
సాక్షి, హైదరాబాద్: డా. బీ. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ పరీక్షల తేదీలను బుధవారం ప్రకటించింది. డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 7 నుంచి 13 వరకు, ఐదో సెమిస్టర్ పరీక్షలను అక్టోబర్ 11 నుంచి 16 వరకు, ఆరో సెమిస్టర్ పరీక్షలను అక్టోబర్ 5 నుంచి 10 తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా డిగ్రీ (ఓల్డ్ బ్యాచ్) మూడో సంవత్సరం పరీక్షలను అక్టోబర్ 18 నుంచి 23 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు, మొదటి సంవత్సరం పరీక్షలు నవంబర్ 4 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. డిగ్రీ పరీక్షలను మధ్యాహ్నం 2.00 నుంచి 5.00 వరకు నిర్వహించనున్నారు.
పరీక్షకు హాజరు అయ్యే విద్యార్థులు, పరీక్ష తేదీకి రెండు రోజుల ముందే విశ్వవిద్యాలయ వెబ్ పోర్టల్ www.braouonline.in లో హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు వారి సంబంధిత ఆధ్యయన కేంద్రం లేదా విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.braou.ac.in ను సందర్శించ వచ్చని, మరింత సమచారం కోసం విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ 7382929570/580/590/600 ఫోన్ నెంబర్లకు సంప్రదించ వచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment