత పట్టుకుంది. ఎటు వెళ్లాలో నిర్ధారించుకోలేకపోతున్నారు. జిల్లాలో సుమారు 150 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. 30 వేల మంది డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు రాయాల్సి ఉంది. ఇప్పటివరకు డిగ్రీ పరీక్షల షెడ్యూల్ ప్రకటించలేదు. ప్రస్తుతం డిగ్రీ పరీక్షలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎప్పటి నుంచి మొదలవుతాయో తెలీని పరిస్థితి. బుధవారంతోదరఖాస్తు గడువు ముగియనుంది. ఈ దశలో డిగ్రీ పూర్తయిన వారు పీజీ లేదా బీఈడీ, ఎల్ఎల్బీ, ఎంసీఏ, ఎంబీఏ తదితర ఉన్నత చదువులు చదవాలని కోరుకుంటారు. ఈ నెల 19 నుంచి వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షలు మొదలుకానున్నాయి. 19న ఎడ్‌సెట్, లాసెట్ ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి మే 2న ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఖరారు కాని షెడ్యూల్.. ఎస్వీయూ పరిధిలోని బీఏ, బీకాం, బీఎస్సీ 6వ సెమిస్టర్ పరీక్షలకు దరఖాస్తులు స్వీకరిస్తున్న దశలో షెడ్యూల్ ప్రకటించలేదు. 25 నుంచి డిగ్రీ పరీక్షలు మొదలవుతాయని సమాచారం. డిగ్రీ పరీక్షల షెడ్యూల్ మధ్యలో ఐసెట్ ఉంటుంది. డిగ్రీ పరీక్షలు మొదలు కాక ముందే ఎడ్‌సెట్, లా సెట్ పరీక్షలు జరగనున్నాయి. దీంతో డిగ్రీ పరీక్షలకు సిద్ధం కావాలా? లేక ప్రవేశ పరీక్షలకు తయారుకావాలా అని తల పట్టుకుం టున్నారు. సాధారణంగా డిగ్రీ విద్యార్థులు చివరి సంవత్సర పరీక్షలు పూర్తయ్యాక పీజీ, బీఈడీ, ఎల్ఎల్బీ తదితర ఉన్నత కోర్సుల ప్రవేశ పరీక్షలు రాస్తారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారుల అత్యుత్సాహం వల్ల డిగ్రీ పరీక్షలు రాయకమునుపే ఉన్నత చదువుల ప్రవేశ పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఇలా నిర్వహించటం ఇదే మొదటిసారి అని విద్యారంగ నిపుణులు అంటున్నారు. ఒకే రోజు రెండు ప్రవేశ పరీక్షలు.. రాష్ట్రంలోని బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఎడ్‌సెట్ ఈ నెల 19న జరగనుంది. లా కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ లాసెట్ కూడా ఈనెల 19న నిర్వహిస్తారు. దీనివల్ల రెండు పరీక్షలకు హాజ రయ్యే వారికి ఇబ్బంది తప్పదు. దీనిపై ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కుమార స్వామి దృష్టికి తీసుకెళ్లగా ఎడ్‌సెట్ ఉదయం, లా సెట్ సాయంత్రం ఉంటాయన్నారు. విద్యార్థులు ఒక పూట ఒకటి, మరోటి మధ్యాహ్నం రాయవచ్చన్నారు. ఈ షెడ్యూల్ రెండు నెలల క్రిందటే ప్రకటించామన్నారు. ఇప్పటివరకు అభ్యంతరాలు రాలేదన్నారు. పీజీ ప్రవేశ ప్రకటనలు విడుదల.. జిల్లాలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, కుప్పంలోని ద్రవిడ విశ్వ విద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిíఫికేషన్లు విడుదలయ్యాయి. ఎస్వీయూలో నోటిఫికేషన్ జారీకి సన్నాహాలు సాగుతున్నాయి. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో పీజీ కోర్సులో చేరడానికి దరఖాస్తు తుది గడువు మే 5. మే 20 న ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ లోపు డిగ్రీ పరీక్షలు ముగిసే అవకాశం లేదు. ద్రవిడ యూనివర్సిటీలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి తుదిగడువు మే 31. ప్రవేశ పరీక్షలు జూన్ 6న నిర్వహిస్తారు. -
23 నుంచి డిగ్రీ పరీక్షలు
కర్నూలు (గాయత్రీ ఎస్టేట్): డిగ్రీ వార్షిక పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. రాయలసీమ విశ్వవిద్యాలయం అనుబంధంగా జిల్లాలోని 106 డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న 45,000 మంది విద్యార్థులు 61 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. 6వ సెమిస్టర్‌కు 13,000, 2వ సెమిస్టర్‌కు 17,000,4వ సెమిస్టర్‌కు 15,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు , మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు పూటల పరీక్షలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 19వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 1800 మంది ఇన్విజిలేటర్లు, 61 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 64 మంది కేంద్రాల పరిశీలకులు, మూడు స్క్వాడ్ బృందాలను నియమించినట్లు ఆర్యూ పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రస్తుతం మూడో విడత జంబ్లింగ్ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు కేంద్రాలకు వచ్చేందుకు ఇబ్బంది ఉన్న చోట బస్సులు ఏర్పాటు చేసుకోవాలని కళాశాలల యాజమాన్యాలకు సూచించామన్నారు. ఈ ఏడాది కొత్తగా కోసిగి ఏపీ మోడల్ స్కూల్లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. జంబ్లింగ్‌లో పారదర్శకత ఉండేనా జంబ్లింగ్‌లో పరీక్షల నిర్వహణ మంచిదే. అయితే పరీక్షలు రాసే విద్యార్థులను జంబ్లింగ్ చేయకుండా కళాశాలలను మాత్రమే మార్పులు చేర్పులు చేశారు. కళాశాలల యాజమాన్యాలు అనుకూలంగా ఉన్న చోట కాపీయింగ్ జరిగే అవకాశం ఉంది. అదే పోటీ తత్వం ఉంటే విద్యార్థులు ఇబ్బందులు పడే వీలుంది. కొన్ని మండలాల్లో ప్రైవేట్ కళాశాలలు మాత్రమే ఉండటంతో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం లేకపోలేదు. దీన్ని ఆర్యూ అధికారులు నివారించాల్సిన అవసరం ఉంది. -
చూచిరాత ఇ'లా'
న్యాయశాస్త్రం డిగ్రీ అంగట్లో సరుకులా మారింది. సెమిస్టర్ పరీక్షల్లో విద్యార్థులు యథేచ్ఛగా మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇందుకుగాను కళాశాల యాజమాన్యం విద్యార్థుల వద్ద నుంచి ప్రత్యేకంగా ఫీజులు కూడా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించా ల్సిన యూనివర్సిటీ అధికారులు ప్రైవేట్ కళాశాలకు దాసోహమనడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చూచిరాతల అవకాశం ఉండడంతోనే తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు న్యాయశాస్త్రం అభ్యసించేందుకు పుత్తూరును ఎంచుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పుత్తూరు: విశ్వసనీయ వర్గాల సమాచారం మండల పరిధిలోని ఒక ప్రైవేట్ లా డిగ్రీ కళాశాల విద్యార్థులు గత వారం రోజుల నుంచి మరో ప్రైవేట్ కళాశాలలో పరీక్షలు రాస్తున్నారు. యథేచ్ఛగా పుస్తకాలు ముందర పెట్టుకుని పక్కపక్కనే కూర్చొని పరీక్షలను రాస్తుండడం పట్ల తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఇందుకు పరీక్షా కేంద్రం యాజమాన్యం సహకరిస్తుండడం, యూనివర్సిటీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. చూచిరాతల కోసం లా విద్యార్థుల నుంచి కళాశాల యాజమాన్యం ఏడాదికి ప్రత్యేకంగా రూ.15 వేల నుంచి రూ.50 వేలు వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తంలో పరీక్షా కేంద్రం యాజమాన్యాలకు, యూనివర్సిటీ అధికారులకు వాటాలు ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు విద్యార్థుల క్యూ.. ప్రత్యేకించి పుత్తూరులో లా డిగ్రీ చదివేందుకు తమిళనాడుకు చెందిన వందలాది మంది విద్యార్థులు కొన్నేళ్లుగా క్యూ కడుతున్నారు. గతంలో తమిళ సినీ యాక్టర్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య కూడా పుత్తూరులోని ప్రైవేట్ లా కళాశాల విద్యార్థిగానే డిగ్రీ పరీక్షలకు హాజరుకావడం అప్పట్లో సంచలనమైంది. తమిళనాడులో లా డిగ్రీ పరీక్షలను పగడ్బందీగా నిర్వహిస్తుండడంతో చూచిరాతలకు అనుకూలంగా ఉన్న పుత్తూరును ఎంచుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం తదితర పట్టణాల నుంచే కాకుండా కేరళ నుంచి కూడా లా డిగ్రీ కోసం విద్యార్థులు పుత్తూరులోని ప్రైవేట్ కళాశాలను ఆశ్రయిస్తున్నారు. దీనిపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా పరీక్షల అబ్జర్వర్ అందుబాటులోకి రాలేదు. -
పరీక్షలకు దూరం..!
బేల(ఆదిలాబాద్) : దూరభారం డిగ్రీ విద్యార్థులకు పరీక్షగా మారింది. ఫలితంగా ఉన్నత విద్యను అర్ధంతరంగా ముగించాల్సిన దుస్థితి ఎదురవుతోంది. మారుమూల సరిహద్దు మండలం బేల. ఉన్నత విద్య కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని బేలకు వచ్చి ఇక్కడి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌కు వెళ్లాల్సి ఉంటుంది. స్థానిక ప్రముఖుల చొరవతో 2014–15లో మండల కేంద్రంలో ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు. గతంలో ఇంటర్ పూర్తి చేసి ఉన్నత విద్య అభ్యసించలేని వారు, రెగ్యులర్ విద్యార్థులు ఇక్కడే ప్రవేశాలు పొందుతున్నారు. ఇంగ్లిషు మీడియం అయినప్పటికీ సమీపంలో ఉండడంతో మరాఠీ, గిరిజన విద్యార్థులు ప్రవేశాలు తీసుకున్నారు. 220 మంది డిగ్రీ విద్య అభ్యసిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి రవాణా సౌకర్యాలు అంతగా లేకున్నా.. ఇబ్బందులను అధిగమించి వస్తున్నారు. పరీక్షల కోసం జిల్లా ఆదిలాబాద్‌లోని కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. గతేడాది నుంచి ప్రభుత్వం సెమిస్టర్ విద్యావిధానాన్ని ప్రవేశ పెట్టింది. దీంతో ఒక విద్యా సంవత్సరంలో కచ్చితంగా రెండు పరీక్షలు రాయడానికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి రోజు పరీక్ష ముగిసిన తర్వాత ఇంటికి రావడానికి ఎంతో సమయం పడుతోంది. గ్రామాల నుంచి విద్యార్థినులు పరీక్షలకు హాజరు కాలేక చదువును అర్ధంతరంగా మానేస్తున్నారు. 2015–16 విద్యాసంవత్సరంలో మొదటి సంవత్సరం పరీక్ష రాసిన వారి సంఖ్య 120 ఉండగా.. 2016–17లో 100కు తగ్గింది. ఈ విద్యా సంవత్సరంలో 58 పడిపోయింది. మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంఖ్య సైతం 100కు తగ్గింది. నిర్మల్ జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలకు అనుమతి.. మారుమూల మండల కేంద్రాల్లో ప్రైవేటు డిగ్రీ కళశాలలు ఉన్న చోట కాకతీయ యూనివర్సిటీ అధికారులు పరీక్ష కేంద్రాలకు స్థానికంగా అనుమతి ఇస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో నిర్మల్ జిల్లాలోని కల్లూర్‌లోని ప్రైవేటు డిగ్రీ కళశాలకు సమీప ప్రభుత్వ జెడ్పీఎస్‌ఎస్‌లో పరీక్ష కేంద్రానికి అనుమతి ఇచ్చారు. లక్ష్మణచాందలోని కళశాలకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళశాలలో పరీక్ష కేంద్రం అనుమతి లభించింది. పేద విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి యూనివర్సిటీ అధికారులు బేలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ పరీక్ష కేంద్రానికి అనుమతి ఇవ్వాలని విద్యార్థులు, పోషకులు కోరుతున్నారు. ఫస్ట్ సెమిస్టర్ రాయలేకపోయిన. మాది కూలీ కుటుంబం. మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఉన్నదని, ఇష్టపడి చదువుకుంటున్నాను. మా ఊరి నుంచి ఇక్కడి రావాలంటే ఎటువంటి వాహనాలు ఉండవు. చదువుకోవాలని ఆసక్తితో రెండు కిలోమీటర్లు కాలినడకన వస్తున్నాను. ఆదిలాబాద్‌కు వెళ్లి ఫస్ట్ సెమిస్టర్ రాయలేకపోయినా. ఇప్పుడు నా చదువు అర్ధంతరమేనో.– కైరి అశ్విని, బీఎస్సీ(బీజెడ్సీ) మొదటి సంవత్సరం, మోహబత్పూర్ నాన్నతో కలిసి పరీక్షలకు.. ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు రాయడానికి ప్రతి రోజు నాన్నతో కలిసి వెళ్లాను. నా స్నేహితులు వారి కుటుంబ సభ్యుల తోడు లేకపోవడంతో ఈ పరీక్షలు రాయడానికి రాలేదు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి మండలకేంద్రంలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తే డిగ్రీ పూర్తి చేసుకునే అవకాశం ఉంది.– మరప అశ్విని, బీకాం మొదటి సంవత్సరం, బెల్లూరిగూడ పరీక్ష కేంద్రం కోసం ప్రయత్నిస్తున్నాం పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని కళశాలకు సమీపంలో మండల కేంద్రంలో పరీక్ష కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. భాష, రవాణా, ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రస్తుతం సెమిస్టర్ విధానంతో రెండు సార్లు పరీక్షలు రాయడానికి జిల్లా కేంద్రానికి వెళ్లలేక విద్యార్థులు చదువు అర్ధంతరంగా మానేయడం బాధగా ఉంది. స్థానికంగా పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తే విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తి చేసుకునే అవకాశం ఉంది.– వరప్రసాద్‌రావు, కీర్తన డిగ్రీ కళశాల బేల -
పబ్లిగ్గా మాస్ కాపీయింగ్!
సాక్షి, విశాఖపట్నం: శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ నుంచి దూరవిద్యలో డిగ్రీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు పబ్లిగ్గా మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. పుస్తకాలు చూసి రాసుకునే సదుపాయాన్ని అక్కడ ఇన్విజిలేటర్లే కల్పిస్తున్నారు. ఇది బహిరంగంగానే జరుగుతున్నా ఏ ఒక్క అధికారీ అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ఐదు రోజుల కిత్రం ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విశాఖ జిల్లా కె.కోటపాడు టీఎస్సార్ జూనియర్ కాలేజీని సెంటరుగా కేటాయించారు. దాదాపు 400 మంది అభ్యర్థులు ఈ కేంద్రంలో పరీక్షలు రాస్తున్నారు. బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ గ్రూపులకు సంబంధించి ఫిజిక్స్, స్టాటస్టిక్స్, కామర్స్, ఎకనామిక్స్ తదితర పరీక్షలు జరుగుతున్నాయి. ఒక్కొక్క అభ్యర్థి రూ.20 వేలు చెల్లించే ఒప్పందంతో వారికి నేరుగా పుస్తకాల్లో చూసి పరీక్షలు రాసుకునే సదుపాయాన్ని కల్పించినట్టు తెలి సింది. ఒప్పందంలో భాగంగా ఆయా అభ్యర్థులు నిర్భీతిగా మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న వైనాన్ని కొంతమంది కెమెరాల్లో బంధించారు. వాటిని శనివారం రాత్రి మీడియాకు విడుదల చేశారు. సంబంధిత యూనివర్సిటీ నుం చి పరిశీలకులుగా ఇద్దరు అధికారులు వచ్చారు. వారు విశాఖలోని ఒక స్టార్ హోటల్లో బస చేసినట్టు చెబుతున్నారు. వారి కనుసన్నల్లోనే ఈ కాపీయింగ్ వ్యవహారమంతా జరుగుతోంది. మరో మూడు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మాస్‌కాపీయింగ్‌పై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ మాస్‌కాపీయింగ్‌పై శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రాజగోపాల్‌ను వివరణ కోరడానికి ఫోన్లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. -
విధి పరీక్షకు ఫలితం బలవన్మరణం
చోడవరం: భర్తచనిపోయినా తన రెక్కల కష్టం పై..పిల్లలు కష్టమెరగకుండా పెంచిన తల్లి ఆశలు అడియాసలయ్యాయి...అన్నదమ్ములు పెంచుకున్న అభిమానం ఆవిరైంది... విధి పెట్టిన పరీక్షలో ఆ కుటుం బం తమ గారాల పట్టిని కోల్పోయింది. ఎంతో చలా కీగా ఉంటూ, సరదాగా తిరిగే ఆ యువతి అనుకున్న లక్ష్యం మేరకు పరీక్షలు సరిగా రాయలేకపోయానన్న కారణంతో ఆత్మహత్య చేసుకుని, కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచేసింది. చెల్లెలు బలవన్మరణం చెందడంతో అన్నయ్యలిద్దరి గుండెలుపగిలేలా రోదించారు. వివరాలు ఇలా ఉన్నాయి. చోడవరం లక్ష్మీనగర్‌లో నివాసముంటున్న రుప్ప లక్ష్మీనర్సమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పిల్లలు చిన్నప్పుడే భర్త చనిపోవడంతో అన్నీ తానై నలుగురు పిల్లల్నీ పెంచింది. ఓ కుమార్తెకు వివాహం చేసింది. వివాహం జరిగిన కుమార్తె కూడా చోడవరంలోనే ఇదే వీధిలో నివాసం ఉంటోంది. చిన్నకూతురు హరిత (18) చోడవరంలో ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. కుమారుల్లో ఒకరు ఉద్యోగం, మరొకరు మోటారు ఫీల్డులో పనిచేస్తున్నారు. హరిత ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తోంది. ఒకటి తప్పా మిగతా పరీక్షలన్నీ ఇప్పటికే పూర్తయిపోయాయి. అయితే అనుకున్న లక్ష్యం మేర పరీక్షలు రాయలేకపోయానని మనస్తాపానికి గురైన హరిత, పక్కనే ఉన్న తన అక్క ఇంటికి సోమవా రం వెళ్లింది. పరీక్షల గురించి అక్క లీలావాణితో చెప్పి బాధపడింది. పర్వాలేదులే మంచి మార్కుల కోసం మళ్లీ రాద్దువుగాని అని సర్ది చెప్పి, తన పరీక్షల నిమిత్తం ఆమె శ్రీకాకుళం వెళ్లింది. అయినా బాధ నుంచి బయటపడని హరిత, అక్క ఇంటి దగ్గర ఎవరూ లేకపోవడాన్ని చూసి సోమవారం రాత్రి గదిలోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అక్క ఇంటికి వెళ్లిన కూతురు రాత్రయినా రాకపోయే సరికి చూసిరమ్మని తన పెద్ద మనుమరాలిని హరిత తల్లి పంపింది. ఇంటికి వెళ్లిచూడగా అప్పటికే గదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్న హరితను చూసి భయపడి మావయ్యలకు తెలిపింది. వారు వచ్చి వేలాడుతున్న చెల్లెలను కిందకు దించారు. అప్పటికే ఆమె మృతి చెందింది. మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం అందడంతో చోడవరం ఎస్ఐ మల్లేశ్వరరావు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అందరితో ఎంతో సరదాగా ఉండే హరిత మృతిచెందిందని తెలియడంతో తోటి విద్యార్థులు, స్థానికులు ఇక్కడుకు వచ్చారు. వారంతా శోకసంద్రంలో మునిగారు. -
యూనివర్సిటీలో తెలుగు తమ్ముళ్ల అక్రమాలు
-
రూ.200లకే చిట్స్.. మాస్ కాపీయింగ్
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజిపూర్లో డిగ్రీ మూడో సంవత్సర పరీక్షల్లో భారీ స్కాం బయటపడింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నుంచి రూ.200 కలెక్ట్ చేస్తున్న ఓ వ్యక్తి వారికి జవాబు పత్రాలు అందిస్తున్నాడు. ఈ స్కాంపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన మెయిల్ టుడే ఓ వీడియోను విడుదల చేసింది. ఘాజీపూర్‌లోని స్వామి సహజానంద పీజీ కళాశాలలో ఈ నెల 10వ తేదీన జరిగిన బీఏ మూడో సంవత్సర పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగింది. వెంట తెచ్చుకున్న చిట్స్, డబ్బులు ఇచ్చిన వ్యక్తి అందించిన పత్రాలతోనూ విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడ్డారు. ఈ కళాశాలలో మాస్‌కాపీయింగ్ కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నట్లు మెయిల్ టుడే పేర్కొంది. అయినా అధికారులు మొద్దు నిద్ర మానుకోవడం లేదని విమర్శించింది. ఏటా విద్యార్థుల నుంచి వసూలు చేసే డబ్బు మాత్రం పెరుగుతోందని చెప్పింది. పరీక్ష హాల్లో విద్యార్థుల వద్దకు వచ్చే బంట్రోతు డబ్బును కలెక్ట్ చేస్తాడని వివరించింది. మాస్ కాపీయింగ్‌పై ప్యూన్‌ను ప్రశ్నించేందుకు మెయిల్ టుడే ప్రయత్నించగా అతను తప్పించుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కాగా, కళాశాల పరిపాలన వ్యవస్ధలో పనిచేసే ఓ వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం.. కొద్ది సంవత్సరాల నుంచి డిగ్రీ పరీక్షల్లో ఇదే తంతు జరుగుతోంది. అలాగే కాపీయింగ్ చేయడానికి విద్యార్థులు ఇన్విజిలేటర్లకు డబ్బులు ఇవ్వడం కూడా ఆనవాయితీగా సాగుతోందని చెప్పారు. తాజా స్టింగ్ ఆపరేషన్ ఏళ్లుగా ఉత్తరప్రదేశ్‌లో ఉన్న విద్యా వ్యవస్ధ పరిస్ధితి ఇంకా మరలేదనడానికి నిదర్శనంగా మారింది. మాస్ కాపీయింగ్‌పై ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ మంత్రి దినేశ్ శర్మను ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నించగా ఆయన ఫోన్ ఆన్సర్ చేయలేదు. ఈ ఘటనపై మాట్లాడిన బీజేపీ అధికార ప్రతినిధి మనీష్ శుక్లా.. పాత ప్రభుత్వాలపై నిందను తోసేశారు. కూనారిల్లిన వ్యవస్ధను తాము ఇప్పుడిప్పుడే నిర్మిస్తున్నామని అన్నారు. కేవలం విద్యా వ్యవస్ధే కాకుండా మిగిలిన అన్ని వ్యవస్ధల్లోనూ త్వరలో మార్పు తీసుకువస్తామని చెప్పారు. -
నలుగురు విద్యార్థుల డీబార్
ఎస్కేయూ : వర్సిటీ పరిధిలోని నిర్వహిస్తున్న డిగ్రీ పరీక్షల్లో శనివారం నలుగురు విద్యార్థులు డీబార్ అయినట్లు పరీక్షల విభాగం జాయింట్ డైరెక్టర్ రామ్మూర్తి తెలిపారు. గుత్తిలోని ఎంఎస్ డిగ్రీ కళాశాలలో మాస్ కాపీయింగ్ పాల్పడుతుండగా చర్యలు తీసుకున్నామన్నారు. -
అక్ర ‘మార్కులు ’
- డిగ్రీ పరీక్షల్లో యథేచ్ఛగా అక్రమాలు - వాట్సాప్‌లో హల్చల్ చేసిన కామర్స్ ప్రశ్నపత్రం - ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి వాట్సాప్‌లో పంపిన ప్రైవేటు కళాశాల ప్రిన్సిపాల్! ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) డిగ్రీ పరీక్షల్లో యథేచ్ఛగా అక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు కళాశాలల నిర్వాహకులు తమ విద్యార్థులకు ఎక్కువ మార్కులు తెప్పించుకోవాలనే ఉద్దేశంతో అక్రమాలకు ఒడిగడుతున్నారు. ఈ క్రమంలో నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ ప్రశ్నపత్రం విధానాన్ని కూడా అభాసుపాలు చేస్తున్నారు. ప్రస్తుతం డిగ్రీ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఉదయం తొమ్మిది నుంచి 12 గంటల వరకు , మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రశ్నపత్రాలను ఆన్లైన్ ద్వారా పంపుతున్నారు. పరీక్షా సమయానికి గంట ముందు మాత్రమే ఎన్క్రిప్టెడ్ పాస్‌వర్డ్‌ను వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లకు చేరవేస్తారు. వారు ప్రశ్నపత్రాలు డౌన్లోడ్ చేసుకుని విద్యార్థులకు అందించాల్సి ఉంటుంది. మంగళవారం బీకాం ఫైనలియర్ సబ్జెక్టు అయిన ‘ఇంటర్నెట్ టెక్నాలజీస్, ఈ కామర్స్ ’ పరీక్ష జరిగింది. ఉదయం ఎనిమిదికి ఎన్క్రిప్టెడ్ పాస్‌వర్డ్‌ను ఎస్కేయూ అధికారులు కళాశాలలకు పంపించారు. అయితే.. 8.30 గంటలకల్లా ప్రశ్నపత్రం వాట్సాప్‌లో హల్చల్ చేసింది. అనంతపురం నగరంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి వాట్సాప్‌లో పంపారన్న ఆరోపణలు వస్తున్నాయి. జంబ్లింగ్ విధానం కావడంతో ఒక కళాశాల విద్యార్థులను రెండు లేదా మూడు కళాశాలల్లోని పరీక్షా కేంద్రాలకు కేటాయించారు. దీంతో ప్రశ్నపత్రాన్ని ముందే తమ కళాశాలకు సంబంధించిన వ్యక్తులకు పంపి..వారి ద్వారా తమ విద్యార్థులకు జవాబు స్లిప్పులు అందజేయడానికి వీలుగా వాట్సాప్‌లో పంపినట్లు తెలుస్తోంది. వాటర్‌మార్క్ ద్వారా గుట్టు రట్టయ్యే అవకాశం ఆన్లైన్ ప్రశ్నపత్రాన్ని ఎక్కడి నుంచి లీక్ చేశారన్న విషయాన్ని పసిగట్టేందుకు తమ వద్ద విభిన్న పద్ధతులు ఉన్నాయని రెండు నెలల కిందట ప్రిన్సిపాళ్లకు ఇచ్చిన శిక్షణలో అధికారులు హెచ్చరించారు. ఏ పరీక్షా కేంద్రం నుంచి లీక్ చేశారన్న అంశాన్ని పసిగట్టేందుకు వాటర్‌మార్క్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం కామర్స్ ప్రశ్నపత్రం ఎక్కడి నుంచి బయటకు వచ్చిందో వాటర్‌మార్క్‌ను పరిశీలిస్తే తెలిసే అవకాశముంది. పేపర్ లీక్ కాలేదు ప్రశ్నపత్రం గంట ముందే ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ విధానం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉదయం 8.31 గంటలకు వాట్సాప్ ద్వారా బయటకు వచ్చినట్లు స్పష్టమైంది. అప్పటికే విద్యార్థులందరూ పరీక్షా కేంద్రాల్లోకి చేరుకున్నారు. దీంతో పేపర్ లీక్ అయినట్లు భావించకూడదు. ఈ సంఘటనలో ఎస్కేయూ అధికారుల తప్పిదం లేదు. ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారిపై చర్యలు తీసుకుంటాం. – ఆచార్య రెడ్డి వెంకటరాజు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్, ఎస్కేయూ