ఎస్కేయూ : వర్సిటీ అనుబంధ డిగ్రీ పరీక్షల్లో 16 మంది విద్యార్థులు డీబార్ అయినట్లు ఎవాల్యుయేషన్స్ జాయింట్ డైరెక్టర్ రామ్మూర్తి తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల(మడకశిర)లో నలుగురు విద్యార్థులు, ఎస్ఆర్ డిగ్రీ కళాశాల (పామిడి)లో ముగ్గురు , శ్రీసాయి డిగ్రీ కళాశాల (గుత్తి)లో ముగ్గురు, ఎంఎస్ డిగ్రీ కళాశాల నలుగురు, విద్యార్థులు , ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పెనుకొండ)లో ఇద్దరు విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతూ బుక్ అయ్యారు.