
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మెట్రో రైళ్లకు ఫ్లెక్సీల గండం తప్పడం లేదు. మరోసారి ఫ్లెక్సీలు మెట్రో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగించాయి. ఆదివారం మధ్యాహ్నం ఈదురు గాలులు వీయడంతో ప్యారడైజ్-బేగంపేట మార్గంలో మెట్రో రైళ్ల వైర్లపై ఫ్లెక్సీలు పడ్డాయి. గాలులకు ఎగిరివచ్చిన ఫ్లెక్సీలు తీగలపై పడటంతో దాదాపు అరగంట పాటు రైళ్లు ఆగిపోయాయి.
రాకపోకలకు ఆటంకం ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఫ్లెక్సీని తొలగించాక రైళ్లు యధావిధిగా నడస్తున్నాయని మెట్రో అధికారులు ప్రకటించారు. మెట్రో మార్గంలో భారీ ఫ్లెక్సీలు లేకుండా చూసుకుంటామన్న ప్రభుత్వ అధికారుల హామీ అమలుకు నోచుకోకపోవడంతోనే ప్రతిసారి ఇలాంటి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ప్యారడైజ్-బేగంపేట మధ్య నిలిచిపోయిన మెట్రో
Comments
Please login to add a commentAdd a comment