తెలంగాణ పీఈ సెట్‌ వాయిదా | TS PE set postponed | Sakshi
Sakshi News home page

తెలంగాణ పీఈ సెట్‌ వాయిదా

Published Mon, May 15 2017 5:56 PM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM

తెలంగాణ పీఈ సెట్‌ వాయిదా

తెలంగాణ పీఈ సెట్‌ వాయిదా

హైదరాబాద్‌: వ్యాయామ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న పీఈ సెట్‌ వాయిదా పడింది. ఈనెల 29 నుంచి జరగాల్సిన శారీరక దారుఢ్య పరీక్షలు జూన్‌ 5 నుంచి నిర్వహించనున్నట్లు పీఈసెట్ కన్వీనర్‌ ప్రకటించారు. దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 22 వరకు పొడిగించినట్లు, ఆలస్య రుసుముతో జూన్‌ 1 వరకు సమర్పించవచ్చునని తెలిపారు.

ఇప్పటివరకు బీపెడ్‌ కోసం 3,180, డీపెడ్‌ కోసం 2,995 దరఖాస్తులు రాగా అందులో పురుషులు 4,698 మంది, మహిళలు 1,476 మంది ఉన్నారు. ఈనెల 25 నుంచి హాల్‌ టిక్కెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఈ సారి (2017-18) పీఈసెట్ ను మహాత్మగాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement