రేపటి నుంచి డిగ్రీ పరీక్షలు | degree exams starts to day | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి డిగ్రీ పరీక్షలు

Published Wed, Mar 26 2014 4:41 AM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM

degree exams starts to day

ఎంజీయూ(నల్లగొండ రూరల్), న్యూస్‌లైన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పరిధిలో డిగ్రీ పరీక్షలను గురువారం నుంచి ప్రథమ, తృతీయ, ఈ నెల 28 నుంచి ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
 
 ఈ పరీక్షలకు యూనివర్సిటీలో పరిధిలోని  65,335 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇప్పటికే యూనివర్సిటీ హాల్‌టికెట్‌లను జారీ చేసింది. జిల్లాలో 63 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4 ఫ్లయింగ్ స్వ్కాడ్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి తృతీయ, సాయంత్రం 2 గంటల నుంచి 5 గంటల వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు.
 
 కేంద్రాలు ఇవి..
 జిల్లాలో సూర్యాపేటలో 10, నల్లగొండ- 9, కోదాడ, భువనగిరి-5 కేంద్రాల చొప్పున నకిరేకల్- 4, చౌటుప్పల్ -3, హుజుర్‌నగర్, హాలియా, దేవరకొండ, మల్లేపల్లి, వలిగొండ, రామన్నపేట, మోత్కూరు, తిరుమలగిరి ప్రాంతాల్లో 2 కేంద్రాల చొప్పున, నూతనకల్, సాగర్, కొండమల్లేపల్లి, చండూరు, తుంగతుర్తి ప్రాంతాల్లో ఒక్కో పరీక్ష కేంద్రం చొప్పున  ఏర్పాటు చేసినట్లు నియంత్రణ అధికారి నరేందర్‌రెడ్డి తెలిపారు. ఆయా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
 
 3
 ప్రేమ పెళ్లికి నిరాకరించారని..
 
 డిండి, న్యూస్‌లైన్: ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు వారి పాలిట యముడయ్యాడు. తాను ప్రేమిం చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పగా అందుకు నిరాకరించిన పాపానికి కన్నవారని చూడకుండా దారుణంగా హత్య చేశాడు. తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో మద్యం మ త్తులో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటన సోమవారం రాత్రి డిండి మండల పరిధిలో చోటు చేసుకుంది.
 
 పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వీరబోయినపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నగారదు బ్బ తండాకు చెందిన కరంటోత్ బద్య(45), లచ్చి(40) దంపతులు వ్యవసాయం చేసుకుం టూ జీవనం సాగిస్తున్నారు. వీరికి రాజు(20) ఒక్కగానొక్క కుమారుడు. రాజు మూడేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లా డు. సింగరేణి కాలనీలో నివాసం ఉంటూ ఆటో నడుపుకుంటూ చిల్లర దొంగతనాలకు పాల్పడుతుండేవాడు. నెలలో ఒకటి రెండు సార్లు తల్లిదండ్రుల వద్దకు వచ్చి వెళ్తుండేవాడు. కాగా తా ను ఓ అమ్మాయిని ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పడంతో అందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. ఈ విషయమై రెండు నెలలుగా తరుచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. రాజు సోమవారం రాత్రి పీకలదాకా మద్యం తాగాడు. తాను ప్రేమించిన యువతి తో పెళ్లి వద్దన్న విషయాన్ని మనసులో పెట్టుకుని ఇంటి ముందర మంచంపై నిద్రిస్తున్న తల్లిదండ్రులను గొడ్డలితో మోదాడు.
 
 తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా.. కొన ఊపిరితో ఉన్న తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచింది. గ్రామస్తులు రాజును పట్టుకొని దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఆస్పత్రికి తరలించినట్లు సీఐ వెంకటయ్య, ఎస్‌ఐ నర్సింహులు తెలిపారు. గ్రామస్తుల చేతిలో గాయపడిన రాజును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
    
 మృతురాలు గర్భిణి
 రాజు చేతిలో హత్యకు గురైన అతని తల్లి లచ్చి నిండు చూలాలని గ్రామస్తులు, మృతురాలి బం ధువులు తెలిపారు. మరో రెండు రోజుల్లో కాన్పయ్యేదని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని వారు వాపోయారు.  
 
 సంఘటన స్థలాన్ని సందర్శించిన డీఎస్పీ
 సంఘటన స్థలాన్ని డీ ఎస్పీ మనోహర్ మంగళవారం సందర్శించారు. గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement