tractor-bike collisioned
-
ట్రాక్టర్, బైక్ ఢీ.. ఇద్దరి మృతి
దుమ్ముగూడెం: ట్రాక్టర్ - బైక్ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెంజిల్లా దుమ్ముగూడెం మండలం రేగుబల్లి వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. మృతులు చర్ల మండలం ఆర్.కొత్తగూడెనికి చెందిన సాగి రంగరాజు(53), ఆయన భార్య సుగుణ(47) అక్కడికక్కడే మృతిచెందారు. వీరు స్వగ్రామం నుంచి బైక్పై భద్రాచలం వైపు వెళ్తుండగా ట్రాక్టర్ వీరి వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
బైక్ ను ఢీకొన్న ట్రాక్టర్: వ్యక్తి మృతి
కోవూరు: నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు వద్ద ఉన్న ఏషియన్ పెయింట్ షాపు వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఇరిగేషన్ కాలువ పనుల్లో జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీనివాస్(30) అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. దాంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు నెల్లూరు జిల్లా కోట గ్రామానికి చెందినవాడు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. -
పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్థుల మృతి
అవుకు: కర్నూలు జిల్లా సంజామల మండలం శింగనపల్లి వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు డిగ్రీ విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. అవుకుకు చెందిన వెంకటరాజు, పెదరాయుడు, మధు అనే డిగ్రీ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు పరీక్షలు రాసేందుకు కోయిలకుంట్లకు బైక్పై వెళుతుండగా వేగంగా వస్తున్న ట్రాక్టర్ వీరు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టింది. ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటనలో వెంకటరాజు, పెద్దరాయుడు అక్కడికక్కడే మృతిచెందారు. మధు తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని చికిత్స నిమిత్తం వెంటనే కోయిలకుంట్ల ఆస్పత్రికి తరలించగా అక్కడే ప్రాణాలొదిలాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అవుకు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ను గుర్తించారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.