Mahathma Gandhi university
-
రాజకీయ జోక్యానికి చెక్!
తెలంగాణ యూనివర్సిటీలో గతంలో చేపట్టిన నియామకాలకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం లేకపోయినా ఓ వీసీ తెల్లవారితే తన పదవీ కాలం ముగుస్తుండటంతో రాత్రికి రాత్రే నియామక ఉత్తర్వులు ఇచ్చేశారు. మహత్మాగాంధీ యూనివర్సిటీలో ఒకే రోజు 200 మందికి ఇంటర్వూ్యలు నిర్వహించి పోస్టింగ్‌లు ఇచ్చేశారు. కాకతీయ యూనివర్సిటీలో చేపట్టిన అధ్యాపకుల నియామకాల్లో తమకు కావాల్సిన ఇద్దరి కోసం రోస్టర్ విధానాన్నే మార్చేశారు. దీంతో 37 మంది అధ్యాపకుల నియామకాలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇలా రాజకీయ ఒత్తిళ్లు, ఆశ్రిత పక్షపాతం, అమ్యామ్యాల బాగోతంలో యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకాలు అభాసుపాలయ్యాయి. ఇంటర్వూ్యల్లో నూ తమకు కావాల్సిన వారికి ఇష్టారాజ్యంగా మార్కు లు వేసుకొని ఎంపిక చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో యూనివర్సిటీల్లో నియామకాలంటేనే నమ్మకం లేని పరిస్థితి ఏర్పడింది. అందుకే రాజకీయ జోక్యం, వీసీల ఇష్టారాజ్యానికి చెక్ పెట్టే కసరత్తు మొదలైంది. స్క్రీనింగ్ టెస్టుతో పారదర్శకత.. అధ్యాపకుల నియామకాల్లో గతంలో దరఖాస్తులను ఆహ్వానించి, దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వూ్యలు మాత్రమే నిర్వహించి పోస్టులకు ఎంపిక చేశారు. కానీ ఇకపై ఆ విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా మార్పు చేయనుంది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ యూనివర్సిటీల అధ్యాపకుల నియామకాల్లో స్క్రీనింగ్ టెస్టు నిర్వహించేలా నిబంధనల రూపకల్పనపై దృష్టి పెట్టింది. అంతేకాదు పోస్టులు పదుల సంఖ్యలో ఉండటం, అభ్యర్థులు వేల సంఖ్యలో ఉండటం వల్ల అంతమందికి నెలల తరబడి ఇంటర్వూ్యలు చేయాల్సి వస్తోంది. దాంతో ఇంటర్వూ్య బోర్డు ఉండే వారిని ప్రభావితం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్టు పెడితే కనుక ఆ సమస్యలన్నీ తొలగిపోతాయని అధికారులు భావిస్తున్నారు. స్క్రీనింగ్ టెస్టును కూడా యూనివర్సిటీలు నిర్వహించకుండా టీఎస్పీఎస్సీ లేదా మరేదైనా థర్డ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించేలా కసరత్తు జరుగుతోంది. అందులో అర్హత సాధించిన వారిలో, పోస్టుల సంఖ్యను బట్టి ఒక్కో పోస్టుకు ముగ్గురిని ఇంటర్వూ్యకు ఎంపిక చేసి ఆ ముగ్గురికే ఇంటర్వూ్యలు నిర్వహిస్తే సమయం వృథా కాకపోవడమే కాకుండా, ప్రతిభావంతులే పోస్టులకు ఎంపిక అయ్యేలా చూడొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అప్పుడు దరఖాస్తు చేసుకున్న అందరికీ ఇంటర్వూ్యలు నిర్వహించే అవసరం ఉండదు. మరోవైపు ఇంటర్వూ్యల్లోనూ కనీస, గరిష్ట మార్కుల విధానం తెస్తే ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వవర్గాలు భావిస్తున్నాయి. ఇంటర్వూ్య బోర్డులో ఉన్న వారు ఇష్టారాజ్యంగా మార్కులు వేయకుండా, ఆశ్రిత పక్షపాతం చూపకుండా కట్టడి చేయవచ్చని పేర్కొంటున్నాయి. ఉన్నత స్థాయి కమిటీ ఆమోదించాకే.. అధ్యాపక నియామకాల్లో తమ అనుయాయుల కోసం నోటిఫికేషన్లోనే రోస్టర్ విధానాన్ని మార్చేసిన సందర్భాలు ఉండటంతో రోస్టర్ కమ్ రిజర్వేషన్ విధానాన్ని క్రాస్ చేసేలా చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం విద్యా శాఖ కార్యదర్శి, కళాశాల విద్యా కమిషనర్, ఉన్నత విద్యా మండలి చైర్మన్, నిఫుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. యూనివర్సిటీ సిద్ధం చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలు, రోస్టర్‌ను ఆ కమిటీ క్రాస్ చేసి, ఓకే చెప్పాకే జారీ చేసేలా నిబంధనలు తీసుకువచ్చేందుకు సిద్ధం అవుతోంది. వీసీల నియామకం తర్వాత.. రాష్ట్రంలోని 11 వర్సిటీల్లో మంజూరైన పోస్టులు 2,738 ఉండగా, అందులో 1,528 పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. అందులో 323 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా 687 అసోసియేట్ ప్రొఫెసర్, 518 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న మొత్తం 1,528 పోస్టుల్లోనూ తొలి విడతలో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీసీల నియామకం కాగానే నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తోంది. దీంతో నిబంధనల రూపకల్ప నపై దృష్టి సారించింది. అందులో స్క్రీనింగ్ టెస్టుతో పాటు ఇతర సంస్కరణలను అమలు చేయాలని భావిస్తోంది. -
తెలంగాణ పీఈ సెట్ వాయిదా
హైదరాబాద్: వ్యాయామ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న పీఈ సెట్ వాయిదా పడింది. ఈనెల 29 నుంచి జరగాల్సిన శారీరక దారుఢ్య పరీక్షలు జూన్ 5 నుంచి నిర్వహించనున్నట్లు పీఈసెట్ కన్వీనర్ ప్రకటించారు. దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 22 వరకు పొడిగించినట్లు, ఆలస్య రుసుముతో జూన్ 1 వరకు సమర్పించవచ్చునని తెలిపారు. ఇప్పటివరకు బీపెడ్ కోసం 3,180, డీపెడ్ కోసం 2,995 దరఖాస్తులు రాగా అందులో పురుషులు 4,698 మంది, మహిళలు 1,476 మంది ఉన్నారు. ఈనెల 25 నుంచి హాల్ టిక్కెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఈ సారి (2017-18) పీఈసెట్ ను మహాత్మగాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. -
రేపటి నుంచి డిగ్రీ పరీక్షలు
ఎంజీయూ(నల్లగొండ రూరల్), న్యూస్‌లైన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పరిధిలో డిగ్రీ పరీక్షలను గురువారం నుంచి ప్రథమ, తృతీయ, ఈ నెల 28 నుంచి ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షలకు యూనివర్సిటీలో పరిధిలోని 65,335 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇప్పటికే యూనివర్సిటీ హాల్‌టికెట్లను జారీ చేసింది. జిల్లాలో 63 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4 ఫ్లయింగ్ స్వ్కాడ్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి తృతీయ, సాయంత్రం 2 గంటల నుంచి 5 గంటల వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. కేంద్రాలు ఇవి.. జిల్లాలో సూర్యాపేటలో 10, నల్లగొండ- 9, కోదాడ, భువనగిరి-5 కేంద్రాల చొప్పున నకిరేకల్- 4, చౌటుప్పల్ -3, హుజుర్నగర్, హాలియా, దేవరకొండ, మల్లేపల్లి, వలిగొండ, రామన్నపేట, మోత్కూరు, తిరుమలగిరి ప్రాంతాల్లో 2 కేంద్రాల చొప్పున, నూతనకల్, సాగర్, కొండమల్లేపల్లి, చండూరు, తుంగతుర్తి ప్రాంతాల్లో ఒక్కో పరీక్ష కేంద్రం చొప్పున ఏర్పాటు చేసినట్లు నియంత్రణ అధికారి నరేందర్‌రెడ్డి తెలిపారు. ఆయా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. 3 ప్రేమ పెళ్లికి నిరాకరించారని.. డిండి, న్యూస్‌లైన్: ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు వారి పాలిట యముడయ్యాడు. తాను ప్రేమిం చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పగా అందుకు నిరాకరించిన పాపానికి కన్నవారని చూడకుండా దారుణంగా హత్య చేశాడు. తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో మద్యం మ త్తులో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటన సోమవారం రాత్రి డిండి మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వీరబోయినపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నగారదు బ్బ తండాకు చెందిన కరంటోత్ బద్య(45), లచ్చి(40) దంపతులు వ్యవసాయం చేసుకుం టూ జీవనం సాగిస్తున్నారు. వీరికి రాజు(20) ఒక్కగానొక్క కుమారుడు. రాజు మూడేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లా డు. సింగరేణి కాలనీలో నివాసం ఉంటూ ఆటో నడుపుకుంటూ చిల్లర దొంగతనాలకు పాల్పడుతుండేవాడు. నెలలో ఒకటి రెండు సార్లు తల్లిదండ్రుల వద్దకు వచ్చి వెళ్తుండేవాడు. కాగా తా ను ఓ అమ్మాయిని ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పడంతో అందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. ఈ విషయమై రెండు నెలలుగా తరుచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. రాజు సోమవారం రాత్రి పీకలదాకా మద్యం తాగాడు. తాను ప్రేమించిన యువతి తో పెళ్లి వద్దన్న విషయాన్ని మనసులో పెట్టుకుని ఇంటి ముందర మంచంపై నిద్రిస్తున్న తల్లిదండ్రులను గొడ్డలితో మోదాడు. తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా.. కొన ఊపిరితో ఉన్న తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచింది. గ్రామస్తులు రాజును పట్టుకొని దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఆస్పత్రికి తరలించినట్లు సీఐ వెంకటయ్య, ఎస్ఐ నర్సింహులు తెలిపారు. గ్రామస్తుల చేతిలో గాయపడిన రాజును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలు గర్భిణి రాజు చేతిలో హత్యకు గురైన అతని తల్లి లచ్చి నిండు చూలాలని గ్రామస్తులు, మృతురాలి బం ధువులు తెలిపారు. మరో రెండు రోజుల్లో కాన్పయ్యేదని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని వారు వాపోయారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన డీఎస్పీ సంఘటన స్థలాన్ని డీ ఎస్పీ మనోహర్ మంగళవారం సందర్శించారు. గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.