flexsi
-
వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఓర్వలేక కూటమి కక్షసాధింపు చర్యలు
-
మంత్రి, ఎమ్మెల్యేకే ఫ్లెక్సీలు కడతారా?
కూసుమంచి: ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌లో మత్స్యశాఖ ఆధ్వర్యాన ఆదివారం ఏర్పాటుచేసిన చేప పిల్లల విడుదల కార్యక్రమం ప్రొటోకాల్ వివాదానికి దారితీసింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రకు అధికారులు ఆహ్వానం అందించారు. కార్యక్రమం ఉదయం 10 గంటలకు మొదలుకావలసి ఉండగా, పదిన్నర సమయాన హైదరాబాద్ నుండి ఎమ్మెల్సీ, ఎంపీలు రిజర్వాయర్ వద్దకు వచ్చారు. అప్పటికింకా ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి చేరుకోలేదు. దీంతో ఎమ్మెల్సీ తాతా మధు.. ఎమ్మెల్యే ఎక్కడి వరకు వచ్చారంటూ ఆరాతీయగా మార్గమధ్యలో ఉన్నారని డీఎఫ్‌వో ఆంజనేయస్వామి బదులిచ్చారు. సమయపాలన లేకుంటే ఎలా? అంటూ ఎమ్మెల్సీ ఒకింత అసహనానికి గురవుతూనే, పక్కనే ఉన్న ఫ్లెక్సీలలో.. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, కలెక్టర్ గౌతమ్ ఫొటోలతో మూడు ఫ్లెక్సీలను గమనించారు. దీంతో ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ‘మీరు ఆఫీసర్లు ఆఫీసర్లుగా ఉండాలి.. పనికిమాలిన పనులు చేయొద్దు. మీరు గవర్నమెంట్ అధికారి కాబట్టి ఎవరికీ ఊడిగం చేయొద్దు.. అందరికీ ఫ్లెక్సీలు ఎందుకు పెట్టలేదు? ఎమ్మెల్యే, మంత్రికే ఫ్లెక్సీలే ఎందుకు పెట్టారు.. గవర్నమెంట్ మీకు చెప్పిందా?’ అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడి నుండి ఎంపీలు, ఎమ్మెల్సీ ఖమ్మం వెళ్లిపోయారు. కాసేపటికి వచ్చిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి రిజర్వాయర్‌లో చేపపిల్లలను విడుదల చేశారు. అంతకుముందు జరిగిన ఘటనపై అధికారులను మందలించడమే కాక ప్రొటోకాల్ పాటించకపోతే ఎలా? అంటూ ప్రశ్నించారు. కాగా, కార్యక్రమం ముగిశాక ఎంపీ, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని అధికారులు ఏర్పాటు చేయడం కొసమెరుపు. ఇదీ చదవండి: ఈడీ లేకుంటే బీజేపీనే లేదు -
బీజేపీ ఫ్లెక్సీలు.. ఊహించని షాకిచ్చిన జీహెచ్ఎంసీ
తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వాడివేడీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. పార్టీ నేతలు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. తీవ్ర విమర్శ గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగబోయే ప్రధాని మోదీ సభపైనే అందరి దృష్టి ఉంది. ఇక, తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన నేతలు హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో బీజేపీ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు.. భారీ సంఖ్యలో బీజేపీ నేతలకు జరిమానాలు విధించారు. ఇప్పటి వరకు రూ. 20 లక్షల వరకు జరిమానా విధించినట్టు సమాచారం. అయితే, బీజేపీ ఫ్లెక్సీలకు ట్విట్టర్ వేదికగా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే జరిమానాలు విధించినట్టు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. అలాగే, అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలకు సైతం దాదాపు రూ. 3 లక్షల వరకు జరిమానా విధించినట్టు అధికారులు తెలిపారు. కాగా, ఆదివారం వచ్చిన ఫిర్యాదులపై రేపు(సోమవారం) జరిమానాలు విధిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ సభ: సోమవారం ఉదయం వరకు ఆ రోడ్డు మూసివేత -
కమలోత్సాహం! మినీ ఇండియాలాంటి నగరం పైనే ఫోకస్
భాగ్యనగరం కాషాయమైంది. గల్లీగల్లీ నేతలతో నిండిపోయింది. ఫ్లెక్సీలు, కటౌట్లతో సందడి నెలకొంది. ఎన్నికల సమయంలో ఉండే హడావుడి ఇప్పుడే కన్పిస్తోంది. అగ్రనేతల దూకుడుతో కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శల కౌంటర్..ఎన్కౌంటర్లతో రాజకీయ వేడి రగులుకుంది. శనివారం నుంచి ప్రారంభమయ్యే భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ...రానున్న ఎన్నికలకు రాష్ట్ర శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. మూడవ రోజు బహిరంగ సభలో ప్రధాని మోదీ ఏం మాట్లాడుతారోనన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా భాగ్యనగరంలో జరుగుతున్న బీజేపీ సమావేశాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. సాక్షి, హైదరాబాద్: కమలం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ కార్యవర్గ సమావేశాలకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఇతర దిగ్గజ నేతలు హాజరవుతోన్న ఈ సమావేశానికి మినీ ఇండియా లాంటి గ్రేటర్ సిటీ అతిథ్యమిస్తోంది. నగరంలోని అన్ని ప్రధాన రహదారులు కాషాయ శోభ సంతరించుకున్నాయి. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, పార్టీ పతకాలతో అన్ని దారులూ హైటెక్స్ వైపే అన్నట్లుగా తీర్చిదిద్దారు. భిన్న రాష్ట్రాల..సంస్కృతులు..ఆచార వ్యవహారాలు కలగలిసిన భాగ్యనగరంలో గంగా జమునా తహజీబ్ లాంటి మిశ్రమ సంస్కృతి ఏళ్లుగా కొనసాగుతుండడంతో ఇక్కడే సమావేశాల నిర్వహణకు బీజేపీ అధినాయకత్వం ఆసక్తి చూపింది. ఇదే క్రమంలో మహానగరం పరిధిలో పాతనగరంలోని 8 నియోజకవర్గాలు మినహా మిగతా 16 శాసనసభ స్థానాలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టిసారించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పాగా వేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నగరంలో పలు ప్రాంతాల్లోనివసిస్తున్న 15 రాష్ట్రాలకు చెందిన వివిధ సామాజిక వర్గాలు,నేతలు,ప్రముఖులతో ఆపార్టీ అగ్రనేతలు సదస్సులు, సమావేశాలు, సాంస్కృతిక వేడుకలు, సమాలోచనలు,విందు సమావేశాలను గురు,శుక్రవారాల్లో నిర్వహించడం విశేషం. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తల నివాసాల్లోనే అల్పాహారం,భోజనం స్వీకరిస్తూ అందరితో మమేకమవుతోన్న ఆపార్టీ అగ్రనేతలు కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో అన్ని వర్గాల్లో పార్టీ ఎజెండానూ ముందుకు తీసుకెళ్లడంతోపాటు గ్రూపు తగాదాలు లేకుండా బీజేపీ అనుబంధ సంఘాలను సమన్వయం చేస్తూ పార్టీని బలోపేతం చేయడం, బూత్‌స్థాయి కార్యకర్తలు, నేతల్లో కొత్త ఉత్సాహం నింపడమే లక్ష్యంగా పార్టీ నేతల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం విశేషం. ఎన్నికలకు ముందుగానే వ్యూహాత్మకంగా కమలం పార్టీ పావులు కదుపుతుండడంతో ఆ పార్టీ క్యాడర్, నేతల్లో జోష్ నెలకొంది. ముఖ్యమైన నేతలు మాత్రమే హాజరయ్యే కార్యవర్గ సమావేశాల అనంతరం ఆదివారం పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్టీ క్యాడర్‌కు సరికొత్తగా దిశానిర్దేశం చేయనున్నారు. ఈనేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా పార్టీ దూసుకుపోతోందని ఆ పార్టీ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేడర్‌లో జోష్.. గ్రేటర్లో కమలం పార్టీ కేడర్‌లో నయా జోష్ నెలకొంది. జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు పార్టీ అగ్రనేతలు నగరాన్ని సందర్శిస్తుండడం, వీరంతా ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తుండడంతో వారిలో నూతన ఉత్సాహం నెలకొంది. నగరంలో పలు చోట్ల కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పేరిట వెలిసిన ఫ్లెక్సీలు, స్థానిక నాయకులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, కన్వీనర్లు ఏర్పాటు చేసిన కటౌట్లు అగ్రనేతలకు ఘనంగా స్వాగతం పలుకుతున్నాయి. నగరవ్యాప్తంగా ముఖ్య కూడళ్లలో భారీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నలిచాయి. హైటెక్స్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన భారీ స్వాగత ద్వారం హైలెట్‌గా నిలిచింది. పరేడ్‌గ్రౌండ్స్ మైదానంలో ఆదివారం నిర్వహించనున్న ప్రధాని బహిరంగ సభ సందర్భంగా ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ప్రధానమంత్రి మోదీ,ముఖ్య నాయకులు సభ అనంతరం బయటకు వెళ్లేందుకు టివోలి రోడ్డులో మరో ద్వారం ఏర్పాటు చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతోన్న పలువురు కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఇప్పటికే నగరంలోని పలు కీలక నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించడం, కిందిస్థాయి నేతలు, కార్యకర్తలతో మమేకమయి సరికొత్తగా దిశానిర్దేశం చేయడంతోపాటు పలువురు నేతలు క్షేత్రస్థాయిలోనే కార్యకర్తల ఇళ్లలో బస చేయడంతో పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నిండింది. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో సినీనటి, బీజేపీ నేత ఖుష్భూ ప్రత్యేక పూజలు చేయడంతో పాతనగరంలోనూ కమలం పార్టీ కేడర్‌లో జోష్ నిండింది. (చదవండి: రాష్ట్రంలో బీజేపీదే అధికారం) -
‘సాలు దొర’.. ‘సంపకు మోదీ’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో సరికొత్త పోరు మొదలైంది. విమర్శలు ప్రతి విమర్శలు ముదిరి ఫ్లెక్సీలు, కటౌట్ల వార్ వరకు వెళ్లింది. ఇటు ఫ్లెక్సీలు, కటౌట్లతో ‘సాలు దొర.. సెలవు దొర’అంటూ బీజేపీ మోత మోగిస్తుంటే.. దానికి ప్రతిగా ‘సాలు మోదీ.. సంపకు మోదీ’అంటూ టీఆర్ఎస్ దీటుగా హోరెత్తిస్తోంది. ఇరు పార్టీలు హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లు, ముఖ్య ప్రాంతాల్లో ఫ్లెక్సీలు పెట్టడంతోపాటు సోషల్ మీడియాలోనూ పరస్పర విమర్శల యుద్ధం చేస్తున్నాయి. బీజేపీ కార్యవర్గ సమావేశాలు ముగిసేవరకు ఈ ప్రచార యుద్ధం జోరుగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ ఆఫీస్ వద్ద డిస్ప్లేతో మొదలై.. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తుండటంతో ఆ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ‘సాలు దొర.. సెలవు దొర’అంటూ డిజిటల్ కౌంట్ డౌన్‌తో బీజేపీ డిస్ప్లే ఏర్పాటు చేసింది. దీనికి అనుగుణంగా సామాజిక మాధ్యమాల్లో సీఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్ను విమర్శిస్తూ పెద్ద సంఖ్యలో ప్రచారానికి దిగింది. ఇక కార్యవర్గ సమావేశాలు, బహిరంగ సభ నిర్వహణ కోసం చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా పెడుతున్న పోస్టర్లు, ఫ్లెక్సీలు, కటౌట్ల పైనా టీఆర్ఎస్ సర్కారును, కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్లు పెట్టింది. అయితే బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పెట్టిన డిజిటల్ డిస్ప్లే బోర్డును అనుమతి లేదంటూ అధికారులు తొలగించారు. పోటీగా రంగంలోకి టీఆర్ఎస్.. బీజేపీ ప్రచారాన్ని, విమర్శలను తిప్పికొట్టేలా టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్‌లోని పలు కూడళ్లలో ‘సాలు మోదీ.. సంపకు మోదీ’అంటూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘బైబై మోదీ’అంటూ పెద్ద అక్షరాలతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలపై.. ‘సాగు చట్టాలు తెచ్చి రైతులను చంపావు’, ‘నాలుగేళ్ల కాంట్రాక్టు ఉద్యోగాలతో యువత కడుపు కొట్టావు’, ‘లాక్డౌన్ పేరిట గరీబోళ్లను సంపావు’అనే నినాదాలను ముద్రించారు. నోట్ల రద్దు, రైతుచట్టాలు, నల్లధనం వెనక్కి రప్పించడం తదితర అంశాలను ప్రస్తావించారు. ‘ప్రజల ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు ఎక్కడ?’అని ప్రశ్నలు పెట్టారు. ఈ ఫ్లెక్సీలను ప్రస్తావిస్తూ ‘పరేడ్ గ్రౌండ్‌కు వస్తున్నవు కదా.. ఈ పోస్టర్లు ఏపియమంటవా మోదీజీ.. ఎనిమిదేళ్లలో మీ పథకాలు ఎంత మందిని చంపాయో కౌంట్ చేద్దామా తరుణ్ చుగ్గు..’అని ఎద్దేవా చేస్తూ టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ ట్వీట్ చేశారు. హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలతో హల్చల్ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ముఖ్య కూడళ్లను కాషాయ పతాకాలతో అలంకరించడంతోపాటు, ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు భావించారు. కానీ బీజేపీ జెండాలు, ఫ్లెక్సీల కంటే టీఆర్ఎస్ గులాబీ రంగే ఎక్కువగా కనబడేలా హైదరాబాద్‌లో ప్రధాన రహదారులు, జంక్షన్లు, మెట్రో మార్గాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, బస్ షెల్టర్ల వద్ద ఫ్లెక్సీలు వెలిశాయి. వాటిపై టీఆర్ఎస్ అమలు చేస్తున్న రైతుబంధు, కేసీఆర్ కిట్, డబుల్ బెడ్రూం ఇళ్లు తదితర సంక్షేమ కార్యక్రమాల వివరాలు, నినాదాలను రాశారు. బీజేపీ సభ జరిగే పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో, వివిధ మార్గాల్లో మెట్రో పిల్లర్లన్నీ టీఆర్ఎస్ హోర్డింగ్‌లతో నిండిపోయాయి. టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ ప్రారంభించిన ‘బై బై మోదీ’హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌తోపాటు ఇతర సోషల్ మీడియా వేదికలపై ట్రెండింగ్ అవుతోంది. ఫ్లెక్సీలు, కటౌట్లకు చలానాలు హైదరాబాద్‌వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కటౌట్లు, ఫ్లెక్సీలకు జీహెచ్ఎంసీ చలానాలు జారీ చేస్తోంది. కొద్దిరోజుల ముందు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ‘సాలు దొరా.. సెలవు దొరా’అంటూ పెట్టిన డిజిటల్ డిస్ప్లే బోర్డుకు రూ.50 వేలు, ప్రధాని మోదీ– బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫొటోలతో ఉన్న బ్యానర్, కటౌట్లకు రూ.5 వేలు కలిపి రూ.55 వేల జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లపై పౌరుల ఫిర్యాదు మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరిట ఈ–చలానాలు జారీ చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ పేర్కొంది. ఇక ట్విట్టర్ వేదికగా వస్తున్న ఫిర్యాదులకు అనుగుణంగా కూడా జీహెచ్ఎంసీ చలానాలు జారీ చేస్తోంది. ముఖ్యంగా బీజేపీ ఫ్లెక్సీలపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. బుధవారం సాయంత్రం వరకు హైటెక్‌సిటీ, అబిడ్స్, బంజారాహిల్స్, మాదాపూర్, బేగంపేట తదితర ప్రాంతాల్లో వెలసిన ఫ్లెక్సీలు, హోర్డింగులకు దాదాపు రూ. 3.50 లక్షల పెనాల్టీలతో ఈ–చలానాలు జారీ అయినట్టు తెలిసింది. హైటెక్ సిటీలో బండ కార్తీకచంద్రారెడ్డి పేరిట వెలిసిన హోర్డింగ్‌కు రూ.లక్ష చలానా వేశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి పేరిట ఎక్కువ చలానాలు జారీ అయ్యాయి. -
పది పాసైనందుకు విద్యార్థి చేసిన పని... తెగ మెచ్చుకుంటున్న విద్యా మంత్రి
మనం ఏదైనా ఎగ్జామ్ పాసైతే మన దోస్తులకు మనకు తోచిన విధానంలో ఓ చిన్న పార్టీ ఇచ్చి సంబంరం చేసుకుంటాం. బాగా డబ్బు ఉన్నవాడేతే వాడి రేంజ్లో పార్టీ ఇవ్వడమే లేక ఖరీదైన వస్తువులు తల్లిదండ్రులు గిఫ్ట్‌గా ఇవ్వడమో జరుగుతుంది. వీటన్నింటీకీ చాలా భిన్నంగా ఉన్నంతంగా ఒక విద్యార్థి తన సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. వివరాల్లోకెళ్తే...కేరళలో పదోతరగతి ఫలితాలు ఈ నెల 15న విడుదలయ్యాయి. ఈ మేరకు జిష్ణు అనే అబ్బాయి మంచి మార్కులో పదోతరగతి పాసయ్యాడు. దీంతో తన సాధించిన విజయాన్ని చాలా వెరైటీగా సెబ్రేట్ చేసుకున్నాడు జిష్ణు. తనను తాను అభినందించుకంటూ ఒక ఫ్లక్సీ బోర్డు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టికి తెగ నచ్చేసింది. ఈ క్రమంలో ఆ మంత్రి జిష్ణు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీని ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ...ఆ విద్యార్థి ఫ్లెక్సీ బోర్డులో ఏం రాశాడో వివరించారు. ఇంతకీ ఆ అబ్బాయి ఫ్లెక్సీలో.... కొంతమంది వస్తే చరిత్ర మారిపోతుంది. తాను కూడా అంతేనని. అలాగే జీవిత పరీక్షలో కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నాడు. దీంతో మంత్రి ఆ అబ్బాయి తను సాధించిన వియాన్ని సెలబ్రేట్ చేసుకున్న తీరు నచ్చిందని, చదువుకు సంబంధించిన అన్ని విషయాల్లో సహాకరాం అందిస్తాం అని పోస్ట్ చేశారు. కేరళలో ఈ ఏడాది సుమారు నాలుగు లక్షల మంది పైనే పదోతరగతి ఉత్తీర్ణులయ్యారు. ప్రస్తుతం ఈ విషయం ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ప్రపంచంలోనే అందవిహీనమైన ముఖం.. కదిలించే కథ) -
ఐమ్యాక్స్ థియేటర్ వద్ద అపశృతి.. అభిమానికి తీవ్ర గాయాలు
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా థియేటర్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఏ థియేరట్ వద్ద చూసినా డార్లింగ్ అభిమానుల హంగామా కనిపిస్తుంది. సాహో తర్వాత మూడేళ్లకు ప్రభాస్ సినిమా రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో థియేటర్స్ ద్ద భారీ కటౌట్లు పెట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో కర్ణాటకలోని కారంపూడి ఐమ్యాక్స్ థియేటర్ వద్ద అపశృతి నెలకొంది. ఈ ప్రమాదంలో ప్రభాస్ ఫ్యాన్స్‌కి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. థియేటర్ వద్ద 37ఏళ్ల చల్లా కోటేశ్వర రావు అనే వ్యక్తి ఫ్లెక్సీ కడుతుండగా అది విరిగి పక్కనే ఉన్న కరెంట్ తీగలపై పడింది. ఈ ప్రమాదంలో కోటేశ్వర రావు అనే వ్యక్తి విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు. -
ఫ్లెక్సీ క్యాప్ అంటే ఏంటీ? తెలుసుకోండిలా..
స్టాక్‌మార్కెట్‌పై ఇండియన్లలో ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల కాలంలో పెరుగుతున్న డిమ్యాట్ ఖాతాలే ఇందుకు నిదర్శనం. షేర్మార్కెట్లో తక్కువ రిస్క్‌తో ఎక్కువ రాబడి పొందడమనేది ఎంతో కీలకం. ఇందుకు అనుగుణంగా ఉండే వాటిలో ఫ్లెక్సీక్యాప్ పథకం ఒకటి. అసలు ఫ్లెక్సీక్యాప్ అంటే ఏంటీ ? ఇటీవల అధికంగా లాభాలు అందిస్తోన్న ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్కి సంబంధించిన వివరాలు... ఫ్లెక్సీక్యాప్ ఫ్లెక్సీక్యాప్ పథకాలు గతంలో మల్టీక్యాప్ ఫండ్స్ పేరుతో ఉండేవి. మల్టీక్యాప్ పథకాలు కచ్చితంగా స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్ పథకాల్లో 25 శాతం చొప్పున కనీస పెట్టుబడులను నిర్వహించాల్సిందేనని.. లేదంటే ఫ్లెక్సీక్యాప్ విభాగంలోకి మారిపోవచ్చంటూ సెబీ గతేడాది నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో మల్టీక్యాప్ విభాగం నిబంధనలను కట్టుబడలేని పథకాలు ఫ్లెక్సీక్యాప్గా పేరు మార్చుకున్నాయి. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ గడిచిన కొన్నేళ్లలో ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఇన్వెస్టర్లకు మంచి రాబడులను ఇచ్చాయి. ఫ్లెక్సీ క్యాప్ విభాగంలో మార్కెట్ విలువ పరంగా తమకు అనుకూలం అనిపించిన, భవిష్యత్తులో మంచి వృద్ధికి అవకాశం ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసుకునే స్వేచ్ఛ ఫండ్ మేనేజర్లకు ఉంటుంది. ఫలానా విభాగంలో (స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్) కచ్చితంగా ఇంత మేర పెట్టుబడులు పెట్టాలన్న నిబంధనలు ఈ పథకాలకు వర్తించవు. ఈ విభాగంలో కొన్ని పథకాలు గడిచిన ఏడాది కాలంలో గణణీయమైన రాబడులను అందించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీర్ఘకాల లక్ష్యాల కోసం (కనీసం పదేళ్లు అంతకుమించి) ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో ఫ్లెక్సీక్యాప్ పథకాలకు కొంత చోటు కల్పించుకోవచ్చు. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ కూడా ఒకటి. రాబడులు గడిచిన ఏడాది కాలంలో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ ఇన్వెస్టర్లకు 58 శాతం రాబడులను ఇచ్చింది. కానీ ఇదే కాలంలో ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడులు 51 శాతంగానే ఉండడాన్ని గమనించాలి. బీఎస్ఈ 500 సూచీ రాబడులు 53 శాతంతో పోల్చినా ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ పథకం మెరుగైన పనితీరును చూపించినట్టు తెలుస్తోంది. ఇక గత మూడేళ్ల కాలంలో ఈ పథకం ఏటా 14 శాతానికి పైనే సగటు వార్షిక రాబడులను ఇచ్చింది. అంతేకాదు ఐదేళ్లలోనూ, ఏడేళ్లలోనూ, పదేళ్లలో కూడా వార్షిక సగటు రాబడులు 15 శాతం స్థాయిలోనే ఉన్నాయి. నిలకడైన పనితీరును ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. లక్ష ఇన్వెస్టే చేస్తే కోటి రూపాయలు ఆదిత్య బిర్లా ఫెక్సీక్యాప్ పథకంలో 22 ఏళ్ల క్రితం లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి అలాగే కొనసాగించి ఉంటే ప్రస్తుతం రూ.1.04 కోట్లు సమకూరేది. అంటే 104 రెట్లు వృద్ధి చెందేది. వార్షికంగా 22.57 శాతం చొప్పున కాంపౌండింగ్ రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో రిస్క్ ఉన్నా కానీ, దీర్ఘకాలంలో ఈ రిస్క్‌ను మించి రాబడులకు అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్స్‌పై దృష్టి ప్రస్తుతం ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ పథకం నిర్వహణలో రూ.14,571 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. 96.2 శాతం ఈక్విటీల్లో, డెట్ సాధనాల్లో 3.5 శాతం చొప్పున పెట్టుబడులున్నాయి. పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతానికి 65 స్టాక్స్‌ను నిర్వహిస్తోంది. లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో 68 శాతం, మిడ్‌క్యాప్‌లో 25 శాతం, స్మాల్‌క్యాప్‌లో 7 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంది. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 26 శాతం పెట్టుబడులు ఈ విభాగంలోనే ఉన్నాయి. ఆ తర్వాత టెక్నాలజీ రంగ కంపెనీల్లో 14 శాతం, హెల్త్‌కేర్ కంపెనీల్లో 13 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. ఆయా రంగాల్లో దిగ్గజ కంపెనీలు, బలమైన యాజమాన్యాలు, కార్పొరేట్ పాలనలో పారదర్శకత, బలమైన బ్యాలన్స్ షీట్ ఇటువంటి అంశాల ఆధారంగా కంపెనీలను ఫండ్ మేనేజర్లు ఎంపిక చేసుకుంటారు. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం ఐసీఐసీఐ బ్యాంకు 8.77 ఇన్ఫోసిస్ 8.46 హెచ్డీఎఫ్సీ బ్యాంకు 7.05 డాక్టర్ రెడ్డీస్ 6.19 భారతీ ఎయిర్టెల్ 4.35 హెచ్‌సీఎల్ టెక్ 3.66 సన్‌ఫార్మా 2.75 బజాజ్ ఫైనాన్స్ 2.45 కోటక్ బ్యాంకు 2.24 ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ 2.22 -
టీఆర్ఎస్, బీజేపీ పరస్పర దాడులు
గొల్లపల్లి(ధర్మపురి): మండల కేంద్రంలో బుధవారం టీఆర్ఎస్, బీజేపీ నాయకుల పరస్పర దాడులతో ఉద్రిక్తత నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలోని వాసవిమాత ఆలయ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొనాల్సి ఉండగా, కార్యక్రమం రద్దయ్యింది. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలపై స్పష్టతనిచ్చేలా ఇటీవల గొల్లపల్లిలో బీజేపీ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా, మూడురోజులకు పంచాయతీ అధికారులు తొలగించారు. అదే సమయంలో టీఆర్ఎస్ నాయకుల ఫ్లెక్సీలు తొలగించలేదు. తమ ఫ్లెక్సీలను మంత్రి ప్రోద్బలంతోనే తొలగించారంటూ బీజేపీ నాయకులు, టీఆర్ఎస్ నాయకుల ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో వారి మధ్య సోషల్‌మీడియాలో మాటల యుద్ధానికి దారితీసింది. బుధవారం గొల్లపల్లిలో మంత్రి కార్యక్రమాన్ని అడ్డుకుంటామని బీజేపీ నాయకుల వాట్సాప్ గ్రూప్‌లో హెచ్చరించారు. దీంతో పోలీసులు ముందస్తుగా బీజేపీ మండల అధ్యక్షుడు కట్ట మహేశ్, దాదాపు 20 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కన్నం అంజయ్య, కార్యకర్తలతో వాసవిమాత ఆలయం ఆవిష్కరణ జరిగే చోటుకు వచ్చి టీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే ఉన్న టీఆర్ఎస్ నాయకులు సైతం బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక్కసారిగా ఇరువర్గాలు భౌతికదాడులకు దిగాయి. జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ, ధర్మపురి సీఐ రాంచందర్‌రావు పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకొని బీజే పీ నాయకులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో మంత్రి కార్యక్రమం రద్దయింది. స్టేషన్లో ఉన్న బీజేపీ నాయకులను మా జీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. టీఆర్ఎస్ నాయకలను సైతం అరెస్టు చేయాలని ఫిర్యాదు చేశారు.ఠాణాలోనే గుజ్జుల రామకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడుతుండగా కొందరు బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను గోడపై నుంచి ఠాణాలోకి విసిరేశారు. దీంతో స్టేషన్ ఆవరణలో ఉన్న బీజేపీ కార్యకర్తలు దిష్టిబొమ్మను దహనం చేసి, నినాదాలు చేయగా పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఎస్పీ సింధూశర్మకు సమాచారం అందడంతో హుటాహుటిన రంగంలోకి దిగారు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ, నియోజకవర్గ ఇన్చార్జి కన్నం అంజయ్య, మండలాధ్యక్షుడు కట్ట మహేశ్‌తో చర్చించారు. -
ప్యారడైజ్-బేగంపేట మధ్య నిలిచిపోయిన మెట్రో సర్వీసులు
-
హైదరాబాద్ మెట్రో రైళ్లకు ఫ్లెక్సీల గండం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మెట్రో రైళ్లకు ఫ్లెక్సీల గండం తప్పడం లేదు. మరోసారి ఫ్లెక్సీలు మెట్రో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగించాయి. ఆదివారం మధ్యాహ్నం ఈదురు గాలులు వీయడంతో ప్యారడైజ్-బేగంపేట మార్గంలో మెట్రో రైళ్ల వైర్లపై ఫ్లెక్సీలు పడ్డాయి. గాలులకు ఎగిరివచ్చిన ఫ్లెక్సీలు తీగలపై పడటంతో దాదాపు అరగంట పాటు రైళ్లు ఆగిపోయాయి. రాకపోకలకు ఆటంకం ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఫ్లెక్సీని తొలగించాక రైళ్లు యధావిధిగా నడస్తున్నాయని మెట్రో అధికారులు ప్రకటించారు. మెట్రో మార్గంలో భారీ ఫ్లెక్సీలు లేకుండా చూసుకుంటామన్న ప్రభుత్వ అధికారుల హామీ అమలుకు నోచుకోకపోవడంతోనే ప్రతిసారి ఇలాంటి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ప్యారడైజ్-బేగంపేట మధ్య నిలిచిపోయిన మెట్రో -
అనంతపురంలో టీడీపీ నేతల దౌర్జన్యం
-
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్ల దాడి
గుంటూరు: మాచవరం మండలం మోర్జంపాడులో శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు అకారణంగా దాడి చేశారు. శుక్రవారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మోర్జంపాడు గ్రామంలో వైఎస్సార్సీపీ అభిమానులు భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం గ్రామంలో ఉన్న టీడీపీ కార్యకర్తలకు రుచించలేదు. కేవలం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారన్న కారణంతో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన గ్రామానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
ప్రచారం పరిపరి విధాలు..
పార్టీ గుర్తులతో పేపర్ గ్లాసులు సైకిళ్లు, ఫెక్సీలకు భలే గిరాకీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : నామినేషన్ వేసింది మొదలు గుర్తులు కేటాయించాక వాటిని జనంలోకి తీసుకెళ్లేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం పది మందికి తగ్గకుండా అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ఎవరికి ఓట్లు పడతాయో.. ఈవీఎంలో ఏ గుర్తుపై ఓటేస్తారో అర్థంకాని పరిస్థితి. తమదైన శైలిలో ప్రజలకు చేరువయ్యేందుకు కొత్త కొత్త ప్రచారాస్త్రాలను అభ్యర్థులు ఎంచుకున్నారు. సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఊపిరి సలపకుండా ప్రచారం చేస్తున్నారు. తమకు కేటాయించిన గు ర్తుతో ఇంటింటికి తిరుగుతూ పలకరిస్తున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు, ఓటర్లను ఆకట్టుకునేందుకు వారి పనిలో భాగస్వాములవుతున్నారు. ఒక నాయకుడు కొబ్బరిబొండా కొడి తే.. మరొకరు చాయ్ అమ్ముతూ.. ఇంకొకకు హోటల్లో గరిటె తిప్పుతూ.. పొలం గట్ల వెంట కూలీలను పలకరిస్తూ.. బస్సు లు, ఆటోల్లో ప్రయాణికులను కలుస్తూ ప్రచారంతో దూసుకెళ్తున్నారు. ఇవేకాక ఫ్లెక్సీలు, డీజే సౌండ్లతో గల్లీగల్లీ తిరుగుతున్న అభ్యర్థులు ప్రచారంలో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఎల్ఈడీ ద్వారా త్రీజీ షోలలో వారి ప్రసంగాలను ప్రజలకు వినిపిస్తున్నారు. ఈ ప్రచారం కొద్దిమందికే చేరుతుందని గమనించిన అభ్యర్థులు.. గ్రామీణ ఓటర్లకు చేరువయ్యేందుకు కొత్త ప్రచార అస్త్రాలను ఉపయోగిస్తున్నారు. హోటళ్లే అడ్డా.. నలుగురు మిత్రులు కలిసినప్పుడు ఓ హోటల్లో కూర్చొని రాజకీయ, సామాజిక అంశాలపై చిన్నపాటి చర్చ. అయితే చాయ్ తాగి పడేసే పేపర్ కప్పులను కూడా ప్రచార అస్త్రాలు గా నాయకులు మల్చుకున్నారు. చాయ్ కప్పుపై బరిలో నిలిచిన అభ్యర్థుల ఫొటోలు, వారి గుర్తులను ముద్రించి అందజేస్తున్నారు. కొత్తగా కనిపించే కప్పులను తీక్షణంగా పరి శీలిస్తున్న ప్రజలు ఆసక్తికర ప్రచారంపై గంటలకొద్దీ చర్చకు దారితీస్తోంది. దీంతో పార్టీగుర్తు సామాన్యుడికి సైతం సులువుగా గుర్తుండిపోతుందని భావిస్తున్నారు. అంతేకాక ఖర్చు తక్కువ, ప్రచారం ఎక్కు వ ఉండడంతో నాయకులు టీ గ్లాసుల ప్రచారానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. మెదక్ నుంచి జిల్లాకు... పేపర్ కప్పులపై నాయకుల ఫొటోలు, గుర్తులు వేసే సరికొత్త ప్రచారానికి మెదక్ జిల్లా వేదికైంది. పేపర్ గ్లాసులు అంతటా దొరికినప్పటికీ నాయకులకు అనుగుణంగా రంగులను ముద్రించే ప్రొడక్షన్ మాత్రం మెదక్‌లో తయారవుతోంది. సాధారణ పేపర్ గ్లాసుకు 60 పైసలు ఉంటే.. రంగులు అద్దుకున్న ఈ గ్లాసు రూ.1.60 పైసలు పలుకుతోంది. ఫ్లెక్సీలకు గిరాకీ గతంలో క్లాత్‌పై రాసిన బ్యానర్లు సందడి చేసేవి. వాటి స్థానా న్ని ఇప్పుడు ఫ్లెక్సీలు ఆక్రమించాయి. క్షణాల్లో కంప్యూటర్‌పై కొత్త డిజైన్లలో వచ్చే ఫ్లెక్సీలు ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో తమదైన పాత్ర పోషిస్తున్నాయి. దీంతో పలు ఫ్లెక్సీ షాపులు బిజీబిజీగా మారాయి. ఆటోకు మూడు వైపులా సరిపడే ఫ్లెక్సీలు కడితే రూ.3వేలు, టాటా ఏస్‌కు రూ.6వేలు, డీసీఎం, లారీ, బస్సులకు అయితే రూ.15 నుంచి రూ.20వేలు తీసుకుంటున్నారు. ట్రైసైకిళ్లపై కూడా ప్రచారం చేయిస్తున్నారు.