పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్థుల మృతి | students died in tractor-bike collisioned incident during degree exams | Sakshi
Sakshi News home page

పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్థుల మృతి

Published Wed, Mar 16 2016 7:31 AM | Last Updated on Fri, Nov 9 2018 4:12 PM

students died in tractor-bike collisioned incident during degree exams

అవుకు: కర్నూలు జిల్లా సంజామల మండలం శింగనపల్లి వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు డిగ్రీ విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. అవుకుకు చెందిన వెంకటరాజు, పెదరాయుడు, మధు అనే డిగ్రీ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు పరీక్షలు రాసేందుకు కోయిలకుంట్లకు బైక్‌పై వెళుతుండగా వేగంగా వస్తున్న ట్రాక్టర్ వీరు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టింది. ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

ఈ సంఘటనలో వెంకటరాజు, పెద్దరాయుడు అక్కడికక్కడే మృతిచెందారు. మధు తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని చికిత్స నిమిత్తం వెంటనే కోయిలకుంట్ల ఆస్పత్రికి తరలించగా అక్కడే ప్రాణాలొదిలాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అవుకు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ను గుర్తించారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement