ఆరోగ్య సమస్యలపై అప్రమత్తత అవసరం | care taken on health problems | Sakshi
Sakshi News home page

ఆరోగ్య సమస్యలపై అప్రమత్తత అవసరం

Published Fri, Aug 12 2016 8:44 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

ఆరోగ్య సమస్యలపై అప్రమత్తత అవసరం

ఆరోగ్య సమస్యలపై అప్రమత్తత అవసరం

భీమవరం టౌన్‌ : మహిళలకు వచ్చే ఆరోగ్య సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్‌ కె.శంకర్రావు అన్నారు. స్థానిక ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ భవనంలో శుక్రవారం వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలకు మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ యాప్‌పై శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 35 సంవత్సరాల వయసు నిండిన మహిళలకు వస్తున్న వ్యాధులను గుర్తించి అందించాల్సిన వైద్యసేవలను ఆయన వివరించారు. మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించడం, ఆరోగ్య వివరాలను యాప్‌లో నమోదు చేసే విధానం తెలిపారు.
ఆధార్‌ కార్డు నంబర్‌ నమోదు చేసుకుని ట్యాబ్‌లలో సమాచారం నిక్షిప్తం చేసుకుని వారి అనుమతితో ఫొటోలు తీసుకోవాలన్నారు. మహిళ ఆరోగ్య సమాచారం గోప్యంగా ఉంచాలని సూచించారు. అనంతరం ఏఎన్‌ఎంలకు సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే విధానాన్ని వివరించారు. తొలుత భీమవరం ఏరియా ఆసుపత్రిని శంకర్రావు సందర్శించి పిల్లలకు స్వయంగా వైద్యం చేశారు. కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి డాక్టర్‌ నవీనా, ఆకివీడు పీహెచ్‌సీ డాక్టర్‌ మాధవికళ్యాణి, పబ్లిక్‌ హెల్త్‌ డిస్ట్రిక్‌ క్వాలిటీæ ఎన్సూరెన్స్‌ ఆఫీసర్‌ కె.మనోజ్‌కుమార్‌ పాల్గొన్నారు. 
 
 
 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement