ఓయూ డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదే | Osmania University Degree Semester Exam Time Table | Sakshi
Sakshi News home page

ఓయూ డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదే

Published Tue, Feb 15 2022 1:15 PM | Last Updated on Tue, Feb 15 2022 3:01 PM

Osmania University Degree Semester Exam Time Table - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 26 నుంచి వివిధ డిగ్రీ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభమవుతాయని సోమవారం కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ శ్రీనగేష్‌ తెలిపారు. ఈ నెల 26న డిగ్రీ  ద్వితీయ, తృతీయ సంవత్సరాల రెగ్యులర్‌  కోర్సుల 3, 5 సెమిస్టర్‌ పరీక్షలు, 28న డిగ్రీ మొదటి సంవత్సరం ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. (క్లిక్‌: త్వరలోనే విద్యుత్‌ సంస్థల్లో ఏఈ పోస్టుల భర్తీ)

కోవిడ్‌ కారణంగా గతంలో 2 గంటల వరకు కుదించిన సమయాన్ని ఇక నుంచి డిగ్రీతో పాటు ఇతర కోర్సులకు సైతం పాత సమయాన్ని 3 గంటల వరకు పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. ఓయూలో పరీక్షల వాయిదా పడ్డాయంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని విద్యార్థులకు సూచించారు. త్వరలో డిగ్రీ పరీక్షల టైం టేబుల్‌ను ఉస్మానియా వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన చెప్పారు. (క్లిక్‌: 25 నుంచి నుమాయిష్‌ పునఃప్రారంభం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement