ట్రాక్టర్‌, బైక్‌ ఢీ.. ఇద్దరి మృతి | two died in a road accident in bhadradri kothagudem district | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌, బైక్‌ ఢీ.. ఇద్దరి మృతి

Published Wed, Jan 11 2017 9:53 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

two died in a road accident in bhadradri kothagudem district

దుమ్ముగూడెం: ట్రాక్టర్ - బైక్ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెంజిల్లా దుమ్ముగూడెం మండలం రేగుబల్లి వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. మృతులు చర్ల మండలం ఆర్‌.కొత్తగూడెనికి చెందిన సాగి రంగరాజు(53), ఆయన భార్య సుగుణ(47) అక్కడికక్కడే మృతిచెందారు.

వీరు స్వగ్రామం నుంచి బైక్‌పై భద్రాచలం వైపు వెళ్తుండగా ట్రాక్టర్ వీరి వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement