anms
-
మొదటికొచ్చిన ఏఎన్ఎంల పంచాయితీ
సాక్షి, హైదరాబాద్/సుల్తాన్ బజార్: రెండో ఏఎన్ఎంల ఆందోళన వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసి అధికారుల హామీతో విరమించిన ఏఎన్ఎంలు... హామీలు నెరవేరకపోవడంతో తిరిగి సమ్మె చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్ ప్రజారోగ్య సంచాలకుడి కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. గత కొన్నాళ్లుగా ఏఎన్ఎంలు ఆందోళనలు, నిరసనలు చేస్తుండటం తెలిసిందే. అందులో భాగంగా ఆగస్టు 16 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవగా ప్రభుత్వం నాలుగుసార్లు వారితో చర్చలు జరిపింది. సెప్టెంబర్ ఒకటిన యూనియన్ నేతలతో జరిగిన చర్చల్లో ఏఎన్ఎంల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ వేయాలని నిర్ణయించింది. దీంతో ఒప్పందం ప్రకారం అదే నెల నాలుగో తేదీ నుంచి ఏఎన్ఎంలు సమ్మె విరమించారు. ఒప్పందంలో భాగంగా సెపె్టంబర్ నెల 15గా పీఆర్సీ బకాయిలతోపాటు సమ్మె కాలపు వేతనాన్ని ఈ నెల జీతంతో చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. కానీ సమ్మె విరమించి నెల రోజులైనా ఇప్పటివరకు తమ డిమాండ్లను పరిష్కరించలేదని ఏఎన్ఎంలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఆందోళనకు దిగారు. ఇవీ ప్రధాన డిమాండ్లు... ♦ నోటిఫికేషన్లో ఇచ్చిన బేసిక్ పేతో 100 శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలి. పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. రూ. 10 లక్షల ఆరోగ్య బీమా, ఏఎన్ఎంలు దురదృష్టవశా త్తూ మరణిస్తే రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేíÙయాను అందించడంతోపాటు వారి కుటుంబంలో ఒకరికి 6 నెలల్లోగా కారుణ్య నియామకం కింద కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని ఇవ్వాలి. ♦ కాంట్రాక్ట్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత పూర్తి కాలానికి గ్రాట్యుటీ చెల్లించాలి. ♦ సమ్మె కాలానికి సంబంధించిన జీతం విడుదల చేయాలి. ♦ కరోనాకాలంలో మరణించిన రెండో ఎఎస్‌ఎంలను గుర్తించి వారి కుటుంబాలకు రూ. 5 లక్ష ల ఎక్స్‌గ్రేíÙయా చెల్లించడంతోపాటు వారి కుటుంబంలో ఒకరికి అర్హతను బట్టి కాంట్రాక్ట్ బేసిక్ లోనైనా సరే కారుణ్య నియామకం చేపట్టాలి. ♦ యూపీహెచ్‌సీల్లో పనిచేసే వారికి కూడా íపీహెచ్సీ వాళ్లకు ఇచ్చినట్లే రెండు మార్కుల వెయిటేజీ ఇవ్వాలి. ♦ నవంబర్ 10న జరిగే పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుగా అక్టోబర్ 10 నుంచి నవంబర్ 10 వరకు వేతనంతో కూడిన ప్రిపరేషన్ హాలిడేస్ ఇవ్వాలి. ♦ పీహెచ్‌సీల్లో ఫస్ట్ ఏఎస్‌ఎంలు లేని సబ్ సెంటర్లలో పనిచేస్తున్న రెండో ఏఎస్‌ఎంకు రూ. 10 వేల అదనపు వేతనాన్ని అందించాలి. ♦ 8 గంటల పని విధానాన్ని అమలు చేస్తూ సాయంత్రం 6 గంటల తర్వాత ఏదైనా రిపోర్టు పంపాలని ఒత్తిడి చేయకూడదు. ♦ యూనిఫాం అలవెన్స్ కింద రూ. 4,500 ఇవ్వాలి. ♦ లక్ష్యాలను నిర్దేశిస్తూ జీతాలను నిలిపే ప్రక్రియను ఆపాలి. ♦ సమ్మె సందర్భంగా ఇచ్చిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలి. ♦ వివాహం కాకముందు ఉద్యోగంలో నియమితులైన ఏఎస్‌ఎంలను వారి భర్తల సొంత మండలాలకు బదిలీ చేయడానికి అవకాశం కల్పించాలి. ∙పరీక్షను ఆఫ్‌లైన్‌లోనే ఓఎంఆర్ షీట్‌తో నిర్వహించాలి. -
కాంట్రాక్టు ఏఎన్ఎంలకు 30% వెయిటేజీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద ఎంపికైన ఏఎన్ఎం–2 (సెకండ్ ఏఎన్ఎం)లకు తాజాగా తలపెట్టిన నియామకాల ప్రక్రియలో 30 శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య విభాగం సంచాలకుడు జి.శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు 20 శాతం వెయిటేజీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిందని, కానీ క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి మరో 10 శాతం మార్కులను వెయిటేజీ రూపంలో ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. శనివారం కోఠిలోని తన కార్యాలయంలో ఆయన ఏఎన్ఎం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. చర్చల అనంతరం సంఘాల నేతలు ప్రభుత్వ నిర్ణయాలపై సానుకూలత వ్యక్తం చేసినట్లు శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. ఎన్హెచ్ఎం కింద రాష్ట్రంలో ప్రభుత్వం 5,198 మందిని రెండో ఏఎన్ఎంగా నియమించిందన్నారు. వీరి సర్వీసును క్రమబద్దికరించేందుకు ఎలాంటి ప్రాతిపదికలు లేవన్నారు. దీంతో క్రమబద్దికరణ అసాధ్యమని ప్రభుత్వం తేల్చిందని, ఈ క్రమంలో పోస్టుల లభ్యత ఆధారంగా నియామకాలు చేపడుతున్నప్పటికీ సర్వీసు ఆధారంగా గరిష్టంగా 30 శాతం మార్కులు వెయిటేజీ రూపంలో ఇస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,520 ఏఎన్ఎం ఖాళీల భర్తీకి తొలుత మెడికల్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిందని, ఆ తర్వాత మరిన్ని పోస్టులు మంజూరు కావడంతో 411 పోస్టులను అదనంగా కలిపామని, దీంతో పోస్టుల సంఖ్య 1,931కి పెరిగిందని చెప్పారు. తుది నియామకం జరిగే నాటికి మరిన్ని పోస్టులు ఖాళీ అయితే వాటిని కూడా కలిపి నియామకాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ఖాళీల ఆధారంగా పనిచేస్తున్న ఏఎన్ఎంలను క్రమబద్దికరించడం సాధ్యం కాదని, అందుకే అర్హత పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నవంబర్ రెండో వారంలో ఏఎన్ఎం అర్హత పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రతి ఆర్నెళ్లకు రెండు పాయింట్లు.. రాష్ట్రంలో సెకండ్ ఏఎన్ఎంలుగా 2008 నుంచి నియమితులైన వారున్నారని, మైదాన ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి ప్రతి ఆరునెలలకు 2 పాయింట్లు ఇస్తున్నామని, ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే వారికి రెండున్నర పాయింట్లు ఇస్తున్నామని శ్రీనివాసరావు చెప్పారు. గరిష్టంగా ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన వారికి 30 శాతం వెయిటేజీ వస్తుందని, ఈ క్రమంలో తాజా నియామకాల ప్రక్రియలో వంద శాతం అవకాశాలు వీరికే వస్తాయని వెల్లడించారు. తాజాగా నియామకాల ప్రక్రియలో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 49 సంవత్సరాలకు పెంచామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 53 సంవత్సరాలుగా ఖరారు చేశామని తెలిపారు. ఎన్హెచ్ఎం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైనప్పటికీ రాష్ట్రంలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలకు నెలవారీగా రూ.27,300 వేతనంగా ఇస్తున్నామన్నారు. ఏఎన్ఎంలు మొండిగా సమ్మె కొనసాగిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
ఏపీ: మత్తు వదలాలి.. స్క్రీనింగ్ చేస్తున్న ఏఎన్ఎంలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని నియంత్రించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. నాన్ కమ్యూనికబుల్ డిసీజస్(ఎన్సీడీ) 2.0 సర్వే ద్వారా పొగాకు వ్యసనపరులను గుర్తిస్తోంది. ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను స్క్రీనింగ్ చేస్తున్నారు. బీడీ, చుట్టా, సిగరెట్‌తో పాటు, గుట్కా, ఖైనీ తదితర పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్న వారి వివరాలను తెలుసుకుంటున్నారు. ఇప్పటికే 2,13,12,792 మందిని స్క్రీనింగ్ చేసి.. 2,96,226 మంది పొగాకు వ్యసనపరులను గుర్తించారు. వీరిని పొగాకు వినియోగం నుంచి దూరం చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచి వైద్య నిపుణులు ఫోన్ చేసి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 1,86,303 మందికి ఫోన్ చేశారు. తొలుత కాల్‌సెంటర్ ఎగ్జిక్యూటివ్ పొగాకు వినియోగించే వ్యక్తికి ఫోన్ చేసి ఆ వ్యక్తి ఏం పనిచేస్తుంటారు? ఎన్నేళ్ల నుంచి పొగాకు వినియోగిస్తున్నారు? తదితర వివరాలను తెలుసుకుంటున్నారు. పొగాకు వినియోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరిస్తున్నారు. వ్యసనాన్ని వీడటానికి మొగ్గు చూపిన వారిని కాల్ సెంటర్లోని కౌన్సెలర్‌కు ట్యాగ్ చేస్తున్నారు. వారు పొగాకు వినియోగాన్ని వీడేలా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అనంతరం జిల్లాల్లోని డీ–అడిక్షన్ సెంటర్లకు సంబంధిత వ్యక్తులను ట్యాగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 1,86,303 మందికి గాను 10,066 మంది పొగాకు వినియోగాన్ని వదలిపెట్టేందుకు ముందుకు వచ్చారు. డీ–అడిక్షన్ సెంటర్లలోని వైద్యులు వీరికి ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. మరోవైపు డీ–అడిక్షన్ సెంటర్‌కు మ్యాపింగ్ అయిన వ్యక్తులకు అక్కడ చికిత్స ఏ విధంగా అందుతోంది? వారిలో మార్పు వచ్చిందా? అనే అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా వెబ్ అప్లికేషన్ రూపొందిస్తున్నారు. త్వరలో ఈ అప్లికేషన్ అందుబాటులోకి రానుంది. -
గొడ్డు చాకిరీ చేస్తున్నా వేతనాలు పెంచడం లేదు
-
సెకండ్ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలి
షాద్‌నగర్‌రూరల్: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని మండల పరిషత్ కార్యాలయం ఎదుట సెకండ్ ఏఎన్ఎంలు చేపట్టిన సమ్మె గురువారం 32వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సీఐటీయూ కమిటీభ్యులు యాదగిరి మాట్లాడుతూ సెకండ్ ఏఎన్ఎంలు 32రోజులుగా సమ్మె చేస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచి ఎమ్మెల్యేలకు లక్షల్లో వేతనాలను పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.. కాంట్రాక్టు ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయడంతోపాటు ఉద్యోగ భద్రతను కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు షేక్‌వలీ, శివ, లింగం, ఎఎన్ఎంలు నిర్మల, సంతోష, సరళ, జ్యోతి, తిరుపతమ్మ, సులోచన పాల్గొన్నారు. -
సమస్యలను పరిష్కరించాలి
ఆమనగల్లు: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని రెండవ ఏఎన్ఎంలు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రెండవ ఏఎన్ఎంలు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 26వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరంలో ఏఎన్ఎంలు ఒకరోజు దీక్షనిర్వహించారు. రెండవ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని, పదో పీఆర్సీ ప్రకారం వేతనాలను అందించాలని, ఇతర అలవెన్సులను అందించాలని ఎఎన్ఎంలు కోరారు. సమస్యల పరిష్కారం కోసం గత 26 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికి ప్రభుత్వం స్పందించడం లేదని వారు ఆరోపించారు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా సమ్మె కొనసాగిస్తామని ఎఎన్ఎంలు చెప్పారు. సమ్మెలో రెండవ ఎఎన్ఎంలు మంజుల, మారతమ్మ, పద్మ, రాజేశ్వరీ, సునీత, పార్వతి, ఆసీఫా, కరుణశ్రీ, సునీతాబాయి తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య సమస్యలపై అప్రమత్తత అవసరం
భీమవరం టౌన్ : మహిళలకు వచ్చే ఆరోగ్య సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్ కె.శంకర్రావు అన్నారు. స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో శుక్రవారం వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలకు మాస్టర్ హెల్త్ చెకప్ యాప్‌పై శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 35 సంవత్సరాల వయసు నిండిన మహిళలకు వస్తున్న వ్యాధులను గుర్తించి అందించాల్సిన వైద్యసేవలను ఆయన వివరించారు. మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించడం, ఆరోగ్య వివరాలను యాప్‌లో నమోదు చేసే విధానం తెలిపారు. ఆధార్ కార్డు నంబర్ నమోదు చేసుకుని ట్యాబ్‌లలో సమాచారం నిక్షిప్తం చేసుకుని వారి అనుమతితో ఫొటోలు తీసుకోవాలన్నారు. మహిళ ఆరోగ్య సమాచారం గోప్యంగా ఉంచాలని సూచించారు. అనంతరం ఏఎన్ఎంలకు సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే విధానాన్ని వివరించారు. తొలుత భీమవరం ఏరియా ఆసుపత్రిని శంకర్రావు సందర్శించి పిల్లలకు స్వయంగా వైద్యం చేశారు. కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి డాక్టర్ నవీనా, ఆకివీడు పీహెచ్సీ డాక్టర్ మాధవికళ్యాణి, పబ్లిక్ హెల్త్ డిస్ట్రిక్ క్వాలిటీæ ఎన్సూరెన్స్ ఆఫీసర్ కె.మనోజ్‌కుమార్ పాల్గొన్నారు. -
రెండో ఏఎన్ఎంల వంటావార్పు
కరీంనగర్ : సమ్మెలో భాగంగా రెండో ఏఎన్ఎంలు సమ్మెలో భాగంగా బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట వంటావార్పు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 24 రోజులుగా ఏఎన్ఎంలు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రెగ్యులరైజేషన్, వేతనాల పెంపు, ఇతర డిమాండ్లపై రాతపూర్వక ఒప్పందమయ్యే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. జ్యోతి, రమణారెడ్డి, శారద, చిలుకమ్మ, విజయలక్ష్మి, రజిత, సత్యగంగ, వనజ, శైలజ, జమున, దుర్గ, కనుకమహాలక్ష్మి, శ్యామల, స్వరూప పాల్గొన్నారు. -
ఇష్టం ఉంటే చేయండి.. లేకుంటే లేదు
⇒ రూ. పదివేల వేతనం సరిపోవడం లేదా? ⇒ ఏఎన్ఎంలను ప్రశ్నించిన జెడ్పీ చైర్పర్సన్ వికారాబాద్ రూరల్ : ‘పనిచేస్తే రూ.10 వేలు ఇస్తున్నారు కదా.. అవి సరిపోవా.. సరిపోక పోతే వెళ్లిపోండి. చాలా మంది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సర్పంచులకు కేవలం రూ.5 వేలు వస్తున్నాయి.. వారికంటే ఎక్కువ కావాలా మీకు’ అని జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి ఏఎన్ఎంలను ప్రశ్నించారు. శుక్రవారం హరితాహారంలో పాల్గొన్న ఆమె వికారాబాద్ అతిథిగృహానికి చేరుకున్నారు. అదే సమయంలో ఏఎన్ఎంలు ర్యాలీగా వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని జెడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యే సంజీవరావులకు వినతిపత్రం సమర్పించారు. తమకు కేవలం రూ.10 వేల జీతం వస్తుందని.. జీఓ ప్రకారం వేతనాలు ఇవ్వాలని వారికి విన్నవించారు. దీంతో జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ‘మీకు 10 వేలు వస్తున్నాయి అక్కడ ప్రజా ప్రతినిధులు సర్పంచులకు కేవలం 5 వేలు జీతం మాత్రమే వస్తుంది. మీకు రూ. 10 వేలు సరిపోవా అంటూ ఘాటుగా స్పందించారు. మీకు ఇష్టం ఉంటే పని చేయండి లేకుంటే మానేయండి. చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారన్నారు. ఎప్పుడు ప్రభుత్వం ఏమీ చేయడం లేదనడమేన మీ పని అని ఆగ్రహిస్తూ అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆమె వ్యాఖ్యలకు నిరసనగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు నినాదాలు చేశారు. శనివారం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంల డివిజన్ అధ్యక్షురాలు అనిత, నాయకురాలు శోభరాణి, ఏఎన్ఎంలు అనంతమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్న రెండో ఏఎన్ఎంలు
కాటారం : కాటారం మండల కేంద్రంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రెండో ఏఎన్ఎంలు శుక్రవారం మంత్రి చందూలాల్ కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. మేడిపల్లి ఆశ్రమ పాఠశాలలో నూతన భవన సముదాయాన్ని ప్రారంభించిన మంత్రి మహదేవపూర్ పయనమయ్యారు. మార్గమధ్యంలో మండల కేంద్రానికి వస్తున్నారని తెలుసుకున్న రెండో ఏఎన్ఎంలు ప్రధాన కూడలి వద్ద రాస్తారోకో చేపట్టి మంత్రి కాన్వయ్‌ని అడ్డుకున్నారు. ఇది గమనించిన మంత్రి వాహనం దిగి వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇలా నిరసన తెలపడం సబబుకాదని సూచించారు. గత పది రోజులుగా దీక్ష చేస్తున్నా తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని రెండో ఏఎన్ఎంలు మంత్రితో తమ గోడు వెళ్లబోసుకున్నారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని మంత్రి ఏఎన్ఎంలకు హామీ ఇచ్చారు. -
కొనసాగుతున్న రెండో ఏఎన్ఎంల సమ్మె
కాగజ్‌నగర్ : కాగజ్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పని చేస్తున్న రెండో ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న సమ్మె బుధవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపరిష్కత సమస్యలను వెంటనే పరిష్కరించి, న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు లక్ష్మి, వెంకట లక్ష్మి, సురేఖ, విజయ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి
నాగర్‌కర్నూల్‌రూరల్: రెండో ఏఎ¯Œæఎంలు తమ డిమాండ్ల సాధన కోసం తొమ్మిదిరోజులుగా చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వం మొండివైఖరి వీడి వాటి పరిష్కారానికి కృషిచేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు కందికొండ గీత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నల్లవల్లి చౌరస్తాలో రెండో ఏఎన్ఎంలతో కలిసి రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజారోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ పనిచేస్తున్న రెండో ఏఎన్ఎంలపై ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. చర్చలకు పిలవకపోవడం కార్మికుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలుపుతుందన్నారు. పదో పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని, ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని, డ్యూటీలో మరణించిన ఉద్యోగులకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామయ్య, ఏఎన్ఎంల సంఘం జిల్లా అధ్యక్షురాలు సుగుణ, కళావతి, అరుణ, కృష్ణలీల, లక్ష్మీనర్సమ్మ, విజయలక్ష్మి, శ్రీదేవి, హైమావతి, లక్ష్మి, నాయకులు కొట్ర నవీన్, అశోక్ పాల్గొన్నారు. -
కొనసాగుతున్న రెండో ఏఎన్ఎంల సమ్మె
మూడో రోజుకు చేరిన సమ్మె నియోజకవర్గ వ్యాప్తంగా సమ్మెలో ఏఎన్ఎంలు కాగజ్‌నగర్ : కాగజ్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండో ఏఎన్ఎంలుగా సేవలందిస్తున్న ఉద్యోగుల సమ్మె బుధవారం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు మాట్లాడుతూ ప్రభుత్వం తమను రెగ్యూలర్ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా 10వ పీఆర్సీని అమలు చేయాలని, యునిఫాం అలవెన్సులు చెల్లించాలని కోరారు. అపరిష్కతంగా ఉన్న సమస్యలు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో రెండవ ఏఎన్ఎంలు లక్ష్మి, వెంకటలక్ష్మి, సురేఖ, విజయ తదితరులు పాల్గొన్నారు. కౌటాల : మండలంలోని కాంట్రాక్ట్ రెండో ఏఎన్ఎంలను రెగ్యూలర్ చేయాలని రజక సంఘం మండల అధ్యక్షులు రాచకొండ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నా రెండో ఏఎన్ఎంలకు సరిౖయెన జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.