- మూడో రోజుకు చేరిన సమ్మె
- నియోజకవర్గ వ్యాప్తంగా సమ్మెలో ఏఎన్‌ఎంలు
కొనసాగుతున్న రెండో ఏఎన్‌ఎంల సమ్మె
Published Wed, Jul 20 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
కాగజ్‌నగర్ : కాగజ్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండో ఏఎన్‌ఎంలుగా సేవలందిస్తున్న ఉద్యోగుల సమ్మె బుధవారం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏఎన్‌ఎంలు మాట్లాడుతూ ప్రభుత్వం తమను రెగ్యూలర్ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా 10వ పీఆర్సీని అమలు చేయాలని, యునిఫాం అలవెన్సులు చెల్లించాలని కోరారు. అపరిష్కతంగా ఉన్న సమస్యలు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో రెండవ ఏఎన్‌ఎంలు లక్ష్మి, వెంకటలక్ష్మి, సురేఖ, విజయ తదితరులు పాల్గొన్నారు.
కౌటాల : మండలంలోని కాంట్రాక్ట్ రెండో ఏఎన్‌ఎంలను రెగ్యూలర్ చేయాలని రజక సంఘం మండల అధ్యక్షులు రాచకొండ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నా రెండో ఏఎన్‌ఎంలకు సరిౖయెన జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
Advertisement