ఓయూ పరిధిలో 19  నుంచి డిగ్రీ పరీక్షలు | Degree Exams Will Start From 19th Of November | Sakshi
Sakshi News home page

ఓయూ పరిధిలో 19  నుంచి డిగ్రీ పరీక్షలు

Published Wed, Nov 6 2019 4:34 AM | Last Updated on Wed, Nov 6 2019 4:34 AM

Degree Exams Will Start From 19th Of November - Sakshi

ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా వర్సిటీ పరిధిలో ఈనెల 19 నుంచి డిగ్రీ (రెగ్యులర్‌ కోర్సులు) విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు కంట్రోలర్‌ ప్రొ.శ్రీరామ్‌ వెంకటేశ్‌ మంగళవారం వెల్లడించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం 1, 3, 5 సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ముగిసినట్లు చెప్పారు.

వాయిదా పడిన పరీక్షలు వచ్చే నెలలో.. 
ఆర్టీసీ కార్మికుల సమ్మె, బంద్‌ కారణంగా అక్టోబర్‌ 17, 18, 19 తేదీల్లో జరగాల్సిన వివిధ డిగ్రీ కోర్సుల బ్యాక్‌లాగ్‌ పరీక్షలు (పాత బ్యాచ్‌) వచ్చే నెల నిర్వహించనున్నట్లు కంట్రోలర్‌ తెలిపారు. సెలవు దినాలైన డిసెంబర్‌ రెండో శనివారం, ఆదివారం ఈ పరీక్షలు ఉంటాయని సూచనప్రాయంగా చెప్పారు. పూర్తి వివరాలకు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్‌సైట్‌ చూడాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement