నాయకత్వాభివృద్ధికి హార్వర్డ్‌ కిటుకులు! | TS BC Gurukul Students New Training Programs | Sakshi
Sakshi News home page

నాయకత్వాభివృద్ధికి హార్వర్డ్‌ కిటుకులు!

Published Tue, Jan 10 2023 4:53 AM | Last Updated on Tue, Jan 10 2023 9:56 AM

TS BC Gurukul Students New Training Programs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థులు ఎక్కువగా పాఠ్యాంశాల అభ్యసనకే పరిమితమవుతుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిజ జీవితంలో, వృత్తి పరమైన అంశాల్లో ఎదుగుదలకు సబ్జెక్టు ఉంటేనే సరిపోదు. నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటేనే పోటీ ప్రపంచంలో నెగ్గుకువచ్చే అవకాశాలుంటాయి. ఈ ఉద్దేశంతోనే మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), బీసీ సంక్షేమ శాఖలు ఆ దిశగా సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చాయి.

‘2023 ప్రోగ్రామ్‌ ఫర్‌ సైంటిఫికల్లీ ఇన్‌స్పైర్డ్‌ లీడర్‌షిప్‌ (పీఎస్‌ఐఎల్‌)’ పేరిట గురుకుల విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాల పెంపుదల కోసం అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం, ది లక్ష్మీ మిట్టల్‌ అండ్‌ ఫ్యామిలీ సౌత్‌ ఏషియా ఇన్‌స్టిట్యూట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంతో బీసీ గురుకుల సొసైటీ అవగాహన కుదుర్చుకుంది. ఇందులో భాగంగా వారం రోజుల పాటు ప్రత్యేక అవగాహన, శిక్షణా కార్యక్రమాలను ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌ కాలేజీ ప్రాంగణంలో నిర్వహిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా 108 మంది బీసీ గురుకుల సొసైటీ విద్యార్థులు, బీసీ హాస్టల్‌ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. హార్వర్డ్‌ వర్సిటీ నుంచి ప్రత్యేకంగా ఐదుగురు ఇన్‌స్ట్రక్టర్లు, ఓయూ నుంచి ఐదుగురు ఇన్‌స్ట్రక్టర్‌ ఫెలోస్‌ విద్యార్థులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. అవగాహన కుదుర్చుకున్న మూడు సంస్థల ప్రతినిధులతో పాటు బీసీ గురుకుల సొసైటీ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. 

వివిధ అంశాలపై చర్చా కార్యక్రమాలు..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ గురుకుల పాఠశాలలు, బీసీ సంక్షేమ హాస్టళ్లలోని ఎనిమిదో తరగతి, ఆపై తరగతుల్లో చదువుతున్న విద్యార్థుల్లో చురుకైన 108 మందిని బీసీ గురుకుల సొసైటీ గుర్తించి ఎంపిక చేసింది. ఇందుకోసం అంతర్గతంగా ప్రత్యేక పరీక్షను నిర్వహించింది. తొలిదశలో ఇలా ఎంపికైన విద్యార్థులకే ప్రత్యేక అవగాహన, శిక్షణా కార్యక్ర­మాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సైంటిఫిక్‌ రేసిజం, ది ఆర్ట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్, ఇఫ్‌ స్టార్ట్స్‌ విత్‌ అన్‌ అబ్జర్వేషన్, ది ఎసెన్షియల్స్‌ ఆఫ్‌ ఎంటర్‌ప్రెన్యూర్, సినిమా అండ్‌ సోషల్‌ చేంజ్‌ అంశాలపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అదేవిధంగా వా లీబాల్, రగ్బీ వంటి క్రీడలతో పా­టు నృత్యం, ఆ త్మరక్షణ, కరాటేపై కూడా సామూí­ßæ క చర్చలు జరిపి స్తున్నారు. శిక్షణా నంతరం సంబంధిత ఇన్‌స్ట్రక్టర్లు, ఇన్‌స్ట్రక్టర్‌ ఫెలోస్‌తో నిరంతర అనుసంధాన వ్యవస్థను సొసైటీ ఏర్పాటు చేయ­నుంది. ఇలా శిక్షణ పొందిన గురుకుల విదార్థులను జిల్లాల వారీగా విభజించి గురుకుల పాఠశాలల్లోని పిల్లలకు రిసోర్స్‌ పర్సన్లుగా వ్యవహరిస్తూ వాటిల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహింపజేయనున్నారు. మొత్తంగా ప్రతి గురుకుల విద్యార్థిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించేందుకు బీసీ సంక్షేమ శాఖ, బీసీ గురుకుల సొసైటీ ముందుకు సాగుతున్నాయి.

ఆలకించడం, భావ వ్యక్తీకరణ కీలకం
ఇతరులు చెప్పే విషయాల్ని ముందుగా శ్రద్ధగా వినాలి. ఆ తర్వాత మనం చెప్ప దలచుకున్న విషయాన్ని ఎలాంటి భయం లేకుండా స్పష్టంగా తెలియజేయాలి. ఈ నైపుణ్యాన్ని క్రమంగా మెరుగుపరుచుకుంటే ఎక్కడైనా, ఎలాంటి వారితోనైనా ధైర్యంగా మాట్లాడగలననే నమ్మకం కుదిరింది. 
– సాయికిరణ్, బీసీ గురుకుల పాఠశాల, జైనథ్, ఆదిలాబాద్‌ జిల్లా

ఆత్మవిశ్వాసం పెరుగుతోంది..
స్టేజీపైన మాట్లాడాలంటే ఎంతో ఆందోళన చెందేదా న్ని. ఈ ప్రత్యేక కార్యక్రమంతో నాలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ఇతరులతో మాట్లాడే విధానం, బాడీ లాంగ్వేజీ, భాషపై పట్టు పెంచుకోవడంలో మెళకువలెన్నో నేర్చుకుంటున్నా.
– సంఘవి, బీసీ గురుకులం, రామచంద్రాపురం, సంగారెడ్డి జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement