సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది.. మెట్రో రైళ్లలో ప్రయాణించే స్కూల్, కాలేజీ విద్యార్థులకు కొత్తగా స్టూడెంట్ పాస్ సదుపాయాన్ని కల్పించినట్లు వెల్లడించింది. 20 ట్రిప్పులకు పాసు తీసుకుని 30 ట్రిప్పులు తిరిగే అవకాశాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. జూలై 1 నుంచి మార్చి 31, 2024 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. విద్యాసంస్థల ఐడీ కార్డును చూపించి స్టూడెంట్ పాస్ మెట్రో కార్డును విద్యార్థులు పొందాలని పేర్కొంది.
ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెట్ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ రెడ్డి, L&T మెట్రో రైల్ హైదరాబాద్ సీఈవో కేవీబీ రెడ్డి శనివారం అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో స్టూడెంట్ పాస్-2023 ఆఫర్‌ను ప్రారంభించారు. దీని ప్రకారం ఒక విద్యార్ధికి ఒక స్మార్ట్ కార్డ్ మాత్రమే జారీ చేయనున్నారు. ఏప్రిల్ 1,1998 తర్వాత జన్మించిన విద్యార్థులు మాత్రమే పాస్ పొందేందుకు అర్హులు.
ఈ పాస్ సహాయంతో నెల రోజుల్లో 30 రైడ్‌లు చేయవచ్చు 9 నెలల వ్యాలిడిటీతో ఈ పాస్ అందిస్తున్నారు. ఈ ఆఫర్ జూలై 1, 2023 నుండి మార్చి 31, 2024 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ పాస్‌లను జేఎన్టీయూ కాలేజీ, ఎస్సార్ నగర్, అమీర్‌పేట్, విక్టోరియా మెమోరియల్, దిల్‌సుఖ్‌నగర్, నారాయణగూడ, నాగోల్, పరేడ్ గ్రౌండ్స్, బేగంపేట్, రాయదుర్గ్ స్టేషన్‌లలో అందుబాటులో ఉంటుంది.
చదవండి: రేపు వరంగల్‌లో బీజేపీ సన్నాహక సమావేశం.. ఆ నేతలు కలిసి పనిచేసేనా?
Introducing the Metro Student Pass.
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) July 1, 2023
An ultimate and convenient tool for Hyderabadi Students to ride the metro way.
Get a brand new student pass metro card by showing your college ID card, recharge for 20 rides, and get 30 rides in 30 days. School/college-going is now made easier… pic.twitter.com/rHjDhQGPqU
Comments
Please login to add a commentAdd a comment