రెండో ఏఎన్‌ఎంల వంటావార్పు
Published Wed, Aug 10 2016 11:08 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
కరీంనగర్ : సమ్మెలో భాగంగా రెండో ఏఎన్‌ఎంలు సమ్మెలో భాగంగా బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట వంటావార్పు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 24 రోజులుగా ఏఎన్‌ఎంలు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రెగ్యులరైజేషన్, వేతనాల పెంపు, ఇతర డిమాండ్లపై రాతపూర్వక ఒప్పందమయ్యే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. జ్యోతి, రమణారెడ్డి, శారద, చిలుకమ్మ, విజయలక్ష్మి, రజిత, సత్యగంగ, వనజ, శైలజ, జమున, దుర్గ, కనుకమహాలక్ష్మి, శ్యామల, స్వరూప పాల్గొన్నారు.
Advertisement
Advertisement